Jump to content

మల్లన మంత్రి

వికీపీడియా నుండి

"మల్లన మంత్రి" సా.శ. 1650 పూర్వార్థానికి చెందినవాడు. బోరవెల్లి సీమకు చెందిన కవి. దత్తన్నకు సోదరుడు. బోరవెల్లి నృసింహకవికి తాత. ఇతను ' చంద్రభాను చరిత్ర ' అను ప్రబంధాన్ని రచించాడు. ఇది ఐదు ఆశ్వాసాల గ్రంథం. సత్యాకృష్ణల సంతానమైన చంద్రభానుడు కుండినపురం రాజైన రుక్మబాహు కూతురగు కుముదినిని వివాహమాడుటను ఇతివృత్తంగా చేసుకొని రాసిన గ్రంథమిది. మల్లన దీనిని తన ఇలవేల్పైన శ్రీదత్తాత్రేయస్వామిని మొదటి పద్యమును కీర్తించి గ్రంథాన్ని ఆరంభించాడు. దీని తాళపత్ర ప్రతి హైదరాబాదులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉంది[1]. వీరి నివాస ప్రాంతమే వంశం పేరుగా స్థిరపడిపోయింది, బోరవెల్లి కవులుగా ప్రసిద్ధిచెందారు. వీరు ఆరువేల నియోగుల కుటుంబానికి చెందినవారు. స్వతంత్ర కపి గోత్రం. వీరి ఇలవేల్పు శ్రీ దత్తాత్రేయస్వామి.

మూలాలు

[మార్చు]
  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-64