Jump to content

మహావీర్ నాయక్

వికీపీడియా నుండి
మహావీర్ నాయక్
జననం
మహావీర్ నాయక్

(1942-03-26) 1942 మార్చి 26 (వయసు: 83)
ఉరుగుట్టు, కాంకే, రాంచీ, బీహార్ (ఇప్పుడు జార్ఖండ్), భారతదేశం
వృత్తి
  • గాయకుడు
  • పాటల రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1962 - ప్రస్తుతం
పేరుపడ్డదినాగపురి సంగీతం
Parentఖుద్దు నాయక్ (తండ్రి)
పురస్కారాలు
  • సంగీత నాటక అకాడమీ అవార్డు (2022)
  • ప్రఫుల్ సమ్మాన్ (2019)
  • లోక్ కళా రత్న అవార్డు (2014)

మహావీర్ నాయక్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కవి & పాటల రచయిత. ఆయన కళారంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును జనవరి 25న ప్రకటించింది.[1][2] మహావీర్ నాయక్ నాగపురి భాషలో ఐదు వేలకు పైగా పాటలను రచించి స్వయంగా 300 పాటలకు పైగా స్వరపరిచాడు. ఆయన 2023లో భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీచే ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అమృత్ అవార్డును అందుకున్నాడు.

మహావీర్ నాయక్ 1985లో సంగీత నాటక అకాడమీ & పద్మశ్రీ అవార్డుల గ్రహీత అయిన ముకుంద్ నాయక్‌తో కలిసి కుంజ్‌బాన్ అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించాడు. సాంస్కృతిక బృందం ప్రదర్శన కోసం 1992లో తైపీకి వెళ్లింది.[3]

జననం

[మార్చు]

మహావీర్ నాయక్ జార్ఖండ్ రాష్ట్రం, రాంచీలోని కంకే ప్రాంతంలోని ఉరుగుటు గ్రామంలో 24 నవంబర్ 1942లో జన్మించాడు.

వృత్తి జీవితం

[మార్చు]

మహావీర్ నాయక్ 1959 నుండి 1961 వరకు పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేసి ఆ తర్వాత రాంచీలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఈసీ (హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌) ఏర్పాటయ్యాక ఇక్కడే ఉద్యోగం వచ్చింది. 2001లో పదవీ విరమణ చేశారు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nagpuri songwriter, composer Mahavir Nayak receives Padma Shri". The Times of India. 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  2. "Padma Awards 2025: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఏడుగురికి పద్మ విభూషణ్‌". 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  3. "Who is Mahavir Nayak: कौन हैं महावीर नायक, जिनको 82 साल की उम्र में मिलेगा पद्मश्री सम्मान". Zee News Hindi. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  4. "Mahabir Nayak gets Padma Shri for preserving Jharkhand's music; says hard work finally paid off". ThePrint. 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  5. "Padma Award: नागपुरी गायक महावीर नायक को पद्मश्री सम्मान, 'भिनसरिया राग' के राजा को राष्ट्रीय पहचान". Navbharat Times. 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  6. "Mahabir Nayak of Jharkhand to be honoured with Padma Shri for his contribution to arts" (in ఇంగ్లీష్). The Statesman. 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  7. "Mahabir Nayak wins Sangeet Natak Akademi 'Amrit' award". The Times of India. 17 September 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.