మహర్షి (1987 సినిమా)
| మహర్షి (1987 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | వంశీ |
| నిర్మాణం | స్రవంతి రవికిషోర్ |
| కథ | వేమూరి సత్యనారాయణ |
| చిత్రానువాదం | వంశీ వేమూరి సత్యనారాయణ తనికెళ్ళ భరణి |
| తారాగణం | మహర్షి రాఘవ, శాంతిప్రియ, సి.వి.ఎల్.నరసింహారావు, కృష్ణ భగవాన్ |
| సంగీతం | ఇళయరాజా |
| నృత్యాలు | ఎస్పీ ఆనంద్ జి. పద్మ సుబ్బారావు |
| ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
| కళ | తోట యాదు |
| కూర్పు | అనిల్ మల్నాడ్ |
| నిర్మాణ సంస్థ | స్రవంతి మూవీస్ |
| భాష | తెలుగు |
మహర్షి 1987 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ దర్శకత్వం వహించగా టైటిల్ పాత్రలో మహర్షి రాఘవ నటించాడు.[1] ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మించాడు. ఇది కృష్ణ భగవాన్ నటించిన మొదటి సినిమా. ఇళయరాజా సంగీతం మంచి ప్రజాదరణ పొందింది.[2]
కథ
[మార్చు]మహర్షి ధనిక కుటుంబానికి చెందిన, అల్లరి చిల్లరగా తిరిగే కళాశాల యువకుడు. తన అహంకార ప్రవర్తన, స్నేహితుల ముఠాను నిర్వహించడం, లెక్చరర్లను ఆటపట్టించడం, క్లాస్‌మేట్లను కొట్టడం వంటి చర్యలతో కళాశాలలో పేరుపడి ఉంటాడు. అయితే, అతను కళాశాలలో సుచిత్ర ను కలిసాక పరిస్థితులు మారతాయి. అతని మొరటు ప్రవర్తన కారణంగా ఆమె అతన్ని అసహ్యించుకుంటుంది. ఆమెతో మాట్లాడబోయినా మాట్లాడదు. మహర్షి మాత్రం ఆమెను ఇష్టపడతాడు. ఆమె తల్లిదండ్రులను సంప్రదించి, తన సంపదను చూపించి ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తాడు. తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఆమె మాత్రం అంగీకరించదు. మహర్షి ఆమెకు వచ్చిన సంబంధాలను భయపెట్టి వెనక్కి పంపేసి చెడగొడతాడు.
సుచిత్ర తన చిన్ననాటి స్నేహితుడు తిలక్‌ను కలుస్తుంది. అతడు అదే పట్టణంలో పోలీస్ సబ్ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూంటాడు. వెంటనే, మహర్షిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో, అతన్ని వివాహం చేసుకోవాలనే కోరికను ఆమె వ్యక్తం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహర్షి వారి పెళ్ళిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని స్వయంగా అతడి సొంత తండ్రే ఒత్తిడి చేసి అతణ్ణి పోలీస్ స్టేషన్లో బంధిస్తారు. అయితే, తిలకే సబ్ఇన్‌స్పెక్టర్‌గా తన అధికారాన్ని వాడి తనను ఖైదు చేసాడని మహర్షి భావిస్తాడు. తిలక్‌ను అతడి ఇంటి వద్దనే దాడి చేయడానికి వెళ్తాడు. కాని సుచిత్ర తలుపు తెరవగానే ఆగిపోతాడు. క్రమంగా, మహర్షి నిరాశలోకి జారిపోయి ఆసుపత్రిలో చేరతాడు.
మహర్షి సుచిత్రను శారీరకంగా మోహిస్తున్నాడని భావించిన తన స్నేహితుడు రమణ ఆమెకు మందు కలిపి, ఆమె మత్తులో ఉండగా మహర్షి వద్దకు తీసుకు వెళ్తాడు. ఆ సమయంలో మహర్షికి ఆమెపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కనబడుతుంది. మహర్షి తన స్నేహితుడిని చెంపదెబ్బ కొట్టి, ఆమె ప్రేమను కోరుకుంటున్నానని, ఆమె శరీరం కాదని వివరిస్తాడు. వారు ఆమెను భద్రంగా వెనక్కి తీసుకువెళ్తారు.
తిలక్ మహర్షితో స్నేహం చేసి, అతడు సుచిత్రతో కలుపుగోలుగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను కోలుకున్నాక, అతను పెళ్ళి చేసుకోవాలని వారు సలహా ఇస్తారు. కాని అందుకు స్పందనగా మహర్షి, పిచ్చిగా మారి అరుస్తూ పారిపోతాడు. అతను మళ్ళీ ఆసుపత్రిలో చేరతాడు. కాని అక్కడ నుండి తప్పించుకుంటాడు. అతను సుచిత్రకు పుట్టిన పిల్లవాడిని లాక్కొని, నగరంలోకి పారిపోతాడు. పోలీసులు అతని వెంట పడతారు. చివరికి, అతను పిల్లవాడితో పాటు ఒక భవనం పైనుండి పడటంతో, అతను చనిపోతాడు, పిల్లవాడిని కాపాడతాడు, తద్వారా సుచిత్ర సానుభూతి సంపాదిస్తాడు.
నటీనటులు
[మార్చు]- మహర్షి రాఘవ - మహర్షి
- నిశాంతి / శాంతిప్రియ - సుచిత్ర
- కృష్ణ భగవాన్ - తిలక్
- సంజీవి ముదిలి
- రమణగా సి.వి.ఎల్.నరసింహారావు
- రాంజగన్
- శ్యామ్ ప్రసాద్
- శివాజి రాజా
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కథ: వేమూరి సత్యనారాయణ
- సంభాషణలు: తనికెళ్ళ భరణి
- చిత్రానువాదం: వంశీ, వేమూరి సత్యనారాయణ & భరణి
- సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల, వెన్నెలకంటి & నాయుని కృష్ణమూర్తి
- గాయకులు: ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి & ఇళయరాజా
- మేకప్: ఎస్. నాగేశ్వరరావు
- కేశాలంకరణకు: రామమూర్తి
- కాస్ట్యూమ్స్: సాయి
- ప్రెస్ రిలేషన్స్: కౌండిన్య
- పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
- ఆపరేటివ్ కెమెరామెన్: ప్రసాద్ అనుమోలు
- అసిస్టెంట్ డైరెక్టర్లు: గద్దే సుధాకర్ రావు, యు.నారాయణ రావు & సైగల్
- స్టిల్స్: కె. సత్యనారాయణ
- నృత్య దర్శకులు: ఎస్పీ ఆనంద్ & జి. పద్మ సుబ్బారావు
- ప్రొడక్షన్ మేనేజర్స్: వల్లూరిపల్లి రమేష్ బాబు, ముని లాల్, కెవి కృష్ణారావు
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎపి స్వామి
- ఆర్ట్ డైరెక్టర్: తోట యాదు
- ప్రొడక్షన్ డిజైనర్: వేమూరి సత్యనారాయణ
- కూర్పు: అనిల్ మల్నాడ్
- ఫోటోగ్రఫి డైరెక్టర్: హరి అనుమోలు
- సంగీత దర్శకుడు: ఇళయరాజా
- నిర్మాత: కె. శారదా దేవి
- దర్శకుడు: వంశీ
పాటలు
[మార్చు]ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, నాయుని కృష్ణమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రచించారు.[3].
| క్రమసంఖ్య | పేరు | Singer(s) | నిడివి | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | "సాహసం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 4:37 | ||||||
| 2. | "సుమం ప్రతిసుమం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:46 | ||||||
| 3. | "కోనలో" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:34 | ||||||
| 4. | "మాటరాని" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:36 | ||||||
| 5. | "ఊర్వశి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:36 | ||||||
| 23:10 | |||||||||
బాక్సాఫీసు
[మార్చు]ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఓ మోస్తరు స్పందన వచ్చింది. ఈ చిత్రం నేపథ్య సంగీతానికి పేరుగాంచింది.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "మహార్షి 1987 (1987) | మహార్షి 1987 Movie | మహార్షి 1987 Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-07. Retrieved 2020-08-07.
- ↑ "Maharshi (1987)". Indiancine.ma. Retrieved 2020-09-04.
- ↑ "Maharshi". Spotify. Retrieved 9 December 2020.
