మలింగ బండార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Malinga Bandara
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Herath Mudiyanselage Charitha Malinga Bandara
జననం (1979-12-31) 1979 డిసెంబరు 31 (వయసు 43)
Kalutara, Sri Lanka
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right arm leg break
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Sri Lanka
టెస్టు అరంగ్రేటం(cap 71) 27 May 1998 v New Zealand
చివరి టెస్టు 3 April 2006 v Pakistan
వన్డే లలో ప్రవేశం(cap 127) 6 January 2006 v New Zealand
చివరి వన్డే 1 April 2011 v India
ఒ.డి.ఐ. షర్టు నెం. 72
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2008–present Basnahira South
2006–present Ragama
2010 Kent
2005 Gloucestershire
2004–2005 Galle
2003–2004 Tamil Union
1998–2003 Nondescripts
1996–1997 Kalutara
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 8 31 151 137
సాధించిన పరుగులు 124 160 3,430 1,126
బ్యాటింగ్ సగటు 15.50 12.30 20.17 17.59
100s/50s 0/0 0/0 1/14 0/3
ఉత్తమ స్కోరు 43 31 108 64
బాల్స్ వేసినవి 1,152 1,470 20,994 5,846
వికెట్లు 16 36 431 189
బౌలింగ్ సగటు 39.56 34.22 25.38 24.31
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 14 4
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 2 n/a
ఉత్తమ బౌలింగ్ 3/84 4/31 8/49 5/22
క్యాచులు/స్టంపింగులు 4/– 9/– 95/– 39/–
Source: CricketArchive, 8 February 2011

1979, డిసెంబర్ 31న జన్మించిన మలింగ బండార (Malinga Bandara) శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. 1998లో తొలిసారిగా న్యూజీలాండ్ పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. కాని గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005 మార్చిలో ఇంగ్లాండు-ఏ జట్టుపై 126 పరుగులకు 11 వికెట్లు తీసి అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.భారత్‌పై 3 టెస్టుల సీరీస్‌లో 32.98 సగటుతో 9 వికెట్లు సాధించాడు. 2006 జనవరిలో న్యూజీలాండ్ పై తొలి వన్డే ఆడినాడు. సీరీస్‌లో 23.92 సగటుతో 14 వికెట్లు సాధించి సహచరుడు ముత్తయ్య మురళీధరన్ కంటే మెరుగనిపించుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

మలింగ బండార 8 టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 39.56 సగటుతో 16 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 84 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 15.50 సగటుతో 124 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 43 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

మలింగ 26 వన్డేలలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 32.25 సగటుతో 31 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 31 పరుగులకు 4 వికెట్లు. బ్యాటింగ్‌లో 11.72 సగటుతో 129 పరుగులు చేశాడు. వన్డేలలో అత్యుత్తమ స్కోరు 28 నాటౌట్.