మహారాజా జైసింగ్ II

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jai Singh II
శీర్షిక Maharajah Sawai
ముందువారు Bishan Singh
తరువాతి వారు Isrisingh
జీవిత భాగస్వామి Bikaner princess
Sheopur princess
Udaipur princess
1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum

మహారాజ సవై జైసింగ్ (నవంబర్ 3, 1688సెప్టెంబర్ 21, 1743) అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజ్యము యొక్క రాజు. అతను కచ్ వాహ యొక్క రాజధాని అంబర్ లో జన్మించారు. 31 డిసెంబర్ 1699న మరణించిన అతని తండ్రి మహారాజ బిషన్ సింగ్ మరణాంతరము, అతడు 11 ఏళ్ళ ప్రాయములో అంబర్ కు రాజయ్యాడు. 21 ఏప్రిల్ 1721న మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అతనిని సరమాద్-ఈ-రాజాహా-ఈ-హింద్ బిరుదుతో సత్కరించాడు మరియు 2 జూన్ 1723న చక్రవర్తి అతనిని రాజ్ రాజేశ్వర్, శ్రీ రాజాధిరాజ్ మరియు మహారాజ సవై వంటి బిరుదులతో సత్కరించాడు.[1] "సవై" అనగా అతని సమకాలీనుల కన్నా ఒకటింపావు రెట్లు అతడు అధికుడు అని అర్ధం. నేటివరకు ఈ బిరుదులు అతని వంశీయులకు అలంకారములు అయ్యాయి.

అతని సింహాసన అధిరోహణ సమయంలోని పరిస్థితి[మార్చు]

అంబర్ లో సవై జైసింగ్ తన వంశస్థుల సింహాసనంపై కూర్చునప్పుడు, అతడు కేవలం 1000 మంది అశ్విక దళ సభ్యుల మద్దత్తును కలిగి ఉన్నాడు—ఈ అంతులేని సంఘటన గత 32 సంవత్సరాలలో తలెత్తింది మరియు అదే సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలన కొనసాగుతున్నది. తమ రాజ్యము మొఘలుల ముఖ్య పట్టణాలైన ఢిల్లీ మరియు ఆగ్రాలకు దగ్గరగా ఉండటం వలన జైపూర్ రాజులు మొఘలులతో దౌత్యవ్యవహారాలు జరపటానికి సంసిద్ధులై ఉంటారు. ఔరంగజేబ్ క్రింద ఉన్న, విజయవంతమైన కచవాహ రాజులు రామ్ సింగ్ I కాలము నుండి తమ స్థానముల నుంచి వాస్తవంగా తొలగించబడ్డారు మరియు ఢిల్లీ చక్రవర్తితో తమకు చాలా సంవత్సరాల నుంచి గల విరోధానికి తగిన మూల్యాన్ని చెల్లించారు. దక్కన్ లో ప్రచారము చేస్తున్నప్పుడు ఆంతు చిక్కని పరిస్థితులలో వారి యొక్క ఇద్దరు నాయకులు, జైసింగ్ I మరియు కున్వర్ కిషన్ సింగ్ లు మరణించారు.

అతని గద్దెకెక్కిన ఆరు నెలల తరువాత, ఔరంగజేబ్ దక్కన్ యుద్ధములో నాశనమైన ప్రాంతములను పాలించమని జైసింగ్ ను ఆజ్ఞాపించాడు. కానీ అతను దాదాపు సంవత్సరం పాటు ఆ ఆజ్ఞకు ప్రతిస్పందించలేదు. కావలసిన దానికన్నా ఎక్కువ మందిని తమ బలగములో చేర్చుకోమని అతను మన్సాబ్కి ఇచ్చిన ఆజ్ఞ కూడా దీనికి ఒక కారణము. అతడు షేపూర్ రాజైన రాజా ఉత్తమ్ రామ్ గౌర్ యొక్క మేనల్లుడైన ఉదిత్ సింగ్ కుమార్తెను మార్చి, 1701న వివాహము చేసుకోబోతునట్లు ప్రకటించాడు. జైసింగ్ ఆగష్టు 3, 1701న బుర్హన్పూర్ చేరుకున్నాడు, కానీ అధిక వర్షాల కారణంగా ఏమీ చేయలేకపోయాడు. దీనికి అదనముగా సెప్టెంబర్ 13, 1701 న అతని స్థాయి (500 కు దగ్గరగా) తగ్గించబడినది మరియు రుసుము కూడా వసూలు చేయబడింది.[2] అతని సైన్యము అత్యంత పరాక్రమముతో ఖేలనాను ముట్టడించటంతో (1702), అతని స్థాయి పునరుద్ధరించబడినది మరియు అతను తన సవై (సవై-అర్ధము ఒకటి మరియు పావు, అనగా ఒక మనిషి కన్నా ఎక్కువ సామర్ధ్యము గల) బిరుదు కూడా తిరిగి పొందాడు. ఔరంగజేబ్ యొక్క మనవడు బీదర్ బఖ్త్ సవై జైసింగ్ ను మాల్వా రాజ్య భాగానికి అధికారిగా నియమించాడు (1704), ఔరంగజేబ్ ఈ నియామకాన్ని కోపంతో జైజ్ నిస్ట్ (ఇస్లాం మతానికి సంబంధించనిది లేదా విరుధమైనది) గా ఉన్నదని రద్దు చేశాడు.

తర్వాతి మొఘలులతో సంబంధాలు[మార్చు]

ఔరంగజేబ్ యొక్క మరణాంతరము (1707) జైసింగ్ యొక్క కష్టాలు ఎక్కువ అయ్యాయి. మొఘల్ వారసత్వ యుద్ధంలో అతని పోషకుడు బీదర్ బఖ్త్ మరియు అతని తండ్రి ఆజం పరాజయం వైపు ఉన్నారు— విజయుడైన బహదూర్ షా వారి భూములను స్వాధీన పరచుకొనే ప్రయత్నాలతో రాజపుత్రులపై ఔరంగజేబ్ యొక్క విరుద్ధమైన మరియు సంకుచిత విధానములను కొనసాగించాడు. సవై జైసింగ్, మొఘలులను ఓడించి వారిని రాజపుతానా నుండి వెళ్ళగొట్టిన రాజపుత్ర రాష్ట్రములు మేవార్ మరియు మార్వార్ తో సంధి (వివాహ బంధంతో) కుదుర్చుకున్నాడు. రాజపుత్రులను పరిపాలనా వ్యవహారాలలోకి తీసుకోకూదడనే ఔరంగజేబు నియమాన్ని తదుపరి మొఘలులు రద్దు పరచారు—— ముఖ్యమైన రాష్ట్రాలు ఆగ్రా మరియు మాల్వాలను పాలించడానికి జై సింగ్ నియమిపబడ్డాడు. ఆగ్రాలో దృఢ శరీరంగల జాట్ వ్యవసాయదారులతో వివాదం తెచ్చుకున్నాడు.

భరత్పూర్ రాష్ట్ర నిర్మాణము[మార్చు]

ఔరంగజేబ్ సంకుచిత సిద్ధాంతాలు మరియు అతని ప్రాంతీయ ముస్లిమ్ పాలకుల క్రూరతల వలన ఇతర హిందువులు మరియు సిక్కులువలె జాట్లు కూడా రెచ్చగొట్టబడి విప్లవానికి దారితీశారు. ఔరంగజేబ్ దక్కన్ యుద్ధములలోని గందరగోళ స్థితిలో మునిగి ఉన్నప్పుడు, ఆగ్రా రాజ్య భాగములో మొఘలుల దుష్ట పరిపాలనను జాట్లు విజయవంతముగా ప్రతిఘటించారు. కానీ తరువాతి సంవత్సరాలలో కొన్ని జాట్ల యుద్ధ కూటములు పౌరులపై దాడులుకు మరియు దోపిడీలకు పాల్పడ్డారు——రాజపుతుల కూటమి (1708–10) కి వ్యతిరేకంగా తరువాతి మొఘలులు చేయుచున్న యుద్ధములో వారి సహాయార్ధం వారి యొక్క నాయకుడు చురామన్ 6000 మంది సైన్యాలను పంపాడు కూడా. తన రాజ్యములో ఈవిధమైన అలజడులను సవై జైసింగ్ భరించలేక పోయాడు అందుచే 1722లో జాట్ల బలమైన స్థావరమైన థన్ పై దాడి చేశాడు. చురామన్ మేనల్లుడు బదన్ సింగ్ జైసింగ్ వద్దకు వచ్చి థన్ కి సంబంధించిన లోటుపాట్లపై ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. ఈ ఆక్రమణ తర్వాత జైసింగ్ ఇతర చిన్నచిన్న కోటలను స్వాధీనము చేసుకొని నాశనము చేశాడు, జాట్ల యుద్ధ కూటములను విజయవంతముగా చెదరగొట్టగలిగాడు. సవై జైసింగ్, బదన్ సింగ్ ను అక్కడ తన యొక్క స్థానిక ఉప సామంతునిగా నియమించాడు, మరియు జాట్లలో గుర్తింపు కలిగించటానికి అతనికి బ్రజ్-రాజ్ (మథుర రాజ్యపాలకుడు) అనే బిరుదును ఇచ్చాడు. అతను ఇచ్చిన ప్రోధ్బలముతో బదన్ సింగ్ అనేక క్రొత్త కోటలను నిర్మించాడు, అందులో ఒకటి జాట్ రాజ్యము యొక్క భవిష్య రాజధానిగా పిలవబడే భరత్పూర్. ఒక హిందువు తమ యొక్క రాజ్య పాలకుడిగా మరియు తమలోని ముఖ్యుడు ఉప నాయకుడిగా ఉండటంతో సాధారణ జాట్ ప్రజానీకం శాంతించింది. బదన్ సింగ్ నాయకత్వంలో మరియు వివేకవంతమైన సవై జైసింగ్ పాలనలో జాట్లు సాధారణ గ్రామ యోధుల స్థాయి నుంచి తమకంటూ ఒక గుర్తింపు ఉన్న ఒక రాజ్య స్థాయికి ఎదిగారు.

సవై జైసింగ్ మరియు మరాఠాలు[మార్చు]

కచవాహ పాలకులు మాల్వాను పాలించటానికి 1714 మరియు 1737 మధ్య కాలంలో మూడుసార్లు నియమింపబడ్డారు. జైసింగ్ యొక్క మొదటి మాల్వా వైస్-రాయల్టీ (సుబహ్దర్) (1714–1717)లో, దక్షిణ (దక్కన్) రాజ్యము నుంచి లోనికి ప్రవేశించిన ఒంటరి మరాఠా యుద్ధ కూటములను జైసింగ్ స్థిరముగా పోరాడి తరిమివేసాడు. 1728లో పేష్వా బాజీ రావు, మొఘల్ దక్కన్ లోని భాగమయిన హైదరాబాద్ యొక్క నిజాంను ఓడించాడు, (షేగాన్ ఒడంబడిక, ఫిభ్రవరి 1728). నిజాం స్వంత సంస్థానాలను వాడుకోవడానికి బాజీరావుతో కుదిరిన ఒప్పందం వలన, మరాఠాలకు బేరార్ మరియు ఖాందేశ్ నుంచి హిందూస్తాన్ లోనికి ప్రవేశించటానికి ఉచిత మార్గమునకు నిజాం అనుమతినిచ్చాడు. దీనితో మరాఠాలు మాల్వా అవతల దక్షిణ సరిహద్దులో స్థిర స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లభించింది. 29 నవంబర్ 1728న మాల్వా అధిపతి గిరిధర్ బహదూర్ పై పేష్వా సోదరుడు, చిమాజి అప్ప సాధించిన విజయము ఫలితముగా, నర్మదా దక్షిణ సరిహద్దు ప్రాంతములోని ఎక్కువ భాగము మరాఠాలు తీవ్రముగా బాధపడుతున్నారు.

దూరదృష్టి గల రాజ్యాధిపతిగా మాల్వాకు సవై జైసింగ్ రెండవసారి నియమించబడటం (1729–1730)తో, జైసింగ్ తను మొదటిసారి వైస్-రాయల్టీ అయిన దగ్గరి నుంచి గడిచి పోయిన 12 సంవత్సరాలలో రాజకీయ పరిస్థితులలో వచ్చ్చిన మార్పులను అవగాహన చేసుకున్నాడు. అత్యున్నత అధికారము హైదరాబాద్ నిజాం విప్లవం వలన అవిటిదయ్యింది అదేవిధముగా మరాఠాల అంతర్గత పరిస్థితులను నియంత్రించిన పేష్వా బాజీరావు సామర్ధ్యము ఫలితముగా గుజరాత్ ఆక్రమణ మరియు సాయుధ దళాలలో అనూహ్య పెరుగుదల సంభవించాయి. ఏది ఏమైనప్పటికీ, తమ పూర్వ రాజుల మధ్య స్నేహబంధము పేరుతో, సవై జైసింగ్ II మరాఠాలు కొద్ది వారాల క్రితం ఆక్రమించిన గొప్ప దుర్గము మండు (ఆర్డర్ తేది 19 మార్చి 1730) ని పునరుద్ధరించుటకు, షాహుకి అర్జీ పెట్టుకోగలడు. బాగా ఇబ్బందిపెడుతున్న విషయాలను చూసుకోవటానికి మేలో జైసింగ్ తిరిగి రాజ్పుటనకి పిలవబడ్డాడు, దీని ఫలితముగా అతను మాల్వాతో తనకు గల అనుబంధాన్ని రెండు సంవత్సరాల పాటు కోల్పోయాడు.

1732లో జైసింగ్ చివరిసారిగా మాల్వా (1732–1737)కి సుబేదారగా నియమించబడ్డాడు, ఆ సమయములో గతించిన మిర్జా రాజ (జైసింగ్ I) మరియు అతని సొంత తాత, శివాజీల దయను మరియు వారి మధ్య గల సంబంధాన్ని గొప్పగా గుర్తుంచుకున్న, మరియు షాహు క్రింద ఉన్న మరాఠాలతో రాజీ కుదుర్చుకున్న ముహమ్మద్ షాకి మద్దత్తు ఇచ్చాడు. ఈ తెలివైన నిర్ణయం వలన, ఢిల్లీలోని మొఘల్ ఆస్థానంలోని జైసింగ్ వ్యతిరేక వర్గ సమర్ధతతో పాటు తన సంకల్పమును నొక్కి చెప్పుటలో అసక్తతలు ద్విగుణీకృతమై జైసింగ్ పదవి నుంచి తొలగించబడటంతో పాటు మొఘలులు యుద్ధానికి సిద్ధపడ్డారు. దీంతో సవై జైసింగ్ II మాల్వాకు ఆఖరి సుబేదార్ గా వ్యవహరింపబడుతున్నాడు, ఇతని స్థానంలో 1737లో నియమింప బడిన నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా పేష్వా చేతిలో అతి ఘోరంగా విఫలమైయ్యాడు, ఫలితముగా మాల్వా మొత్తాన్ని మరాఠాలకు వదులుకున్నాడు (దురహ ఒప్పందము, శనివారము 7 జనవరి 1738).

ఢిల్లీ ప్రభుత్వ క్షీణత ప్రభావము వలన పర్షియన్ నాయకుడు నాదిర్ షా మొఘలులను కర్నాల్ (13 ఫిభ్రవరి 1739) వద్ద ఓడించాడు మరియు చివరికి ఢిల్లీని ఆక్రమించాడు (అదే సంవత్సరం, మార్చి 11). ఈ గందరగోళ పరిస్థితులలో కూడా జై సింగ్ తన సొంత రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు-కానీ ఖాళీగా కూర్చోలేదు. రాబోయే కష్ట కాలంపై ముందుగానే ఆలోచనగల సవై జైసింగ్ II, కోటల రక్షణ కొరకు ఒక విస్తృత కార్యక్రమాన్ని ఠికాణాలలో జైపూర్ ఆధ్వర్యములో ప్రారంభించాడు, ఇప్పటివరకు కూడా జైపూర్ చుట్టు పక్కల గల కోట రక్షణలు అన్నీ సవై జైసింగ్ II కాలపు సమర్ధతను తెలుపుతూనే ఉన్నాయి.

సవై జైసింగ్ యొక్క సాయుధ దళాలు మరియు రాజపుటానాపై అతని ఆశయాలు[మార్చు]

జైసింగ్ తన పూర్వీకులు ఇచ్చిన రాజ్యాన్ని మొఘలుల మరియు తిరుగుబాటు సామంతుల స్థలాలను కలుపుకోవటం ద్వారా-కొన్ని సార్లు డబ్బు చెల్లించటం ద్వారా మరియు కొన్నిసార్లు యుద్ధాల ద్వారా విస్తరించాడు. వీటిలో అత్యంత ప్రధానమైనది షెఖావతి యొక్క ఆక్రమణ, ఇది జైసింగ్ కు తన సైన్యాన్ని వేగంగా విస్తరించుకోవటానికి అధిక సామర్ధ్యము గల నియామకములు చేసుకోవటానికి లభించిన అవకాశం కూడా.

జాదునాథ్ సర్కార్ వేసిన ఒక అంచనా ప్రకారం; జైసింగ్ యొక్క సైన్యము 40,000 మంది మనుషులకు మించదు, దానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి 60 లక్షలు, కానీ అతని బలమంతా పెద్ద సంఖ్యలో గల ఫిరంగి దళం మరియు విస్తారమైన సరఫరా గల ఆయుధ సంపత్తి అందు ఉంది, దీనిని అతను చాలా జాగ్రత్తగా నిర్వహించేవాడు మరియు అతని ఆయుధాలు సమకూర్చే పధ్ధతిలో రాజపుత్ ల సంప్రదాయక కత్తి మరియు డాలులకు బదులుగా తుపాకులు ఉండేవి - అతను తన వివేకముతో మార్పులను గుర్తించి భారత యుద్ధ తంత్రములో మందుగుండు ఆయుధాలను ప్రవేశపెట్టాడు మరియు తన సైన్యములో తుపాకీ మందుగుండు సామర్ధ్యాన్ని కొత్త యుద్ధాల కొరకు అత్యున్నతముగా ఉంచేందుకు సిద్ధపడ్డాడు, ఆ విధముగా అతను తరువాతి భారత పాలకులైన మిర్జా నజఫ్ ఖాన్, మహాద్ జీ సింధియా మరియు టిప్పు సుల్తాన్ ల విజయాలను ముందుగానే ఉహించాడు. తన రాజధానిని జైపూర్ కు మార్చబోయే ముందు తయారు చేసిన సవై జైసింగ్ యొక్క ప్రయోగాత్మక ఆయుధం ది జైవన అనేది ప్రపంచంలోనే అతి పెద్దదైన చక్రాల మర ఫిరంగిగా ఉండేది. 1732లో సవై జైసింగ్ మాల్వాకి ప్రతినిధిగా ఉన్నప్పుడు అతను ఆశ్వికులు మరియు పదాతి -తుపాకీ సైనికులు సమాన నిష్పత్తిలో గల 30,000 సైనికులను ఆధీనములో ఉంచుకున్నాడు. వీటిలో అనిశ్చితమైన ఆగ్రా మరియు అజ్మీర్ లోని సుబాహ్ లు మరియు తన సొంత ప్రదేశములోని కోట రక్షక దళాలు లేవు.

జైసింగ్ యొక్క సైనిక బలము అతనిని ఉత్తర భారత దేశములో అత్యంత ప్రియమైన పాలకునిగా చేశాయి, మరియు ఇతర రాజులు అతని నుండి రక్షణ కోరుకుంటారు మరియు చక్రవర్తికి చెందిన ఆస్థానములో వారి యొక్క ఆసక్తులు వృద్ధి అగుచున్నవి.వేగంగా విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యము మరియు ఉత్తరాన దాని దాడులు రాజపుత్ర ముఖ్యులలో ప్రమాద ఘంటికలు మోగించాయి——హుర్ద (1743)లో జైసింగ్ రాజపుత్ర పాలకుల విషయంపై చర్చించటానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు, కానీ ఈ సమావేశం వలన ఎటువంటి ఫలితము లభించలేదు. 1736లో పేష్వా బాజీరావు మేవార్ రాజ్యముపై కప్పమును విధించాడు. మరాఠా ఆధిపత్యాన్ని అడ్డగించుటకు సవై జైసింగ్ స్థానిక నాయకత్వ సమష్టి పాలనలో జైపూర్ నాయకత్వములో రాజపుటనలో ఒక రాజకీయ సంఘాన్ని ఏర్పరచటానికి పధకము వేశాడు. అతడు మొదటిసారి మాల్వా భూభాగంలో బుండి మరియు రాంపురాలను కలిపాడు, మేవర్ తో వివాహసంబంధాన్ని కుదుర్చుకున్నాడు, మరియు బికనేర్ మరియు జోధ్పూర్ లోని రాథోర్ ల యొక్క వ్యవహారాలలో జోక్యము చేసుకున్నాడు. ఈ అరకొరగా విజయవంతమైన చర్యలు ఇదే మరాఠాల వైపు సహాయము కోసము మళ్ళిన ఇతర రాజపుత్ర వంశాలపై కఠినముగా మోపబడ్డాయి, మరియు పర్యవసానముగా రాజస్తాన్ పై వారి ఆధిపత్యము అసహ్యించుకోబడింది! 1743 లో సవై జైసింగ్ మరణాంతరము (అతడు జైపూర్ కి ఉత్తరాన గల గైటర్ లోని రాజరిక శ్మశాన వాటికలో దహనం చేయబడ్డాడు), ఈ సమస్యలు తక్కువ సామర్ధ్యము గల అతని కుమారుడు ఇష్వరీ సింగ్ కి సంక్రమించాయి.

సామాజిక మరియు సాంస్కృతిక విజయాలు[మార్చు]

సవై జైసింగ్, అశ్వమేధ (1716)[3] యాగం — మరియు వాజపేయ (1734) వంటి పురాతన వైదిక ఉత్సవాలు శతాబ్దాల కాలంలో నిర్వహించిన మొట్టమొదటి హిందూ చక్రవర్తి, ఈ రెండు సందర్భాలలో విశేషంగా దాన ధర్మాలు చేయబడ్డాయి. వైష్ణవ మతంలోని నింబార్క సంప్రదాయం పాటిస్తూనే సంస్కృతం నేర్చుకోవడాన్ని మరియు హిందూ సమాజంలోని రుగ్మతలైన సతీ సహగమనాన్ని తుడిచి పెట్టటం మరియు రాజపుత్రుల వివాహముల ఆడంబరాల ఖర్చులను తగ్గించటంపై దృష్టి సారించాడు. జై సింగ్ యొక్క మొండి పట్టు వలననే హిందూ ప్రజలపై ఔరంగజేబ్ (1679) విధించిన జిజియా పన్నును ఎట్టకేలకు మహమ్మద్ షాచక్రవర్తి 1720లో పూర్తిగా రద్దు చేశాడు. గయలో హిందువులపై విధించిన యాత్రికుల పన్నును 1728లో తొలగించటంలో జై సింగ్ విజయం సాధించాడు.

1719లో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీల ఆస్థానంలో జరిగిన తీవ్రమైన చర్చను తిలకించాడు. ఆ వాడి వేడి చర్చ, చక్రవర్తి ప్రయాణం ప్రారంభించటానికి శుభప్రథమైన రోజు నిర్ణయించుటకు వేయవలసిన ఖగోళ సంబంధ గణాంకాలకు సంబంధించింది. దేశములోని ప్రజలు ఖగోళ శాస్త్ర విషయాలలో విద్యావంతులు కావలసిన అవసరం ఎంతో ఉన్నదని, ఈ చర్చ ద్వారా జైసింగ్ గ్రహించాడు. స్థానిక పోరాటాలు, విదేశీ దండయాత్రలు, మరియు తదితర గందరగోళముల, మధ్య సవై జైసింగ్ కు ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలు నెలకొల్పుటకు సమయము మరియు శక్తి లభించుట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఢిల్లీలో సవై జైసింగ్ చే నిర్మించబడిన ప్రయోగశాల

ఢిల్లీ, మథుర (అతని యొక్క ఆగ్రాలోని రాజ్యభాగము), బెనారస్, ఉజ్జయిని (అతని యొక్క మాల్వా రాజ్యభాగము), మరియు అతని యొక్క జైపూర్ సొంత రాజధానులలో ఐదుకి తక్కువ కాకుండా భారీ కట్టడాలు నిర్మించారు. వాటి అన్నింటిలో జైపూర్ లో ఉన్నది మాత్రమే పనిచేస్తోంది. ప్రాథమికంగా హిందూ ఖగోళ శాస్త్రంపై ఆధారపడిన ఈ భవనాలు, గ్రహణాలు మరియు ఇతర ఖగోళ సంబంధ సంఘటనల గురించి కచ్చితంగా అంచనా వేయటానికి ఉపయోగపడుతున్నాయి. పరిశోధనాశాలలకు తను పిలిపించిన ఐరోపా జెసూట్ ఖగోళ శాస్త్రవేత్తలు ఉపయోగించే పరికరాల కన్నా అతని పరిశోధనాశాలల్లో ఉపయోగించే పరిశీలనా పద్ధతులు మరియు సాధనములు ఎంతో మెరుగైనవి.[4][5] జంతర్ మంతర్ అని పిలువబడే నిర్మాణంలో రామ్ యంత్ర (మధ్యలో ఒక స్తంభం కలిగి ఖాళీ పైకప్పుతో గల ఒక స్థూపాకార భవంతి), జైప్రకాష్ (ఒక పుటాకార అర్థగోళము), సామ్రాట్ యంత్ర (ఒక పెద్ద అయనరేఖ గడియార ఫలకము), దిగంశ యంత్ర (వృత్తాకార గోడలచే ఆవృతమైన ఒక స్తంభం), మరియు నరివాలయ యంత్ర (స్థూపాకార గడియార ఫలకము) ఉన్నాయి.

జైపూర్ నగర నిర్మాణం జై సింగ్ యొక్క అతి గొప్ప విజయం (మొదట్లో 'సిటీ అఫ్ విక్టరీ' గా సంస్కృతంలో జైనగర అని పిలవబడే, ఈ నగరాన్ని తర్వాత 20వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటీషు వారు 'పింక్ సిటీ' అని వ్యవహరించారు), ప్రణాళికాబద్ధంగా నిర్మిచబడిన ఈనగరం తర్వాత భారతదేశంలోని రాష్ట్రాలలో ఒకటైన రాజస్తాన్ ముఖ్య పట్టణం అయ్యింది. మయినప్పటికీ శంకుస్థాపనా మహోత్సవం 1727లో జరిగినప్పటికీ, 1725 ఆరంభంలోనే నిర్మాణం ప్రారంభమయింది, 1733లో అంబర్ కు బదులుగా జైపూర్ కచావాహకు అధికారికంగా ముఖ్య పట్టణం అయ్యింది. ప్రాచీన హిందూ చట్ర పధ్ధతిలో నిర్మింపబడిన ఈనగరం 3000 BCE లో, పురావస్తు శిథిలాలలో కనుగొనబడింది, దీనిని ప్రాచీన సంస్కృత వ్రాతప్రతులలో (శిల్ప-సూత్రాలు ) నగర నిర్మాణము మరియు వాస్తుశిల్పములను బోధించిన బ్రాహ్మిన్ విద్యాధర్ రూపొందించాడు. గట్టి గోడలచే రక్షింపబడే, మరియు తగిన ఫిరంగి దళం మద్దత్తు కలిగిన 17,000 మంది రక్షక దళాన్ని కలిగి అత్యంత భద్రత కల ఈ ధనవంతపు నగరానికి భారతదేశము నలుమూలల నుంచి వ్యాపారాలు వచ్చి స్థిరనివాసము ఏర్పరచుకున్నారు.

జాన్ నేపియర్ వంటి వారి రచనలను కూడా రాజు అనువదించాడు. అనేకమైన ఈ విజయాల ఫలితముగా, సవై జైసింగ్ II ఈ రోజు వరకు కూడా 18వ శతాబ్దపు భారత దేశములోని రాజులలో గొప్పవాడిగా నిలిచాడు. జైపూర్, వారణాసి, మరియు ఉజ్జయినిలోని జైసింగ్ యొక్క వేదశాలలు ప్రస్తుతము కొనసాగుతున్నాయి. ఢిల్లీలోనిది ఒకటి మాత్రము పనిచేయటం లేదు మరియు మథురలోనిది చాలా కాలము నుంచి కనిపించకుండా పోయింది. [6]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • రాజపుత్రుల జాబితా

గమనికలు[మార్చు]

 1. సర్కార్, జదునాథ్ (1984, పునః ముద్రణ 1994) ఎ హిస్టరీ ఆఫ్ జైపూర్ , న్యూఢిల్లీ: ఓరియంట్ లాంగ్ మాన్, ISBN 81-250-0333-9, p.171
 2. సర్కార్, జదునాథ్ (1984, పునః ముద్రణ 1994) ఎ హిస్టరీ ఆఫ్ జైపూర్ , న్యూ ఢిల్లీ: ఓరియంట్ లాంగ్ మాన్, ISBN 81-250-0333-9, p.157
 3. బోవ్కర్, జాన్, ది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్, న్యూయార్క్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1997, p. 103
 4. Sharma, Virendra Nath (1995), Sawai Jai Singh and His Astronomy, Motilal Banarsidass Publ., pp. 8–9, ISBN 8120812565 
 5. Baber, Zaheer (1996), The Science of Empire: Scientific Knowledge, Civilization, and Colonial Rule in India, State University of New York Press, pp. 82–90, ISBN 0791429199 
 6. శర్మ, వీరేంద్ర నాథ్ (1995), సవై జైసింగ్ అండ్ హిజ్ ఆస్ట్రానమి , మోతీలాల్ బనారసిదాస్, ISBN 8120812565

సూచనలు[మార్చు]

 1. సర్కార్, జడునాథ్ (1984, పునః ముద్రణ 1994) ఎ హిస్టరీ ఆఫ్ జైపూర్, న్యూఢిల్లీ: ఓరియంట్ లాంగ్ మాన్, ISBN 81-250-0333-9
 2. జ్యోతి J. (2001) రాయల్ జైపూర్, రాలి బుక్స్, ISBN 8174361669
 3. టిల్లోట్సన్ G, (2006) జైపూర్ నామ, పెంగ్విన్ బుక్స్
 4. మిచిల్ స్చ్వార్జ్, (1980) అబ్జర్వేటరియ : డి అస్త్రోనోమిస్చే ఇన్ స్ట్రుమెంటేన్ వాన్ మహారాజ సవై జైసింగ్ II ఇన్ న్యూఢిల్లీ, జైపూర్, ఉజ్జయిన్ ఎన్ బెనారెస్, అంస్టర్ డాం: వెస్ట్ ల్యాండ్/ఉత్రేచ్ట్ హైపోతీక్ బ్యాంకు

బాహ్య లింకులు[మార్చు]