మల్లవల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మల్లవల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,082
 - పురుషుల సంఖ్య 2,567
 - స్త్రీల సంఖ్య 2,513
 - గృహాల సంఖ్య 1,374
పిన్ కోడ్ 521 111
ఎస్.టి.డి కోడ్ 08656

మల్లవల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందినది. పిన్ కోడ్ నం. 521 111., ఎస్.టి.డి.కోడ్ = 08656.

మల్లవల్లి గ్రామం దృశ్యం

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

బాపులపాడు మండలం[మార్చు]

బాపులపాడు మండలంలోని అంపాపురం, ఆరుగొలను, ఓగిరాల, కాకులపాడు, కురిపిరాల, కొదురుపాడు, కానుమోలు, కొయ్యూరు, చిరివాడ, తిప్పనగుంట, దంతగుంట్ల, బండారుగూడెం, బాపులపాడు, బొమ్ములూరు కండ్రిగ, బొమ్ములూరు, మల్లవల్లి, రంగన్నగూడెం, రామన్నగూడెం, రేమల్లె, వీరవల్లె, వెంకటరాజుగూడెం, వెంకటాపురం, వెలేరు, శోభనాద్రిపురం, సింగన్నగూడెం మరియు సెరి నరసన్నపాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నూజివీడు మరియు హనుమాన్ జంక్షన్ ల నుండి ఇక్కడికి రవాణా సౌకర్యములు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-20వ తేదీన ఘనంగా నిర్వహించారు. [4]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చాకిరి కొండలరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీకృష్ణమందిరం:- స్థానిక యాదవుల వీధిలో నిర్మించిన ఈ ఆలయంలో, 2014,ఆగస్టు-14, గురువారం నాడు, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. పాలరాతితో చేయించిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని శాస్త్రోక్తంగా హోమాలు, పూజలు చేసి, ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఇక్కడ పొగాకు మరియు వరి పండుతాయి. ఇక్కడ మామిడి తోటలు ఎక్కువ.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన బొకినాల సాయిరాం వంశీ అను విద్యార్థి, ఈ మధ్యన ముంబాయిలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బ్రౌన్ బెల్ట్ గెలుచుకున్నాడు. [2]
  2. ఈ గ్రామానికి చెందిన శ్రీ బి.రవిబాబు బస్ కండక్టరుగా పనిచేస్తున్నారు. వీరి శ్రీమతి బేబి గృహిణి. వీరి కుమారుడు బి.సాయిరాం వంశీ, నూజివీడులో 9వ తరగతి చదువుచున్నాడు. ఇతడు చిన్నతనం నుండియే కరాటే క్రీడలో మక్కువతో దానిలో శిక్షణ పొందుచూ దానిలో ప్రావీణ్యం సంపాదించి నాడు. ఇతడు రాష్ట్రంలోనేగాక, ఇతర రాష్ట్రాలలోగూడా కరాటే పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించాడు. కరాటేలోనేగాక ఇతడు కిక్ బాక్సింగ్, కుంగ్ ఫూ, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ లో గూడా ప్రావీణ్యం సంపాదించడమేగాక, వీటిలో గూడా పతకాలు సాధించుచున్నాడు. ఇతడు ఛైనా దేశంలో గూడా పాల్గొన్నాడు. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,082 - పురుషుల సంఖ్య 2,567 - స్త్రీల సంఖ్య 2,513 - గృహాల సంఖ్య 1,374

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3969.[2] ఇందులో పురుషుల సంఖ్య 2025, స్త్రీల సంఖ్య 1944, గ్రామంలో నివాస గృహాలు 931 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3166 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా, 2013,నవంబరు-30; 3వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-15; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2015,ఫిబ్రవరి-22; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే నెల-9వతేదీ; 11వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మల్లవల్లి&oldid=2124880" నుండి వెలికితీశారు