మహాసముంద్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాసముంద్ జిల్లా
महासमुन्द जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో మహాసముంద్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో మహాసముంద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంమహాసముంద్
Government
 • లోకసభ నియోజకవర్గాలుమహాసముంద్ లోఖ్ సభ
Area
 • మొత్తం3,902 km2 (1,507 sq mi)
Population
 (2011)
 • మొత్తం10,32,275
 • Density260/km2 (690/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.64
Websiteఅధికారిక జాలస్థలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిలలలో మహాసముంద్ జిల్లా ఒకటి. జిల్లా కేంద్రగా మహాసముంద్ జిల్లా ఉంది.

సిర్పూర్ దేవాలయాల నుండి మహానది దృశ్యం

భౌగోళికము[మార్చు]

మహాసముంద్ జిల్లా వైశాల్యం 3902.39. ఇది చత్తిస్‌గఢ్ రాష్ట్రంలో తూర్పు మధ్యభాగంలో ఉంది. జిల్లా 20°47' నుండి 21°31'30" డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82°00' నుండి 83°15'45 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.జిల్లా సరిహాదులలో రాయగఢ్, రాయ్‌పూర్,, ఒడిషా రాష్ట్రం లోని నౌపరా, బర్గర్ జిల్లాలు ఉన్నాయి

జిల్లాలోని బాగ్బహ్రా, బస్న, పిథ్హొర భూభాగంలో గ్రానైట్ గనులు ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు ప్రధానంగా ఉన్న లైంస్టోన్ పొరలు, షాలె, ఇసుకరాయి ఉన్నాయి.నియో-గ్రానైట్, డోలరైట్, క్వార్ట్జ్ కూడా జిల్లాలో లభిస్తున్నాయి. జిల్లాలో విస్తారంగా గనులు త్రవ్వకానికి అవకాశం ఉంది.

రవాణ సౌకర్యం[మార్చు]

మహాసముంద్ జిల్లాలో మూశు జాతీయ రహదారులున్నాయి. అవి. 1.జాతీయ రహదారి. సంఖ్య 6. 2. జాతీయ రహదారి. సంఖ్య 217. 3. జాతీయ రహదారి. సంఖ్య 216, మహాసముంద్ నుండి సరాయి పాలి.... ఒడిషా వరకు నాలుగు వరసల జాతీయ రహదారు నిర్మాణములో ఉంది.

రైల్వే సౌకర్యము[మార్చు]

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో మహాసముంద్ రైల్వేస్టేషను ప్రధానమైనవాటిలో ఒకటి. మహాసముంద్ స్టేషను రాయ్‌పూర్, దుర్గ్, నాగపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్, సంబల్పూర్, తితిలగర్, విశాఖపట్టణం, తిరుపతి, పూరి, బిలాసపూర్, కోర్బా, జోధ్‌పూర్, అజ్మీర్, అహమ్మదాబాదు మొదలైన నగరాలతో చక్కగా అనుసంధానమై ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 10,32,275, [1]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. రోడ్ ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 438 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 216 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1018 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.54%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మహాసముంద్ జిల్లాలో గిరిజన ప్రజలశాతం 28.9%. గిరిజనులు భుజ్ల, బింఝ్వర్, హల్బ, కమర్, కంవర్, ఖరై, ముండ, పర్ధి, బహలియ, సౌర్, సహరియ, సోనర్, సంవర, ఖవర్ [4] జిల్లాలో ప్రధానంగా చత్తీస్‌గర్హి, హింది, ఒరియా భాషలు వాడుకలో ఉన్నాయి.

పరిపాలన[మార్చు]

మహాసముంద్ జిల్లా 5 తాలూకాలు ఉన్నాయి: మహాసముంద్ నగరం, సరైపలి, బగ్బహ్ర, పితోరా, బసన. వీటి నుండి 12 పోలీస్ స్టేషన్లు 5 ఔట్ పోస్టులు ఏర్పాటుచెయ్యబడ్డాయి.

పోలీసు స్టేషన్లు:

 • మహాసముంద్ నగర కొత్వాల్
 • తుంగోయా ఔట్ పోస్ట్ సిర్పూర్
 • భోంకోజ్
 • బఘ్బహ్రా
 • కొంఖన్ ఔట్ పోస్ట్ టెక తిహ్లు
 • తెండుకోన ఔట్ పోస్ట్ బండెలి
 • పతెవ
 • పిథ్హొర
 • శంక్ర
 • బంస ఔట్ పోస్ట్ భవర్పూర్
 • సరైపలి ఔట్ పోస్ట్ బలోడ
 • సింఘొర

ఇవికూడ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
 4. "Demographic Condition". Archived from the original on 2007-09-29. Retrieved 2006-09-22.

వెలుపలి లింకులు[మార్చు]