మహావాది వెంకటప్పయ్య శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహావాది వెంకటప్పయ్య శాస్త్రి పేరుపొందిన కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు.

విశేషాలు[మార్చు]

గుంటూరు జిల్లా, నర్సరావుపేట తాలూకా (ప్రస్తుతం పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన ) సంతగుడిపాడు ఇతని స్వగ్రామం. ఇతడు తన తండ్రి వద్ద మొదట సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. తరువాత చదలవాడ కుమారస్వామి వద్ద వయోలిన్ నేర్చుకున్నాడు. గాత్రం పట్ల అభిరుచి ఏర్పడటంతో బలిజేపల్లి సీతారామయ్య వంటి విద్వాంసుల శిష్యరికంలోను, స్వయంకృషితోనూ స్వంతబాణీని ఏర్పరచుకున్నాడు. ఇతడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి విద్వాంసుల ప్రశంసలను అందుకున్నాడు. కర్ణాటక సంగీతమే కాక పౌరాణిక నాటకరంగ ప్రవేశం కూడా చేసి, ‘పాండవోద్యోగ విజయాల’లో ధర్మరాజు వంటి పాత్రలలో నటించాడు. హరికథా కళాకారుడిగా రాణించాడు. అద్దంకి శ్రీరామమూర్తి సూచన మేరకు నాటకాల నుండి విరమించి పూర్తిగా సంగీత కచేరీలపై దృష్టి సారించాడు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఆంధ్రదేశం నలుమూలలా సంగీత కచేరీలు చేసి పండిత పామరులను రంజింపజేశాడు. 1940లో ఇతని 29వ యేట రాజమండ్రిలో ఇతనికి గండపెండేరంతో సత్కారం జరిగింది. 1970లో కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర, సంగీత నాటక అకాడెమీ వార్షిక మహాసభలో ఇతనికి సంగీత కళాప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించారు. ఎన్నో సన్మానాలు సత్కారాలు ఇతడిని వరించాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి వ్రాసిన కుంతీకుమారి ఖండకావ్యాన్ని మొట్టమొదట తన గాత్రంతో లోకానికి పరిచయం చేశాడు. ఇతని శిష్యులలో చలనచిత్ర నేపథ్య గాయని బి.వసంత, సంగీత దర్శకులు కె. చక్రవర్తి, అశ్వత్థామ వంటి వారే కాక త్రిపురారిభట్ల శ్రీరామమూర్తి, నేలభొట్ల ఆంజనేయశర్మ, షేక్ కబీర్ సాహెబ్, చదలవాడ ప్రేమావతి మొదలైనవారు ముఖ్యులు. ఇతడు తన 63వ యేట 1974, ఫిబ్రవరి 27వ తేదీన మరణించాడు.