Jump to content

మసాలా దోసె

వికీపీడియా నుండి
మసాలా దోసె

సాదా దోసె మధ్యలో మసాలా కూర పెట్టి వేయించిన మసాలా దోసె (Masala dosa) తయారౌతుంది.

మసాలా కూరకు కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారుచేయు విధానం

[మార్చు]
  • బంగాళా దుంపలు ఉడకబెట్టి, తొక్క వలిచి చిదిపి ఉంచుకోవాలి.
  • ఉల్లిపాయలు తొక్క వలిచి సన్నగా పొడుగ్గ తరుక్కోవాలి.
  • పచ్చి మిరపకాయలు, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకోవాలి.
  • బూరెల మూకుడు పొయ్యి మీద పెట్టి, కూరకు తగినంత నూనె వేసి మరిగాక జీడిపప్పు, మినప పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు, అవి వేగాక వెల్లుల్లి వేసి సువాసన వచ్చేదాక వేగనిచ్చి ఉల్లిముక్కలు వెయ్యాలి. ఉల్లిముక్కలు దోరగా వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్ళు చల్లి మూతపెట్టాలి. కొంతసేమ మగ్గాక దించెయ్యాలి.
  • సాదా దోసెలో చెప్పినట్లుగా వేసి ఒకవైపు కాలిన తరువాత, అట్లకాడతో దోసెను కదల్చి, తయారుచేసి పెట్టిన మసాలా కూర మధ్యలో పెట్టి కూరమీదకు మడిచి, దించి పళ్ళెంలో పెట్టుకోవాలి. రెండో వైపు కాలనక్కరలేదు.

రకాలు

[మార్చు]
  • మైసూరు మసాలాదోశ :- దోశమీద మసాలా పెట్టే ముందు కొబ్బరి చట్నీ, ఎర్రగడ్డ చట్నీలను పూసి తయారు చేసే మసాలా దోశలను మైసూరు మసాలా దోశలు అంటారు.
  • కూరగాయ మసాలా దోశ :- పచ్చిబఠాణీ గింజలు ఇతర కూరగాయలు చేర్చిన మసాలాతో చేసిన మసాలాదోశలను కూరగాయల మసాలా దోశ అంటారు.
  • రవా మసాలా దోశ :- రవా దోశలలో మసాలాను కూర్చి చేసిన దోశలను రవా మసాలా దోశలు అంటారు.
  • చైనీస్ మసాలా దోశ :- నూడిల్స్, ఇతర చైనా పదార్ధాలు కూర్చి చేసిన దోశలను చైనా మాసాలా దోశలు అంటారు. వీటికి సాస్, స్చీజాన్ చేర్చి తయారు చేస్తారు.
  • పనీర్ చిల్లీ దోశ :- చీజ్ లేక పనీర్ తురుముకు కొంత మసాలా పొడులను చేర్చి దానిని దోశలలో కూర్చి తయారు చేసిన దోశలను పనీర్ మసాలా దోశలు అంటారు.
  • పాలక్ మసాలా దోశ :- స్పినాచ్ గుజ్జును పూసి వాటికి మామూలు ఉర్లగడ్డ మసాలాను చేర్చి చేసిన దోశలను పాలక్ మసాలా దోశలు అంటారు.
  • గుడ్డు మసాలా దోశ :- కాల్చిన గుడ్డును చేర్చి చేసిన మసాలా దోశలను గుడ్డు మసాలా దోశను గుడ్డు మసాలా దోశ అంటారు.
  • దేవనగిరే బెన్నె మసాలా దోశ :- మాసాలా దోశలకు వెన్నను చేర్చి చేసిన దోశలను దేవనగిరే బెన్నె మసాలా దోశ అంటారు.

చిట్కాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]