మల్లాది గోవిందశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లాది గోవిందశాస్త్రి రంగస్థల నటులు.

జననం[మార్చు]

గోవిందశాస్త్రి 1887, సెప్టెంబరు 12న జోగయ్యగారు, కోటమ్మ దంపతులకు గుంటూరులో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

బాల్యంనుండే నాటకాలపై మక్కువ ఉన్న గోవిందశాస్త్రి గుంటూరు నాటక కంపెనీలలో కొంతకాలం నటుడిగా పనిచేశారు. 1920లలో ప్రాంతంలో తెనాలిలోని శ్రీకృష్ణ హిందూ థియేటర్ లో నెలకు రూ.30 లు జీతంతో నటుడిగా చేరారు. అదేసమయంలో స్థానం నరసింహరావు స్త్రీ పాత్రకోసం ఆ కంపెనీలోనే చేరారు. గోవిందశాస్త్రి పురుషపాత్రలు, స్థానం నరసింహరావు స్త్రీ పాత్రలు పోషించేవారు. కానీ నాటకాలకు వచ్చే ఆదాయం క్రమక్రమంగా తగ్గిపోవడంతో, నష్టాలనుండి తేరుకోలేకపోవడంతో కంపెనీ నిర్వాహకులు కంపెనీని మూసివేశారు. కొన్నిరోజులకు తెనాలిలో ఇల్లు కొనుక్కున్నారు. అయితే భార్య చనిపోవడం, ఇల్లు అమ్మడం, నాటక కంపెనీ మూసివేయడం ఇలా ఒకదానివెంట ఇంకోటి రావడంతో, తెనాలి వదలి విజయవాడ చేరి, కొంతకాలం వీధి బడి నడిపారు. చివరి దశలో దారుణమైన దరిద్రం అనుభవించి తనువు చాలించారు.

పురాణం సూరిశాస్త్రి తన వాట్యాంభుజంలో గోవిందశాస్త్రి గురించి గొప్పగా పొగుడుతూ వ్రాశారు. అంతేకాకుండా గోవిందశాస్త్రి నటన గురించి ఆరోజుల్లో తరచుగా పత్రికలలో వార్తలు వస్తుండేవి.

నటించిన పాత్రలు[మార్చు]

  • కృష్ణుడు
  • సారంగధరుడు
  • దుర్యోధనుడు
  • నలుడు
  • యముడు
  • భీముడు
  • హరిశ్చంద్రుడు

మొదలైన పాత్రలేకాకుండా, స్త్రీ పాత్రలు కూడా పోషించారు.

బహుమతులు - సన్మానాలు[మార్చు]

  • 1917లో విజయవాడలో హరిశ్చంద్ర నాటకం పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సంపాదించారు
  • 1925లో, 1954లో గుంటూరులో ఘన సన్మానాలు అందుకున్నారు

మూలాలు[మార్చు]

  • మల్లాది గోవిందశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 172.