మహాబలిపురం
?మహాబలిపురం తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 12°38′N 80°10′E / 12.63°N 80.17°ECoordinates: 12°38′N 80°10′E / 12.63°N 80.17°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 12 మీ (39 అడుగులు) |
జిల్లా (లు) | కాంచీపురం జిల్లా |
జనాభా | 12,049 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 603104 • +91-44 • TN-21 |
మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామం. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం (மகாபலிபுரம்) (Mamallapuram) అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.
చరిత్ర[మార్చు]
7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
సందర్శనా స్థలాలు[మార్చు]
నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లాపురం లేదా మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.
మొదటివి మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి, ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.
- బిగ్ రాక్: ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.
- బీచ్ : మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.
విశేషాలు[మార్చు]
ఇది పూదత్తాళ్వార్ జన్మించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరమున ఉంది. ఇది శిథిలము అయినందున కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే. పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చించాలని వెళ్ళిన సమయంలో స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారం కావాలని అడిగాడు. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెళ్ళాడు. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించాడు. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ పిలిచాడు. తరువాత స్వామికి స్థలశయనర్ అని పేరు వచ్చింది. ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్ (వరాహస్వామి) సన్నిధి ఉంది. ఇచ్చట స్వామి మేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెంజై (కుడి హృదయం) అనిపేరు. ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారుతున్న క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షం అయినందున భక్తవత్సలస్వామి ఇక్కడి నుండి మంగళాశాసనము చేసారని కథనాలు వివరిస్తున్నాయి.
సాహిత్యంలో[మార్చు]
శ్లో. శ్రీ మత్తార్ష్య తరజ్గిణీ తటగతే దేశేకడల్ మల్ల ఇ
త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజజ్గేశయ:
భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్శ్రీ పుండరీకేక్షిత:
ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుత:||
పాశురాలు[మార్చు]
మార్గము: మద్రాసునుండి 65 కి.మీ. దూరమున ఉంది. సకల సదుపాయములు ఉన్నాయి.
క్
పా. పారాయదుణ్డు మిழ்న్ద పవళత్తూణై;
ప్పడు కడలిలముదత్తై ప్పరివాయ్ కీణ్డ
శీరానై; యెమ్మానై త్తొణ్డర్ తజ్గళ్;
వివరాలు[మార్చు]
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
స్థలశయనర్- | నిలమంగై నాచ్చియ్యర్ | తార్ష్య నది | తూర్పు ముఖము | భుజంగశయనము | పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ | గగనాకార విమానము | పుండరీకునకు |
రవాణా సౌకర్యాలు[మార్చు]
మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి మహాబలిపురానికి ఒక గంటన్నర రెండు గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలోనే వుంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు. లేదా ఆటోలు దొరకుతాయి.
- తిరుకండళ్‌మలై -[1] విష్ణుమూర్తిని ప్రధాన దేవాలయం. పల్లవ రాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుండి వచ్చే కోత నుండి శిలా సంపదని రక్షించడం కోసం విష్ణుప్రీతి కోసం నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గింది.
గ్యాలరీ[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-17. Retrieved 2007-08-20.
బయటి లింకులు[మార్చు]
- మహాబలిపురం
- యునెస్కో జాబితాలో మహాబలిపురం పేరు
- `హిందు పత్రిక నుండి మహాబలిపురం గురించి Archived 2008-11-04 at the Wayback Machine
- జాతీయ సముద్రశాస్త్రం వారి వెబ్ సైటు నుండి Archived 2005-02-10 at the Wayback Machine
- మహాబలిపురం నుండి పురవస్తు శాఖ గురించి[permanent dead link]
- సునామి తరువాత సముద్రమట్టం
- [http://www.hindu.com/2004/12/30/stories/2004123001602200.htm తీరంలో ఉన్న దేవాలయం సునామి తరువాత హిందు పత్రిక,30 డిసెంబర్ 2004
- http://www.hindu.com/2005/04/10/stories/2005041004161800.htm Newly-discovered Mahabalipuramtemple fascinates archaeologists] Archived 2004-12-30 at the Wayback Machine T.S. Subramanian in The Hindu, 10 April 2005
- Mahabalipuram Temple Architecture
- Mahabalipuram Photos from india-picture.net
- The India Atlantis Expedition - March 2002
- Read Useful Details about Mahabalipuram Temple
- Tsunami's might opens way for science (The Globe and Mail; February 18, 2005)
- BBC News: India finds more 'tsunami gifts'
- Inscriptions of India -- Complete listing of historical inscriptions from Indian temples and monuments
- Photographs of Mahabalipuram and other sites in Tamil Nadu
- A videograph of Mahabalipuram in HD
- పొటోల సేకరణ-కొత్తబంగారులోకం బ్లాగు నుండి
- యాత్రవిశేషాలు