మసాలా దినుసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మసాలా దినుసులు లేదా సుగంధ ద్రవ్యాలు అనేవి ఒక విత్తనం, పండు, వేరు, బెరడు లేదా ఇతర మొక్క పదార్థం నుండి సేకరిస్తారు. వీటిని వంటకాలలో ప్రధానంగా రుచి లేదా రంగు కొరకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలు, మూలికలకు భిన్నంగా ఉంటాయి, ఇవి ఆకులు, పువ్వులు లేదా మొక్కల యొక్క కాండాల నుండి సేకరించి రుచి పెంచటానికి, వంటకాన్ని అలంకరించటానికి ఉపయోగిస్తారు. మసాలా దినుసులను, సుగంధ ద్రవ్యాలను కొన్నిసార్లు వైద్య, మత పరమైన ఆచారాలు, సౌందర్య సాధనలు లేదా సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.

చరిత్ర[మార్చు]

పూర్వ చరిత్ర[మార్చు]

క్రీ.పూ 2000 ప్రారంభంలో మసాలా వ్యాపారం దాల్చిన చెక్క, నల్ల మిరియాలు ఉత్పత్తితో భారత ఉపఖండం అంతటా అభివృద్ధి చెందింది [1] తూర్పు ఆసియాలో మూలికలు, మిరియాలు ఉత్పత్తి వలన ప్రాముఖ్యం చెందినాయి. ఈజిప్షియన్లు మమ్మీఫికేషన్ కోసం మూలికలను ఉపయోగించారు. వీరి ద్రవ్యాలు, మూలికల అవసరము అన్యదేశ సుగంధ ద్రవ్యాలు కోసం ప్రపంచ వాణిజ్యాన్ని ఉత్తేజపరిచింది. మసాలా అనే పదం పురాతన ఫ్రెంచ్ పదం ఎస్పైస్ నుండి వచ్చింది, ఇది ఎపిస్ అయింది ఇది లాటిన్ రూట్ స్పెక్ నుండి కూడా వచ్చింది, నామవాచకం "ప్రదర్శన, క్రమబద్ధీకరణ, రకం" అని సూచిస్తుంది. క్రీస్తుపూర్వం 1000 నాటికి, మూలికల ఆధారంగా వైద్య వ్యవస్థలు చైనా, కొరియా మరియు భారతదేశాలలో కనుగొనబడ్డాయి. ప్రారంభ ఉపయోగాలు మాయాజాలం, ఔషధం, మతం, సంప్రదాయం మరియు సంరక్షణతో ముడిపడి వుండేవి.

క్రీస్తుపూర్వం 1700 నాటికి లవంగాలను మెసొపొటేమియాలో ఉపయోగించారు. ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణంలో లవంగాల గురించి ప్రస్తావించింది. 1 వ శతాబ్దం CE లో రోమన్లు లవంగాలు కలిగి ఉన్నారు, అని ప్లీని ది ఎల్డర్ వారి గురించి వ్రాసాడు.

సుగంధ ద్రవ్యాల గురించి మొట్టమొదటి వ్రాతపూర్వక రికార్డులు పురాతన ఈజిప్షియన్, చైనీస్ మరియు భారతీయ సంస్కృతుల నుండి వచ్చాయి. పురాతన ఈజిప్షియన్ల గ్రంథము ఎబర్స్ పాపిరస్ 1550 B.C.E.లో ఎనిమిది వందల వేర్వేరు ఔషధ నివారణలు మరియు అనేక ఔషధ విధానాలను వివరిస్తుంది. [5]

ఆగ్నేయాసియాలోని బండా దీవుల నుండి ఉద్భవించిన జాజికాయను క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం చేసినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

ఇండోనేషియా వ్యాపారులు చైనా, భారతదేశం, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా యొక్క తూర్పు తీరం అంటే సముద్ర తీరాల చుట్టూ తిరిగి వ్యాపారము చేసారు. అరబ్ వ్యాపారులు మధ్యప్రాచ్యం మరియు భారతదేశం గుండా మార్గాలను సులభతరం చేశారు. దీని ఫలితంగా ఈజిప్టు ఓడరేవు నగరం అలెగ్జాండ్రియా సుగంధ ద్రవ్యాలకు, మసాలా దినుసులకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. యూరోపియన్ మసాలా వాణిజ్యానికి ముందు చాలా ముఖ్యమైన ఆవిష్కరణ రుతుపవనాల గాలులు (40 CE). ఈ రుతుపవనాల గాలుల జ్ఞానముతో తూర్పు మసాలా సాగుదారుల నుండి పాశ్చాత్య యూరోపియన్ వినియోగదారులకు ప్రయాణించడం నేర్చుకొన్నారు. ఒకప్పటి మధ్యప్రాచ్య అరబ్ యాత్రికులచే సులభతరం చేయబడిన భూమి ద్వారా చేసిన మసాలా వాణిజ్య మార్గాలను క్రమంగా వాడుకొన్నారు.

ఆదికాండ (Genesis) కథలో, జోసెఫ్‌ను అతని సోదరులు మసాలా వ్యాపారులకు బానిసలుగా అమ్మారు. సాంగ్ ఆఫ్ సోలమన్ అనే బైబిల్ పద్యంలో, మగ వక్త తన ప్రియమైన వ్యక్తిని అనేక రకాల మసాలా దినుసులతో పోల్చాడు.

మధ్య యుగము[మార్చు]

మధ్య యుగాలలో ఐరోపాలో లభించే అత్యంత ముఖ్యమైన ఖరీదైన ఉత్పత్తులలో సుగంధ ద్రవ్యాలు లేక మసాలా దినుసులు ఉన్నాయి. నల్ల మిరియాలు, దాల్చినచెక్క (మరియు చౌకైన ప్రత్యామ్నాయ కాసియా), జీలకర్ర, జాజికాయ, అల్లం, లవంగాలు. మధ్యయుగ ఔ షధ శాస్త్రంలో ప్రధాన సిద్ధాంతం ప్రకారం, సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు ఆహారంలో "Humourism " అనగా శ్లేష్మము, పిత్తము సమతుల్యం చేయడానికి ఎంతో అవసరం. మహమ్మారి జబ్బులు పునరావృతమయ్యే సమయంలో మంచి ఆరోగ్యానికి రోజువారీ ఆధారం. మధ్యయుగములో ఔషధం వాడుతున్నవారితో పాటు, యూరోపియన్ ఉన్నతవర్గం కూడా సుగంధ మసాలా ద్రవ్యాలను కోరుకుంది. 12 వ శతాబ్దంలో స్పెయిన్ కు సుగంధ ద్రవ్యాలను, మసాలా దినుసులను తిరిగి తీసుకురావడానికి గణనీయమైన వనరులను పెట్టుబడి పెట్టిన అరగోన్ రాజు యూరోపియన్ కులీనుల మసాలా అవసరానికి ఉదాహరణ. అతను ప్రత్యేకంగా వైన్లో కలపటానికి మసాలా దినుసులు వెతికాడు.

మసాలా దినుసులలో వర్గాలు రకాలు[మార్చు]

వృక్ష ఆధారితం[మార్చు]

విత్తనాలు, సోపు, ఆవాలు, జాజికాయ మరియు నల్ల మిరియాలు

కయెన్ పెప్పర్ వంటి పండ్లు

జాపత్రి (జాజికాయ మొక్క పండ్లలో భాగం)

దాల్చిన చెక్క మరియు కాసియా వంటి చెట్టు బెరడు

లవంగాలు వంటి పూల మొగ్గలు

కుంకుమ వంటి పూపొడులు

పసుపు, అల్లం మరియు గాలాంగల్ వంటి మొక్క వేళ్ళు

ఆసాఫోటిడా వంటి రెసిన్లు