మల్లిక (వ్యాఖ్యాత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లిక
జననం
అభినయ

1978
మరణం2017 అక్టోబరు 09[1]
బెంగుళూరు
వృత్తిటీవీ వ్యాఖ్యాత, నటి
క్రియాశీల సంవత్సరాలు1997-2004
జీవిత భాగస్వామివిజయ్ సాయి

మల్లిక (1978 - 2017 అక్టోబరు 9) ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి.[1] 1997-2004 మధ్యలో పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాలు అందుకుంది. మహేష్ బాబు కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా మొదలైన సినిమాల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మల్లిక 1978 లో హైదరాబాదులోని నారాయణగూడలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అభినయ[2] విజయ్ సాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మకాం బెంగుళూరుకు మారింది.[3]

వృత్తి[మార్చు]

మొదట్లో టీవీ వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించిన మల్లిక తర్వాత కొన్ని సీరియళ్ళలో, సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. పెళ్ళి తర్వాత వ్యాఖ్యానానికీ, నటనకు దూరంగా ఉంది.[4]

సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడ్డ ఆమె 20 రోజుల కోమాలో ఉన్న తరువాత 2017 అక్టోబరు 9 న బెంగుళూరులో కన్ను మూసింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ప్రముఖ తెలుగు యాంకర్‌ కన్నుమూత". eenadu.net. బెంగుళూరు: ఈనాడు. Archived from the original on 9 October 2017. Retrieved 9 October 2017.
  2. "యాంకర్ మల్లిక ఇక లేరు". tupaki.com. Archived from the original on 10 అక్టోబర్ 2017. Retrieved 10 October 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. "TV actress Mallika breathes her last". indiaglitz.com. India Glitz. Retrieved 10 October 2017.
  4. బొలినేని, హరిబాబు. "Notable anchor Mallika passes away". chitramala.in. chitramala.in. Retrieved 10 October 2017.[permanent dead link]