మహమ్మద్ సిరాజ్
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | మహమ్మద్ సిరాజ్ | |||
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1994 మార్చి 13|||
బ్యాటింగ్ శైలి | కుడిచేత వాటం బ్యాటింగ్ | |||
బౌలింగ్ శైలి | Right-arm fast-medium | |||
పాత్ర | బౌలర్ | |||
టి20ఐ లో ప్రవేశం(cap [[List of {{{country}}} Twenty20 International cricketers|71]]) | 4 November 2017 v న్యూజీలాండ్ | |||
చివరి టి20ఐ | 14 March 2018 v Bangladesh | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2015–ప్రస్తుతం | Hyderabad | |||
2017 | Sunrisers Hyderabad | |||
2018–present | Royal Challengers Bangalore | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Test | ODI | T20I | FC |
మ్యాచులు | 1 | 1 | 3 | 36 |
చేసిన పరుగులు | 0 | – | – | 300 |
బ్యాటింగ్ సరాసరి | – | – | – | 7.69 |
100s/50s | –/– | –/– | –/– | 0/0 |
అత్యధిక స్కోరు | 0* | – | – | 46 |
బౌలింగ్ చేసిన బంతులు | 219 | 60 | 72 | 6,519 |
వికెట్లు | 5 | 0 | 3 | 147 |
బౌలింగ్ సగటు | 15.4 | – | 49.33 | 23.00 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | – | 0 | 4 |
మ్యాచ్ లో 10 వికెట్లు | – | – | 0 | 2 |
ఉత్తమ బౌలింగు | 3/37 | – | 1/45 | 8/59 |
క్యాచులు/స్టంపులు | 2/- | 0/- | 1/– | 6/– |
Source: Cricinfo, 29 December 2020 {{{year}}} |
మహమ్మద్ సిరాజ్ 1994 లో జన్మించిన భారత క్రికెట్ ఆటగాడు.[1] 2017 అక్టోబరులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 2023 జనవరి 18న తన సొంత గడ్డపై హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.[2]
నేపధ్యము[మార్చు]
మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని సామాన్య నేపథ్యం నుండి వచ్చాడు. అతని తండ్రి ఆటో రిక్షా నడపేవాడు 1994లో హైదరాబాద్‌లోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో నివసించే సిరాజ్ క్రికెట్ కోచింగ్‌ను ఎప్పుడూ తీసుకోలేదు[3] స్థానిక ఈద్గా మైదానంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు,[4] మంచి పేస్, స్వింగ్ కలిగిన సిరాజ్ హెచ్.సి.ఎ ఎ-డివిజన్ లీగ్‌లో సత్తాచాటాడు. ఎ-డివిజన్ ప్రదర్శనతో హైదరాబాద్ అండర్-23 జట్టుకు ఎంపికైన సిరాజ్ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు.
మొదటి టెస్ట్ మ్యాచ్[మార్చు]
2020 భారత జట్టు ఆస్ట్రేలియా దేశ పర్యటన సందర్భంగా సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బాక్సింగ్ డే మ్యాచ్ గా పిలవబడే ఆ మ్యాచ్ డిసెంబరు 26 న జరిగింది. ఈ మ్యాచ్ లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది.
శిక్షణ[మార్చు]
అండర్-23 జట్టు తరఫున సత్తాచాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన సిరాజ్.. కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్.. 2016 హైదరాబాద్ రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఒకరకంగా టీమ్‌ఇండియాకు సిరాజ్ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర! తొలి టీ20 తర్వాత ఆశిష్ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ లేదా బాసిల్ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని భావించారు. ఐతే వూహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్ ఉండొచ్చన్నది క్రికెట్ వర్గాల అభిప్రాయం! ఇక 2016రంజీ ట్రోఫీలో సిరాజ్, రవికిరణ్, సీవీ మిలింద్‌లతో భరత్ సంచలనాలు నమోదు చేశాడు. గ్రూప్-సిలో ఉన్న హైదరాబాద్‌ను ఏకంగా క్వార్టర్‌ఫైనల్‌కు తీసుకెళ్ళాడు. గత రంజీ సీజన్‌లో ముగ్గురు పేసర్లు కలిసి 110 వికెట్లు తీయడం విశేషం. అందులో సిరాజ్ 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్టాఫ్ ఇండియాకు సిరాజ్ ఎంపికయ్యాడు.
ఐ.పీ.ఎల్[మార్చు]
రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిన సిరాజ్‌కు ఐపీఎల్ రూపంలో జాక్‌పాట్ తగిలింది. 2017 లో జరిగిన వేలం పాటలో 23 ఏళ్ళ సిరాజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్లకు కొనుక్కోవడం అతిపెద్ద సంచలనమైంది. కోచ్ టామ్ మూడీ, కెప్టెన్ డేవిడ్ వార్నర్, వీవీఎస్ లక్ష్మణ్‌ల మార్గనిర్దేశనంలో ఐపీఎల్‌లో ఆడిన సిరాజ్ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ లయన్స్‌తో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఐపీఎల్ అనంతరం నేరుగా ఇండియా-ఎ జట్టుకు ఎంపికైన సిరాజ్‌ను కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత సానబెట్టాడు. సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు (5/103) తీశాడు. వరుసగా దక్షిణాఫ్రికా-ఎ, అఫ్గానిస్థాన్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియా-ఎ తరఫున సిరాజ్ బరిలో దిగి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం సిరాజ్ బౌలింగ్‌లో మంచి పేస్ ఉంటుంది. సహజసిద్ధమైన స్వింగ్ అతని సొంతం.
మూలాలు[మార్చు]
- ↑ "Mohammed Siraj's swift rise up the Indian ranks". ESPN Cricinfo. Retrieved 23 October 2017.
- ↑ Eenadu (19 January 2023). "ఇటు గిల్.. అటు బ్రాస్‌వెల్.. ఉప్పల్ వన్డే సూపర్'హిట్'". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
- ↑ "Gully boy Mohammed Siraj lives his dream and makes it big in Australia". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.
- ↑ "'Every wicket I was taking I was dedicating it to dad' - The story of Mohammed Siraj's homecoming". ESPNcricinfo. Retrieved 2022-12-21.