మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం
సురవరం ప్రతాపరెడ్డి

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.

కథ ప్రాశస్త్యం[మార్చు]

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ[మార్చు]

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. ఈ జిల్లాలో జన్మించిన కథకుడు పి.వెంకట రామారావు తెలంగాణ పల్లెవాసుల జీవిత సన్నివేశాలను చిత్రిస్తూ ‘కొత్తనాగలి’ మొదలైన కథలు రాశాడు. అలాగే రామారెడ్డి రాసిన ‘సర్కారుశిస్తు’ కథలో వానల్లేక భూమిశిస్తు కట్టలేని రైతన్నలపై గ్రామాధికారుల జులుం కథా వస్తువైంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరనివాస మేర్పరచుకున్న ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ‘కస్తూరి’ కలం పేరుతో వందలాది కథలు వెలువడ్డాయి. అందులోని కొన్ని కథలు ‘నూరు కథలు’ సంపుటిగా వెలువడ్డాయి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టాయతని కథలు. గాథాసప్తశతి కథల్ని తెలుగులో కనువదించగా ‘ఆంధ్రప్రదేశ్’ పత్రికలో అచ్చయినాయి. ఈ రచయిత కథ ‘కాలం కరిచింది’ సర్వజనామోదమైంది.[1] ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా తెలుగు కథా రచయితల జాబితా[మార్చు]

ఈ క్రింది జాబితాలో మహబూబ్‌నగర్ జిల్లాకథకుల వివరాలుక్రోఢీకరించబడ్డాయి.[1][2]

రచయిత పేరు ప్రస్తుత నివాసం కలం పేరు పుట్టిన సంవత్సరం పుట్టిన ఊరు రచనలు
బడారు శ్రీనివాసరావు రాజయ్య-సోమయాజులు (పాలమూరు తొలికథ-1913) [3], కువైద్యరాజు, మృత్యువు దాని జాపకం, విషాదం
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 ఇటిక్యాలపాడు మొగలాయి కథలు, నిరీక్షణ, సంఘాల పంతులు, హుసేన్ బీ, వకీలు ఎంకయ్య, వింత విడాకులు, మెహ్దీ బేగం, ఖిస్మత్,
పాకాల యశోదారెడ్డి 1929 బిజినపల్లి మా ఊరిముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల
కసిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ కస్తూరి పోలేపల్లి 300కు పైగా కథలు, అలక (సంకలనం)
వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 50కు పైగా కథలు (పరాజితులు)
పి.వెంకట రామారావు
నాగులపల్లి కోదండరామారావు
మంద రామారెడ్డి సర్కారు కిస్తు, విడిజోళ్ళు
బూర్గుల రంగనాథరావు బూర్గుల 13 కథలు
అందుగుల సోదరులు (తిరుమలరావు, లక్ష్మణరావు అంతే నా నోము, నిష్పలం
బ్రహ్మ రఘురామరాజు హైదరాబాద్ 1957 జూలై 18 మహబూబ్ నగర్
పైడి చంద్రలత నెల్లూరు 1969 ఫిబ్రవరి 10 మహబూబ్ నగర్
ధనరాజ జ్ఞానేశ్వర్ మహబూబ్ నగర్ 1964 జనవరి 05 వనపర్తి
మీనా ప్రభాకర్
కల్వకుంట శరత్‌చంద్ర
భీంపల్లి శ్రీకాంత్
చంద్ర
పొల్కంపల్లి రాజేశ్వరి
పోల్కంపల్లి శాంతాదేవి 7 కథా సంపుటాలు
గొరుసు జగదీశ్వర్ రెడ్డి వనపర్తి గజఈతరాలు
తంగెళ్ల శ్రీనివాసరెడ్డి
తంగెళ్ళపల్లి శ్రీదేవిరెడ్డి ఆత్మకూరు
జ్ఞానేశ్వర్
ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి
ఉమ్మెత్తల లక్ష్మీనారాయణ
వెల్దండ రుక్మాంగదరెడ్డి
ఇరివెంటి కృష్ణమూర్తి
గొట్టిముక్కల కృష్ణమూర్తి దివ్యాలోకం, ఇంటిముఖం, తంతే పరుపులో ( టాల్‌స్టాయ్, రవీంద్రుల అనువాద కథలు)
ఆకుమళ్ళ మల్లికార్జునశర్మ అలంపూర్ అనువాద కథలు
గడియారం రామకృష్ణశర్మ అలంపూర్ కన్నడఅనువాద కథలు
చౌడూరి గోపాలరావు చంపు, సమాజం
గోపాలరెడ్డి గప్‌చుప్‌
కాచిరాజు శేషగిరిరావు గప్‌చుప్‌

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాల జాబితా[మార్చు]

  1. 1.0 1.1 దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ[permanent dead link]
  2. కథానిలయం జాలగూడులో రచయితల వివరాలు
  3. పాలమూరు కథ విశిష్టాలు,రచన:గుంటి గోపి, నమస్తే తెలంగాణ, తేది:26.05.2014