Jump to content

మల్కాజ్‌గిరి నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్
రకం
రకం
నగర పాలక సంస్థ
చరిత్ర
స్థాపితం2026 ఫిబ్రవరి 11
నాయకత్వం
మున్సిపల్ కమీషనర్
టి.వినయ్‌ కృష్ణారెడ్డి (ఐ.ఎ.ఎస్)
నిర్మాణం
సీట్లు 74 డివిజన్లు
రాజకీయ వర్గాలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం, తార్నాక

జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్‌-3(1) ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)తో పాటు సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)గా మూడు నగర పాలక సంస్థలుగా విభజిస్తూ 2026 ఫిబ్రవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2] జీహెచ్‌ఎంసీని మొత్తం 6 జోన్‌లుగా (శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లుగా (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌), 76 డివిజన్లు ఉన్నాయి. మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో మూడు జోన్‌లుగా (మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌), 74 డివిజన్లు ఉన్నాయి.[3][4][5][6]

కార్యాలయం

[మార్చు]

మల్కాజ్‌గిరి జోన్‌లో 26 వార్డులు, ఉప్పల్ 24 వార్డులు, ఎల్‌బి నగర్ 24 వార్డులు ఉంటాయి. గతంలో హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం ఉన్న తార్నాకలో ఎంఎంసి కార్యాలయం ఏర్పాటు చేయబడింది.[7][1]

మూడు కార్పొరేషన్లకు కలిపి ప్రత్యేక అధికారిగా నియమితులైన జయేశ్‌ రంజన్‌ ఫిబ్రవరి 11న బాధ్యతలు స్వీకరించాడు. మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) కమిషనర్‌గా టి.వినయ్‌ కృష్ణారెడ్డి ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టాడు.[8]

పరిపాలనా వ్యవస్థ

[మార్చు]

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని 6 జోన్‌లుగా (మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌), 14 సర్కిళ్ళుగా, 74 వార్డులుగా విభజించారు. కమిషనరు, మహానగర పాలక మండలికి సర్వాధికారి. రాష్ట్ర ప్రభుత్వం, ఐఎఎస్ అధికారిని ఈ పదవిలో నియమిస్తుంది. ప్రతీ జోనుకూ ఒక జోనల్ కమిషనరు ఉంటారు. ప్రతి సర్కిలుకూ ఒక అదనపు కమిషనరు నేతృత్వం వహిస్తారు. ఇంజనీరింగు శాఖకు ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్, చీఫ్ ఇంజనీరు అధిపతులుగా ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక ఎస్.ఇ ఉంటారు. పట్టణ ప్రణాళికా విభాగానికి నేతలుగా అదనపు కమిషనరు (ప్రణాళిక), ఛీఫ్ సిటీ ప్లానరు ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక సిటీ ప్లానరు ఉంటారు.

ఎంఎంసీ పరిధి

[మార్చు]

ఈ కార్పొరేషన్ పరిధిలోకి మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఉప్పల్, ఎల్‌బీనగర్‌ శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా, మేడ్చల్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా కొంతవరకు వస్తున్నాయి.  తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం (టీసీయూఆర్‌) - (Telangana Core Urban Region) పరిధిలో మొత్తంగా 20 శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా, ఆరు అసెంబ్లీల్లో కొంతభాగం వరకు ఉంటాయి.[9][10]

జోన్‌లు

[మార్చు]

మల్కాజ్‌గిరి 3 జోన్‌లు, 14 సర్కిల్‌లను కలిగి ఉంటుంది.[11][12]

  • మల్కాజ్‌గిరి జోన్: కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలాలి, మల్కాజ్‌గిరి
  • ఉప్పల్ జోన్: ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్
  • ఎల్‌బీనగర్ జోన్: నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "GHMC split into 3: Cyberabad, Malkajgiri new corporations". The Times of India. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  2. "హైదరాబాద్: మూడు ముక్కలుగా మహానగరం". BBC News తెలుగు. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  3. "జీహెచ్‌ఎంసీ.. ఇకపై మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ". Eenadu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  4. "మహానగరం ఇక.. 3 కార్పొరేషన్లు". Andhrajyothy. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  5. "Hyderabad Formally Split Into 3 Civic Bodies" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  6. "Six zones with 30 Circles in reorganised GHMC" (in Indian English). The Hindu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  7. "State government restructures GHMC into three bodies to enhance urban management" (in ఇంగ్లీష్). The New Indian Express. 12 February 2026. Retrieved 12 February 2026.
  8. "GHMC Reorganization: Commissioners take charge of 3 newly formed Hyderabad civic bodies" (in ఇంగ్లీష్). Telangana Today. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  9. "జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే." ABP Desam. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  10. "Telangana: Reorganised Greater Hyderabad Municipal Corporation split into three civic bodies" (in Indian English). The Hindu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  11. "మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్.. మీ ఏరియా ఏ జోన్ కిందకు వస్తుందో ఇక్కడ చూడండి?". Hindustan Times. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  12. "మహానగరం.. 3 కార్పొరేషన్లు". Sakshi. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.