మహతి
Jump to navigation
Jump to search
మహతి | |
---|---|
రకము | మాస పత్రిక |
ఫార్మాటు | రాయల్ సైజు |
యాజమాన్యం: | |
ప్రచురణకర్త: | వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య |
సంపాదకులు: | వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య |
స్థాపన | 1938, ఏప్రిల్ 15/ తెనాలి |
వెల | విడిపత్రిక 2 అణాలు , సంవత్సర చందా 2/- రూ. |
ప్రధాన కేంద్రము | తెనాలి |
ఈ మాస పత్రిక తెనాలి నుండి వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య సంపాదకుడుగా, ప్రచురణకర్తగా వెలువడింది. 1938లో మొదటి సంచిక వెలుగు చూసింది. ఈ పత్రిక జాతీయోద్యమానికి బాసటగా నిలిచింది. ఈ పత్రికలో కథలు, కవితలు, పద్యాలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. విమర్శవీధి పేరుతో పుస్తకసమీక్షలు ప్రచురించారు.
ఆశయం[మార్చు]
ప్రపంచ దృష్టినంతటిని ఉవ్వెత్తుగ ఆకర్షించుచు లోకవృత్తమును క్షణక్షణము తారుమారు చేయుచున్న వర్తమాన రాజకీయ వ్యవస్థకు జాతీయ నిత్యజీవనమునకు సంబంధించు సాంఘిక నైతికాది చర్చా సందర్భములకును, కళాపోషకములయి మానవహృదయ సంస్కారమునకు దోహదమొసగు కథానికలకును, ఆదర్శములగు చరిత్రాంశములకు మా 'మహతి' సేవాంజలి సమర్పించుచుండును అని తొలిసంచికలో 'ప్రాస్తావిక'లో ఈ పత్రిక ఆశయాన్ని ప్రస్తావించారు[1].
విషయాలు[మార్చు]
ఈ పత్రిక రెండవ సంపుటము రెండవ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి[2].
- జిజ్ఞాస - తుమ్మల సీతారామమూర్తి చౌదరి
- భరత భాగ్యము - వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య
- సూతాశ్రమ భాషితములు - కవిరాజు
- ఆంధ్రాష్టకం - వేంకట పార్థసారథి కవులు
- ఆంధ్ర రాష్ట్రం - అనంతశయనము - మురళీచంద్
- అక్కచెల్లెళ్లు - కొడవటిగంటి కుటుంబరావు
- పసులకాపరి - గోనుగుంట పున్నయ్య
- వరూధిని - నరహరి నరసింహారావు
- విలయగీతి - వంకాయలపాటి శేషావతారము
- వీరదంపతులు - యార్లగడ్డ శ్రీకృష్ణచౌదరి
- జన్మభూమి - కన్నెగంటి ప్రభులింగాచార్యులు
- ? - ఏటుకూరి వెంకట నరసయ్య
- లోపలా - బయటా చక్రపాణి
- ఈ రంగ డెవ్వరు? - గుంటుపల్లి సీతారామయ్య
- విమర్శవీధి
మూలాలు[మార్చు]
- ↑ [1]భారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహతి సంచిక