మహాదేవి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాదేవి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం సుందరరావు నాదకర్ణి
తారాగణం ఎం.జి.రామచంద్రన్
నిర్మాణ సంస్థ వినోద ప్రొడక్షన్స్
భాష తెలుగు

మహాదేవి 1958లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు మూలం 1957లో అదే పేరుతో వెలువడిన తమిళ చిత్రం.

నటీనటులు[మార్చు]

 • ఎం.జి.రామచంద్రన్
 • సావిత్రి
 • యం.యన్.రాజం
 • వీరప్ప
 • చంద్రబాబు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: సుందరరావు నాదకర్ణి
 • సంగీతం: ఎం.ఎస్.రాజు, విశ్వనాధన్ మరియు రామమూర్తి
 • గీత రచన: శ్రీ శ్రీ
 • నేపథ్య గానం: ఎ.ఎం.రాజా, పి.సుశీల, పిఠాపురం, వైదేహి

కథ[మార్చు]

చోళ రాజకుమార్తె మహాదేవిని చాళుక్యరాజ్య దళపతి వీరప్ప కామిస్తాడు. అతని సాటి దళపతి రామచంద్రన్ ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరప్ప అనేక కుతంత్రాలు పన్ని మహాదేవిని లోబరుచుకో చూస్తాడు. రాజు యాత్రకు వెళ్ళినప్పుడు మహాదేవి భర్తమీద హత్యానేరం, రాజద్రోహం ఆపాదించి ఖైదు చేస్తాడు. మహాదేవి తన కన్నబిడ్డ ప్రాణాలను సైతం తన శీలరక్షణకై అర్పించడానికి సిద్ధపడుతుంది. వీరప్ప దానికీ సిద్ధపడతాడు కానీ అతడు పాపి అయినందువల్ల పాపం బెడిసికొట్టి పొరపాటున తన బిడ్డనే చంపుకుంటాడు. తన భార్యనే బలి తీసుకుంటాడు. చివరకు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుంటాడు[1].

పాటలు[2][మార్చు]

క్రమ సంఖ్య పాట పాడినవారు
1 సేవచేయుటే ఆనందం పతి సేవ చేయుటే ఆనందం పి.సుశీల,
ఎ.ఎం.రాజా
2 కాకి కాకి కాటుక తే ఆడే పిచుకా పూలను తే పశువా పశువా పి.సుశీల
3 తందానా పాట పాడడం తుందన తాళమేయడం పిఠాపురం నాగేశ్వరరావు,
ఎస్.జానకి
4 సింగారముల నిన్నే కన్నార కనగానే సంగీత వీణలు పి.సుశీల,
వైదేహి బృందం
5 మాటల్ పలుకున్ కనులేమని పిలుచున్ ప్రియునే
6 మానం ఒకటే మేలని తలచే భారత రమణీ
7 తాయెత్తు తాయెత్తు మీ సందేహం తీర్చివేసి సంతోషం
8 కాముక జాతికి రీతి యిదే లేదు దైవం న్యాయమను భీతి మది పి.సుశీల
9 కాడి పట్టుదాం నేడే నేల దున్నుదాం ఈ దేశం జనులమ్ ఒక్కటై
10 ఓ నారీ తిలకమా ఓ త్యాగ నిలయమా వీరకులాభరణమా
11 కనుమూయు వేళలో కనీకానని కలయే కళయై ఎ.ఎం.రాజా,
పి.సుశీల
12 సుఖాలు మరిగే బాబులు తిరిగే జులాయి లోకమురా

మూలాలు[మార్చు]

 1. సంపాదకుడు (8 June 1958). "'మహాదేవి '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 28 January 2020.
 2. కొల్లూరి భాస్కరరావు. "మహాదేవి - 1958". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 27 January 2020.