మహ్మద్ కరీమున్నీసా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్‌ కరీమున్నీసా
మహ్మద్ కరీమున్నీసా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చ్ 2021 - 19 నవంబర్ 2021

నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 6 జూన్ 1966
విజయవాడ , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 19 నవంబర్ 2021
విజయవాడ , కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు షేక్ రసూల్, షేక్ మల్లింబీ
జీవిత భాగస్వామి ఎండి సలీం
సంతానం 5 (ఎండీ రుహుల్లా)
నివాసం ముస్తఫా మస్జీద్ స్ట్రీట్, దాబా కోట్ల సెంటర్, విజయవాడ

మహ్మద్‌ కరీమున్నీసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలు. [1]

జననం, కుటుంబం[మార్చు]

మహ్మద్‌ కరీమున్నీసా 6 జూన్ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , [కృష్ణా జిల్లా]] , విజయవాడ లో షేక్ రసూల్, షేక్ మల్లింబీ దంపతులకు జన్మించింది. ఆమె భర్త పేరు ఎండి సలీం. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

కరీమున్నీసా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంది. ఆమె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి 56వ డివిజన్‌ కార్పొరేటర్ గా పని చేసింది. మహ్మద్‌ కరీమున్నీసాను వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 25 ఫిబ్రవరి 2021న ఖరారు చేశాడు. [3] ఆమె శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 8 మార్చి 2021న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు.[4]ఆమె శాసనసభ్యురాలిగా 1 ఏప్రిల్ 2021న ప్రమాణ స్వీకారం చేసింది.[5][6]

మరణం[మార్చు]

ఎండీ కరీమున్నిసా 19 నవంబర్ 2021న విజయవాడలోని తన స్వగృహంలో రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే గుండెపోటుతో మరణించింది.[7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (12 August 2019). "వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  2. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (26 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత". Sakshi. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  4. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  6. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 April 2021. Retrieved 18 July 2021.
  7. V6 Velugu (20 November 2021). "గుండెపోటుతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)