మహిషమర్దని దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహిషమర్దని దేవాలయ సముదాయం
స్థానము
దేశము:భారత దేశము
రాష్ట్రము:ఒడిషా
జిల్లా:బాలేశ్వర్
ప్రదేశం:Shergarh
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం:మహిషమర్దని
ప్రధాన పండుగలు:నవరాత్రి , దసరా

మహిషమర్దని దేవాలయం సముదాయం ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలోని "బాలాసోర్ పాండి చౌక్"కు 2.5 కి.మీ దూరంలో గల షేర్ ఘర్ లో ఉంది. పురావస్తు సర్వేలో అనేక శిథిల చిత్రాలు భద్రపరచబడ్డాయి.

ఆచారాలు[మార్చు]

ఇందులో ప్రస్తుత పూజారులు పండా బ్రాహ్మణులకు చెందినవారు.ఈ ఆలయం ఒక సేనాపతి కుటుంబం పోషణలో ఉంది. ఇందులో దుర్గాదేవి ఎనిమిది చేతులతో మహిషాసురుడిని వధించునట్లు ఉంది. ఈ సముదాయంలో శివుని దేవాలయం కూడా ఉంది.

వాస్తుశాస్త్రం[మార్చు]

ఈ దేవాలయం 11 వ శతాబ్దానికి చెందినది. ఇది సోమవంశీ క్షత్రియుల కాలం నాటిది. ఈ దేవాలయం 19 వ శతాబ్దంలో పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయ నిర్మాణానికి కంకరను ఉపయోగించారు. శిల్పాల నిర్మాణానికి క్లోరైట్ ఉపయోగించారు. ఈ దేవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయంలో సూర్యుడు మరియు యితర దేవతలైన గణేశుడు, కార్తికేయుడు చిత్రాలు కూడా కనిపిస్తాయి. .

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]