Jump to content

మహామేఘవాహన సామ్రాజ్యం

వికీపీడియా నుండి
మహామేఘవాహన సామ్రాజ్యం
మహామేఘబాహన
ମହାମେଘବାହନ
క్రీ.పూ 2 వ శతాబ్దం–క్రీ.శ 5వ శతాబ్దం
రాజధానిసింహపురి
(ప్రస్తుతం సింగుపురం,శ్రీకాకుళంజిల్లా
Common languagesసంస్కృతం, ప్రాకృతం,తెలుగు(?)
Religion
జైనమతం
ప్రభుత్వంరాజరికం
Historical eraప్రాచీన యుగం
 Established
క్రీ.పూ 2 వ శతాబ్దం
 Disestablished
క్రీ.శ 5వ శతాబ్దం
Preceded by
Succeeded by
మౌర్య సామ్రాజ్యం
గుప్త సామ్రాజ్యం

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగంసా.శ.పూ.1500వరకు
పూర్వ యుగంసా.శ.పూ.1500-సా.శ.శ.650
మౌర్యులకు ముందుసా.శ.పూ.1500-సా.శ.పూ.322
మౌర్యులుసా.శ.పూ.322 - సా.శ.పూ. 184
శాతవాహనులుసా.శ.పూ.200 - సా.శ.త.200
కళింగులుసా.శ.పూ.180? - సా.శ.త.400?
ఇక్ష్వాకులు210 – 300
బృహత్పలాయనులు300 – 350
ఆనంద గోత్రీకులు295 – 620
శాలంకాయనులు320 – 420
విష్ణుకుండినులు375 – 555
పల్లవులు400 – 550
పూర్వమధ్య యుగం650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు624 – 1076
పూర్వగాంగులు498 – 894
చాళుక్య చోళులు980 – 1076
కాకతీయులు750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము1320–1565
ముసునూరి నాయకులు1333–1368
ఓఢ్ర గజపతులు1513
రేచెర్ల పద్మనాయకులు1368–1461
కొండవీటి రెడ్డి రాజులు1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు1395–1447
బహమనీ సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం1336–1565
ఆధునిక యుగం1540–1956
ఆరవీటి వంశం1572–1680
పెమ్మసాని నాయకులు1423–1740
కుతుబ్ షాహీ యుగం1518–1687
నిజాము రాజ్యం1742–1948
బ్రిటిషు రాజ్యం
స్వాతంత్ర్యోద్యమం1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు1948–1952
ఆంధ్రప్రదేశ్ అవతరణ1953–1956
ఏకీకృత ఆంధ్రప్రదేశ్ చరిత్ర1956–2014
ఆంధ్రప్రదేశ్ చరిత్ర2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగంశివకవి యుగం
తిక్కన యుగంఎఱ్ఱన యుగం
శ్రీనాథ యుగమురాయల యుగం
దాక్షిణాత్య యుగంక్షీణ యుగం
ఆధునిక యుగం21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకం
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

మౌర్య సామ్రాజ్యం అంతరించిన పిదప, క్రీ.పూ250ల నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు, కళింగని పాలించిన రాజవంశం, మహామేఘవాహన వంశం లేదా చేది వంశం లేదా కళింగులు. (ఒరియా - ମହାମେଘବାହନ; Mahā-Mēgha-Bāhana). వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైనది.

చరిత్ర

మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించిన కళింగ స్వతంత్య్ర రాజ్యమయ్యింది. స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్న మొదటి రాజు ఎవరనేదానిమీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కళింగుల గురించి తెలుస్తున్న చరిత్ర అంతా., హాతిగుంఫా శాసనం నుండే. ఇది ఖారవేలుని పరిపాలనాకాలంనాటిది.

పాలకులు

  • ఖేమ్ రాజ లేదా క్షేమరాజు
  • వుధ రాజ లేదా వృద్ధరాజు
  • ఖారవేల లేదా భిక్కు/భిక్షురాజు - ఈ వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు.
  • వక్రదేవ/కుడేపసిరి
  • వడూఖ/బడుఖ

శాతవాహనులతో యుద్ధాలు

ఖారవేలునికి, అతని సమకాలీనుడైన శాతవాహన రాజు శాతకర్ణి జరిగిన యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.

మతం

పరమతసహనాన్ని పాటించిన మహామేఘవాహనులు., జైనమతాన్ని పోషించినట్టు తెలుస్తున్నది. [1][2]

చిత్రమాలిక

మూలాలు

  1. Hampa Nagarajaiah (1999). A History of the Early Ganga Monarchy and Jainism. Ankita Pustaka. p. 10. ISBN 978-81-87321-16-3.
  2. Kailash Chand Jain (2010). History of Jainism. D. K. Print World (P) Limited. p. 437. ISBN 978-81-246-0547-9.

ఇతర లింకులు