మాంటిస్సోరి విధానము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Twogirls xl.jpg
విద్యాలయములో మాంటిస్సోరి వస్తువులతో అభ్యాసం చేస్తున్న ఆడపిల్లలు

మాంటిస్సోరి విధానము ఇటాలియన్ వైద్యురాలు మరియు అధ్యాపకురాలు అయిన మరియా మాంటిస్సోరి (1870–1952) యొక్క పరిశోధన మరియు అనుభవముల ఆధారంగా పిల్లలకు విద్య నేర్పే పద్ధతి. ఇది ముఖ్యముగా డాక్టరు మాంటిస్సోరి యొక్క ఆవిష్కరణ. 1907లోఆమె దీనిని ఆమె ఈవిధంగా ప్రస్తావించింది "పిల్లవాని యొక్క వాస్తవిక సాధారణ స్వభావము",[1] చిన్నపిల్లలకు వారి స్వీయ-అధ్యయన ప్రక్రియ కొరకు రూపొందించబడిన వస్తువులతో సిద్ధం చేయబడిన పర్యావరణములో స్వేచ్ఛను ఇచ్చి వారిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ప్రక్రియలో ఇది సంభవించింది.[2] ఈ విధానము స్వయంగా పిల్లల వాస్తవిక సహజ ప్రవృత్తిని బయటకు తేవటానికి, నిలుపుకోవటానికి మరియు ఆసరా ఇవ్వటానికి పిల్లపై చేసిన ఈ ప్రయోగాత్మక పరిశీలనను నకలు చేయటానికి పనిచేస్తుంది.[3]

ఈ విధానమును అనుసరించటంలో పిల్లవానిని అతని లేదా ఆమె యొక్క సమగ్రమైన సొంత స్వీయ-నిర్దేశ వికాసమునకు ఒక అంతర్గత సహజ మార్గదర్శకాన్ని కలిగి ఉన్నట్లుగా చూడటంలో ఉపాధ్యాయిని పాత్ర ఉంటుంది.[4] పరిశీలకురాలిగా ఉపాధ్యాయిని పాత్రలో కొన్నిసార్లు పిల్లలతో ప్రయోగాత్మక సంకర్షణ ఉంటుంది, వీనిని సాధారణంగా "పాఠములు" అని ప్రస్తావిస్తారు. ఇవి ప్రవర్తనా లోపములను పరిష్కరించటానికి లేదా పిల్లలు స్వేచ్ఛగా వాడుకోవటానికి పర్యావరణములో సమకూర్చబడిన వివిధ స్వీయ-అధ్యయన వస్తువులను ఏవిధంగా ఉపయోగించుకోవాలో చూపటానికి ఈ సంకర్షణలు ఉపయోగపడతాయి.[5]

పర్యావరణములో పరిస్థితులకు పిల్లల విలక్షణ ప్రవృత్తులు మరియు సున్నితత్వం మూలంగా, ఈ విధానము ప్రధానముగా చిన్నపిల్లలకు (2–6) వర్తిస్తుంది .[6] అయినప్పటికీ, ఇది కొన్నిసార్లు ప్రాథమిక పాఠశాల వయస్సు (6–12) పిల్లలు మరియు అప్పుడప్పుడు పసిపిల్లలు మరియు అప్పుడే నడక నేర్చుకున్న పిల్లలు, అదేవిధంగా మధ్య మరియు ఉన్నత పాఠశాల స్థాయి పిల్లలతో నిర్వహించబడుతుంది.[7][8]

మాంటిస్సోరి అనే పేరు చాలామందిచే గుర్తింపు పొందినప్పటికీ, అది ఒక వ్యాపార చిహ్నం కాదు, మరియు ఇది ఒకటి కన్నా ఎక్కువ సంస్థలతో ముడివడి ఉంది. ఈ విధానాన్ని పిల్లలతో ఉపయోగించటంలో, పాఠశాలలు వాటి వివరణము, ఆచరణాత్మక అన్వయము, మరియు తత్వములో భిన్నముగా ఉంటాయి.[9] ఈ వ్యాసము డాక్టరు మరియా మాంటిస్సోరి యొక్క పరిశోధన మరియు ఆవిష్కరణలు మరియు వాటిని అనుసరించేవారు మరియు ఆచరించేవారు పిల్లలతో వాటి క్రియాశీలక అన్వయమునకు సంబంధించింది.

చరిత్ర[మార్చు]

1900లలో వివేచనాత్మక లోపములతో ఉన్న పిల్లలపై డాక్టరు మరియా మాంటిస్సోరి చేసిన ప్రయోగాత్మక పరిశోధన నుండి "మాంటిస్సోరి విధానము" అభివృద్ధి చెందింది.[10] ఆమె ఈ పరిశోధనను శాస్త్రీయ విద్య అనే ప్రాథమిక ఆలోచన ఆధారంగా ప్రారంభించింది. ఈ ఆలోచన 1800లలో ప్రత్యేక అవసరములు ఉన్న పిల్లలతో ఫ్రెంచ్ వైద్యులు జేన్ ఇటార్డ్ మరియు ఎడౌఆర్ద్ సెగ్విన్ చే అభివృద్ధి చేయబడి అమలు చేయబడింది.[11] ఇటార్డ్ యొక్క విద్యార్థి మరియు సహచరుడు అయిన సెగ్విన్, ప్రత్యేకముగా రూపొందించబడిన స్వీయ-శిక్షణా వస్తువులతో కొన్ని వ్యాయామములను జత చేయటం ద్వారా పిల్లలను వారి సహజ, స్వేచ్ఛా కార్యక్రమములలో గమనించటం అనే ఇటార్డ్ యొక్క మొట్టమొదటి ఆలోచనను విస్తరించాడు. అవకరములు ఉన్న పిల్లలతో డాక్టరు మాంటిస్సోరి యొక్క మొట్టమొదటి పరిశోధనలో ఈ విధానమునే అనుసరించి ఆమె సాధించిన విజయం ఆధారంగా, విలక్షణముగా పెరుగుతున్న పిల్లల విద్యకు కూడా ప్రయోజనం చేకూర్చేటట్లు ఇది ఏవిధంగా అన్వయించబడుతుందో అధ్యయనం చేయటానికి ఒక అవకాశం కొరకు ఆమె వెదకటం ప్రారంభించింది.[12]

1906లో, రోమ్ లోని శాన్ లోరెంజో జిల్లా యొక్క తక్కువ-ఆదాయ గృహ నిర్మాణ ప్రాంతములోని చిన్న పిల్లల (2–6) కొరకు ఒక డే-కేర్ కేంద్రమును స్థాపించటానికి మాంటిస్సోరిని అడిగినప్పుడు ఆ అవకాశం దానంతట అదే వచ్చింది.[13] 1907లో పిల్లల గృహము అనే పేరుతొ ఆమె ఆ కేంద్రాన్ని ప్రారంభించింది, మరియు మునుపు సెగ్విన్ సూచించిన శాస్త్రీయ విధానములో పిల్లలను పరిశీలించటం ప్రారంభించింది.[12] ఈ క్రమములో, పిల్లలు ఆ వస్తువులకు లోతైన ఏకాగ్రతతో ప్రతిస్పందించారని దాని ఫలితంగా వారి ప్రవర్తనలో ప్రాథమిక మార్పు కనిపించిందని, పిల్లలు వారి పర్యావరణములోనే కాల్పనిక, ఏకాగ్రతా లోపం, మరియు క్రమరాహిత్యం వంటి సాధారణ ప్రవర్తనల నుండి గొప్ప శాంతము, ప్రశాంతము మరియు క్రమమైన స్థితికి చేరుకోవటాన్ని డాక్టరు మాంటిస్సోరి వెంటనే కనుగొన్నారు. ఆమె పర్యావరణములో పిల్లలందరిలో సంభవించిన ఈ మార్పును గమనించిన ఆమె, పిల్లవాని యొక్క వాస్తవిక సాధారణ ప్రవృత్తిని కనుగొనగలిగిందని తేల్చి చెప్పింది. తరువాత, డాక్టరు మాంటిస్సోరి ఈ మార్పును ప్రామాణీకరణ అని మరియు కొత్తగా ఆవిష్కృతమైన పిల్లవానిని ప్రమాణీకరించబడ్డవాడు అని ప్రస్తావించింది.[14]

1907 తరువాత, డాక్టరు మాంటిస్సోరి తన ఆవిష్కరణలను మరియు అనుభవాలను ఉపాధ్యాయులకు, మరియు పిల్లలలో ఈ మార్పులు ఎలా వచ్చాయో తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తితో ఉన్న ఇతరులకు నివేదించింది. ఈ ఆసక్తి వెంటనే ఆ విషయం పైన ఆమె పలు పుస్తకాలు రాయటానికి మరియు తన విధానమును వివరించటానికి శిక్షణా కార్యక్రమములను నిర్వహించటానికి దారి తీసింది, ఈ విధానము చిట్టచివరకు "మాంటిస్సోరి విధానము"గా ప్రసిద్ధి చెందింది.[15]

చిన్నపిల్లలతో ఆమె మొదట్లో చేసిన ప్రయోగముల తరువాత, మాంటిస్సోరి నూతన వస్తువులను ప్రవేశ పెట్టటం ద్వారా మరియు వివిధ వయస్సుల పిల్లలతో ఆమె విధానం యొక్క ప్రభావములను అధ్యయనం చేయటం ద్వారా తన పరిశోధనను విస్తరించింది. ఉదాహరణకు, ఆమె జీవిత చరమ దశలో, తన పుస్తకం De l'Enfant à l'Adolescent,[16] (ఫ్రమ్ చైల్డ్ హుడ్ టు అడోలెసెన్స్ ) లో, మాంటిస్సోరి ఉన్నత-పాఠశాల మరియు విశ్వవిద్యాలయములకు తన విధానము ఏ విధంగా అన్వయించబడుతుందో వివరించటం ద్వారా, ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు UNESCO యొక్క కృషికి సహకరించింది. 1952లో ఆమె మరణించే వరకు సుమారు 40 సంవత్సరముల పాటు సాగిన ఆమె రచనలు, ఉపన్యాసములు, మరియు పరిశోధన ఆ విధానమును గురించిన జ్ఞానము యొక్క మూల ఆధారాన్ని కలిగి ఉన్నాయి. ఈ విధానము ప్రస్తుతం ప్రపంచమంతటా మాంటిస్సోరి అన్న పేరుతో సంబంధం ఉన్న పాఠశాలలు మరియు ఇతర విద్యాసంస్థలలో వేర్వేరు సిద్ధాంతములకు అనుగుణంగా నిర్వహించబడుతోంది.[17]

1952లో డాక్టరు మాంటిస్సోరి మరణించినప్పటి నుండి, ఆ విధానము పలు భిన్న సిద్ధాంత మార్గముల గుండా వృద్ధి చెందింది. ప్రతి మార్గము దాని సొంత ప్రత్యేకమైన సంస్థాగత అనుసంధానములు, శిక్షణ మరియు సాధారణ ప్రజలకు ఆ విధానమును అందజేయటాన్ని వృద్ధి చేసుకుంది.[18]

సిద్ధాంతము[మార్చు]

మాంటిస్సోరి విధానము యొక్క సిద్ధాంతము కొంతవరకు స్పష్టత లేకుండా, అయోమయంగా ఉండిపోయింది. దీనికి కారణం 1907లో డాక్టరు మాంటిస్సోరి పిల్లలపైన తన విధానం యొక్క ప్రభావము పూర్తిగా యాదృచ్ఛికం అని కనుగొనటమే. ఆమె జీవితకాలమంతా, డాక్టరు మాంటిస్సోరి తన ఆవిష్కరణ నుండి ఉద్భవించిన ఆ విధానము గురించి సవిస్తారముగా వివరించలేదు; ఆ విధానమును వివరించే బదులు, పిల్లలపై దాని ప్రభావం గురించి ఎక్కువగా మాట్లాడింది మరియు రచనలు చేసింది.[19] అందువలన దాని మూల సిద్ధాంతము యొక్క ప్రశ్నను ఇతరులకు వదిలిపెట్టబడింది, అది చిట్టచివరకు పలు భిన్న మార్గములకు దారితీసింది. కొంతమందికి, ఆ విధానము డాక్టరు మాంటిస్సోరి యొక్క వ్యక్తిత్వముతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది, కావున నేరుగా ఆమె నియంత్రణ మరియు ఉనికికి బయట ఆచరించినప్పుడు, అది అక్కడి సంస్కృతీ సందర్భముల యొక్క అవసరములు మరియు ఆసక్తులకు బద్ధమగునట్లు పలుచబడి తప్పుగా అన్వయించబడుతుంది.[20]

ఆ విధానం యొక్క సిద్దాంతం గురించిన అయోమయం మరియు సంఘర్షణ యునైటెడ్ స్టేట్స్ లో మాంటిస్సోరి[21] యొక్క ఆధునిక వికాసంలో ప్రత్యేక తీవ్రతతో తలెత్తాయి. యునైటెడ్ స్టేట్స్ లో, 1967లో, "మాంటిస్సోరి" అనే పేరు ఒక "సాధారణ పదం"గా ఉంచబడింది, అనగా ఏ సంస్థ దానిని తన సొంత ప్రయోజనం కొరకు దానిని ఉపయోగించలేదు.[22] అప్పటి నుండి, మాంటిస్సోరి సంస్థలు మరియు సిద్దాంతముల సంఖ్య మరియు భిన్నత్వం గణనీయంగా విస్తరించాయి.

 • మాంటిస్సోరి విధానము యొక్క ఒక ముఖ్య సిద్దాంతం స్వయంగా డాక్టరు మాంటిస్సోరి యొక్క వ్యక్తిత్వముతో సంబంధం కలిగి ఉంది. స్వయంగా డాక్టరు మాంటిస్సోరి నుండి లేదా ఆమె కుమారుడు లేదా వారసుడు అయిన మారియో మాంటిస్సోరి నుండి అధికారాన్ని కోరుకుంటున్న డాక్టరు మాంటిస్సోరి యొక్క సహోద్యోగులు మరియు వారసులు చెప్పిన దాని ప్రకారం ఈ సిద్ధాంతము మాంటిస్సోరి విధానమును నిర్వచిస్తుంది.[23]
 • ఆ ఆలోచన చుట్టూ అభివృద్ధి చెందిన రెండవ ప్రముఖ సిద్ధాంతము ఏమిటంటే ఆ విధానము ఆ సమయములో అది పనిచేస్తున్న చుట్టూ ఉన్న సంస్కృతి యొక్క నియంత్రణలో ఉంటుంది. ఈ సంస్కృతి-తరహా సిద్ధాంతము ఆ విధానమును అప్పటి ప్రసిద్ధ సిద్ధాంతములు మరియు సాంప్రదాయ ఆలోచనలలో సరిపడేటట్లు నిర్వచిస్తుంది. ఉదాహరణకు, ఈ సిద్దాంతములో, 1907లో డాక్టరు మాంటిస్సోరిచే వర్ణించబడిన ఆ విధానం యొక్క ప్రభావములు అప్పటి ఇటాలియన్ సందర్భము మూలంగా అని వివరించబడ్డాయి, ఇది వేరే ప్రదేశము మరియు కాలంలో ఉన్న పిల్లలతో నకలు చేయటానికి వీలు కాదు.[24]
 • మూడవ ముఖ్య సిద్ధాంతము ఏమని చెపుతుందంటే మాంటిస్సోరి విధానము ప్రకృతి యొక్క అనంతమైన మరియు ఆద్యంత రహితమైన నియమములకు కట్టుబడినట్లుగా ఉన్న ఒక మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మార్గము ఏ వ్యక్తిత్వానికీ లేదా సంస్కృతికి సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతము వాస్తవిక ఉనికిని సాధించటానికి ప్రకృతి నియమాలను అనుసరించే ఒక శాస్త్రీయ విధానముగా నిర్వచించబడింది.[25] 2003లో, ప్రత్యేకముగా ఈ సిద్ధాంతమును అనుసరించటానికి, ఒక కొత్త, సమగ్ర సాంకేతికత ప్రకటించబడింది.[26]

ఆచరణలో, మాంటిస్సోరి విధానము ఈ మూడు ముఖ్య సిద్దాంతములను కావసినంత మేర ఉపయోగించుకుంటూ అన్వయించబడుతుంది, అయినప్పటికీ అవన్నీ సాధారణముగా ఆ అంశంపైన డాక్టరు మాంటిస్సోరి యొక్క రచనలలో కనీసం కొంత భాగమునైనా సమర్దిస్తాయి. కొందరు కచ్చితంగా ఒక సిద్ధాంతమును లేదా ఇంకొక దానిని అంటిపెట్టుకుని ఉంటే, ఇతరులు వారి సొంత సిద్దాంతముల వినూత్న మిశ్రమాన్ని మరియు ఆమె రచనల వివరణను రూపొందిస్తారు. ఈ భేదములు ఉన్నప్పటికీ, మాంటిస్సోరి విధానముతో అనుగుణంగా ఉండే అనేకమంది అనుసరించేవారు మరియు ఆచరించే వారి మధ్య ఉమ్మడిగా ఉండే పలు అంశములు ఉన్నాయి.

భావనలు[మార్చు]

 • ప్రకృతి యొక్క అంతర్గత మార్గదర్శకత్వం . పిల్లలందరూ వారి వాస్తవిక సాధారణ వికాసమును నిర్దేశించే ప్రకృతి నుండి స్వయంసిద్ధమైన అంతర్గత అదుపాజ్ఞలను కలిగి ఉంటారు.[27]
 • స్వీయ-నిర్దేశ అధ్యయనం కొరకు స్వేచ్ఛ . మాంటిస్సోరి విధానము పిల్లలు వారి కొంత కార్యక్రమాలను ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుంది. ఈ స్వేచ్ఛ స్వీయ-దిశా అధ్యయనము కొరకు పిల్లలు వారి అంతర్గత మార్గనిర్దేశకత్వాన్నిఅనుసరించటానికి అనుమతిస్తుంది.[28]
 • వికాసం యొక్క దశలు . పిల్లల సహజ వికాసం పలు ప్రత్యేక వికాస దశల ద్వారా జరుగుతుంది. వికాస ప్రక్రియలో ప్రాథమిక సామర్ధ్యములను సాధించటానికి ఇందులో ప్రతి ఒక్క స్థాయి దానికి ప్రత్యేకమైన సొంత పరిస్థితులను మరియు సున్నితమైన వ్యవధులను కలిగి ఉంటుంది. మొదటి స్థాయిలో (0–6 సంవత్సరముల వయస్సు) మూల వ్యక్తిత్వం రూపొందటం మరియు భౌతిక జ్ఞానేంద్రియముల ద్వారా నేర్చుకోవటం ఉంటాయి. ఈ దశలో, పిల్లలు భాష నేర్చుకోవటానికి మరియు ప్రాథమిక మానసిక క్రమమును వృద్ధి చేసుకోవటానికి సున్నితమైన వ్యవధులను అనుభవిస్తారు.[29] రెండవ దశ వికాసంలో (6–12) వియుక్త తర్కం ద్వారా నేర్చుకోవటం, ఊహాశక్తి ద్వారా మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా వృద్ధి చెందటం ఉంటాయి. మూడవ దశ (12–18) కౌమార పెరుగుదల కాలము, ఇందులో యుక్త వయస్సులో వచ్చే గణనీయమైన శారీరిక మార్పులు, మానవ వ్యక్తిత్వము ముఖ్యంగా చుట్టుపక్కల సమాజంలోని అనుభవములకు సంబంధించిన వ్యక్తిత్వం విలువను అధ్యయనం చేయటం ఉంటాయి. నాలుగవ దశలో (18+), పెద్దల సంఘంలో పరిణితి చెందే ప్రక్రియలో మిగిలిన వికాసం అంతా పూర్తిఅవటం ఉంటుంది.[30]
 • సిద్ధమైన పర్యావరణము . పిల్లల చుట్టూ ఉన్న సరిఅయిన పరిస్థితులు వారి వాస్తవిక సహజ వికాసానికి వీలుకల్పిస్తాయి మరియు సహకరిస్తాయి. చిన్నపిల్లలకు, స్వీయ-నిర్దేశ అధ్యయనం కొరకు వారి సహజ ప్రవృత్తులను మరియు ఆసక్తులను ప్రేరేపించటానికి, క్రమపద్ధతిలో అమర్చబడి, స్వేచ్ఛగా స్వతంత్రంగా వాడుకోవటానికి అందుబాటులో ఉండే పలు భౌతిక వస్తువులను అందించటం ద్వారా పర్యావరణము ఈ విధంగా సిద్ధం చేయబడుతుంది.[31]
 • పరిశీలన మరియు పరోక్ష బోధన. పిల్లలు వారికి ఇష్టమైన కార్యక్రమాలలో మునిగిపోయేటట్లు చూడటం ఉపాధ్యాయుని పని. పిల్లలను కాకుండా పర్యావరణాన్ని నియంత్రించే ఈ పరోక్ష శిక్షణ, ముందుగానే-నిర్ణయింపబడిన ఒక పాఠ్య ప్రణాళికని అమలు చేయటంలో సాధారణ ఉపాధ్యాయుని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక మాంటిస్సోరి విధాన తరగతిలో ఒక ఉపాధ్యాయిని ప్రవర్తన సరిగాలేని పిల్లవానిని సాధారణ పద్ధతిలోలాగా దండించటం లేదా బహుమతులివ్వటం బదులుగా, పిల్లవాని దృష్టిని కొన్ని మంచి పనుల వైపు మరలుస్తుంది.[32]
 • ప్రామాణీకరణము . 0–6 సంవత్సరముల మధ్యన వికాస స్థాయిలో, పిల్లలు వారి ప్రాథమిక వ్యక్తిత్వాన్ని క్రమరాహిత్యం, ఏకాగ్రతాలోపం, మరియు ఊహలలో విహరించటం నుండి కచ్చితమైన సాధారణ స్థితికి మార్చుకోగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సాధారణ స్థితిలో వారు ఐచ్చిక స్వీయ-క్రమశిక్షణ, స్వతంత్రత, సక్రమత పైన ఇష్టం, మరియు సాంఘిక పరిస్థితిలో ఇతరులతో పూర్తి సామరస్యం మరియు శాంతి వంటి బాహ్య ప్రవర్తన కలిగి ఉంటారు. సాధారణ స్థితికి ఈ మానసిక మార్పు పిల్లలు తమకు తాము స్వేచ్ఛగా కోరుకున్న ఒక శారీరిక క్రియపైన పూర్తి ఏకాగ్రత ద్వారా సంభవిస్తుంది.[33]
 • శోషక మది . చిన్న పిల్లవాడు (0–6) ఒక శోషక మదిని కలిగి ఉంటాడు. ఇది పర్యావరణములోని అనుభవములను నేరుగా దాని సంపూర్ణ మూల వ్యక్తిత్వంలోకి మరియు జీవితకాల వ్యక్తిత్వంలోకి సహజముగా చొప్పిస్తుంది. చిన్నపిల్లలకు ప్రత్యేకమైన, ఈ మానసిక శక్తి, ప్రయత్నమేమీ లేకుండానే, యాదృచికంగా పలు అంశములను నేర్చుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి వాస్తవిక సహజ వికాసానికి తిరిగి రావటానికి కీలకమైన ప్రామాణీకరణ ప్రక్రియకు లోనుకావటానికి కూడా అనుమతిస్తుంది. సుమారు ఆరు సంవత్సరముల వయస్సు తరువాత, ఈ శోషక మది సామర్ధ్యం కనుమరుగైపోతుంది.[34]
 • ఆట కాదు, పని . పర్యావరణములోని ఆకస్మిక అనుభవముల ద్వారా అభివృద్ధి చెందటానికి పిల్లలు ఒక స్వాభావికమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఈ అనుభవములను డాక్టరు మాంటిస్సోరి 'కృత్యము'గా ప్రస్తావించారు.[35] ఈ ఉద్దేశంలో, పిల్లల సాధారణ చురుకుదనం బొమ్మలు లేదా కల్పనల వంటి ఊరికే కూర్చుని ఆడే ఆటల ద్వారా కన్నా, అప్పటి పరిస్థితిలో ఉన్న వాస్తవికతతో ముడిపడి ఉంటుంది.[36][37]
 • బహుళ-వయస్సు వర్గీకరణ . పిల్లలు వారి స్వతంత్ర స్వీయ-నిర్దేశ కార్యకలాపములను సమర్ధించే ఐచ్చిక విధానములో ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు. కావున సాధారణ మాంటిస్సోరి తరగతిగదిలో అన్ని వయస్సుల పిల్లలు కలిసి ఉంటారు, ఉదాహరణకు 2–6 (ప్రాథమిక స్థాయి) లేదా 6–12 (ఎలిమెంటరీ స్థాయి).[38]

మాంటిస్సోరి వస్తువులు మరియు పాఠ్యప్రణాళిక[మార్చు]

మాంటిస్సోరి విధానములో పిల్లవాని యొక్క సొంత సహజ అంతర్గత నిర్దేశం నుండి వచ్చే అధ్యయన పాఠ్య ప్రణాళిక ఉంటుంది మరియు పిల్లవాని వివిధ వ్యక్తిగత ఆసక్తులు పని పైన ఉండటంతో బాహ్య ప్రవర్తనలో అవి వ్యక్తమవుతాయి. ప్రకృతి యొక్క ఈ ఆలోచనను సమర్ధిస్తూ, స్వీయ-నిర్దేశ క్రియల ద్వారా పిల్లవాని ఆసక్తిని ప్రేరేపించటానికి ఈ విధానము వివిధ రకాల వస్తువులను అందిస్తోంది. వికాసం యొక్క తొలి స్థాయిలో (0–6), ఈ వస్తువులు సాధారణముగా ఐదు ప్రాథమిక వర్గములలో చేర్చబడతాయి: క్రియాశీలక జీవనం, ఇంద్రియ సంబంధిత, గణితం, భాష, మరియు సంస్కృతి. ఇతర వర్గములలో భూగోళశాస్త్రము (అంతరిక్షములో పిల్లవాడు తనని తాను చూసుకోవటం), చరిత్ర (కాలంలో పిల్లవాడు తనని తాను చూసుకోవటం), మరియు సామాన్యశాస్త్రము (సహజ ప్రపంచముతో సంకర్షణ) ఉన్నాయి.

క్రియాశీలక జీవనం[మార్చు]

క్రియాశీలక జీవన వస్తువులు మరియు వ్యాయామములు భౌతిక సంయమనం, స్వీయ రక్షణ మరియు పర్యావరణ రక్షణ మొదలైన వాటిని అభివృద్ధి చేసుకోవటానికి చిన్న పిల్లల సహజ ఆసక్తులకు ప్రతిస్పందిస్తాయి. గుండీలు పెట్టుకోవటం, జిప్ వేసుకోవటం, బో (దూముడి) కట్టుకోవటం, లేసు కట్టుకోవటం సాధన చేయటానికి వివధ ఉపకరణములను ఉపయోగించి, కొన్ని ప్రత్యేక వస్తువులు సొంతగా దుస్తులు ధరించటానికి అవకాశములను అందజేస్తున్నాయి. ఇతర క్రియాశీలక జీవన వస్తువులలో పోయటం, తవ్వి తీయటం, మరియు క్రమములో పెట్టటం వంటి కార్యక్రమములు, చెయ్యి-కంటి సంయమనానికి బల్లను శుభ్రపరచటం మరియు వంట చేయటం వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమములు, ప్రామాణీకరణ సాధించటానికి పిల్లలలో ధారణ శక్తిని పెంచటానికి ఒక ప్రయోజనకరమైన అవకాశాన్ని కూడా అందిస్తాయి. ఇతర క్రియాశీలక జీవన కార్యక్రమములలో చేతులు కట్టుకోవటం, కుర్చీలో కూర్చోవటం మరియు ఒక వరుసలో నడవటం వంటి వినయ ప్రవర్తనలలో పాఠములు ఉంటాయి.[39]

ఇంద్రియ విషయములకు సంబంధించిన[మార్చు]

ఇంద్రియ సంబంధ వస్తువులు ప్రమాణం, రంగు, ఆకారం మరియు పరిమాణం వంటి లక్షణములతో సహా, భౌతిక పర్యావరణము యొక్క సహజ క్రమమును అనుభవించటానికి పిల్లలకు వివిధ రకాల కార్యక్రమములు మరియు వ్యాయామములు అందజేస్తాయి.[40] వీటిలో చాలా వస్తువులను సెగ్విన్ శాస్త్రీయ విద్యతో తన మునుపటి పరిశోధనలో మొట్టమొదట సూచించి అభివృద్ధి చేసాడు.[41]

గులాబీరంగు శిఖరము (వివధ ఘన పరిమాణములలో ఉన్న పది వరుస ఘనముల శ్రేణి); గుబురు స్థూపములు (వివిధ పరిమాణములలో ఉన్న స్థూపకములను పెట్టటానికి 10 గుంటలతో కూడిన కొయ్య దుంగలు); వెడల్పు మెట్లు (వరుసగా రెండు పరిమాణములలో ఉన్న పది కొయ్య దుంగలు); రంగుల పలకలు (ఒకే రకమైన వాటిని జత చేయటానికి మరియు ఒకే రంగుతో ఉన్న వాటిని విడిగా పెట్టటానికి రంగుల వస్తువులు) మొదలైనవి ఈ వస్తువులకు ఉదాహరణలు.[42]

గణితశాస్త్రం[మార్చు]

ఈ రంగంలో, గణించటం, స్థాన విలువ, కూడిక, తీసివేత, భాగహారము మరియు గుణకారం వంటి ప్రాథమిక విషయములు చూపటానికి వస్తువులు అందించబడతాయి. సంఖ్యలను నిర్ణయించటానికి, ఎరుపు మరియు నీలం రంగులో ఉన్న భాగములు మరియు "కదురు పెట్టె" లతో కూడిన పది చువ్వలు ఉంటాయి, ఇందులో కొన్ని వస్తువుల సమూహములను, 1–10 వర్గములుగా ప్రత్యేక అరలలో ఉంచాయి. సంఖ్యా చిహ్నములను నేర్చుకోవటానికి, 1–9 వరకు గరుకు కాగితంతో చేసిన సంఖ్యలు ఉంటాయి. కూడిక, తీసివేత, మరియు స్థాన విలువ అధ్యయనం చేయటానికి, పూసలు, ప్లాస్టిక్ లేదా కొయ్యతో వివధ ఆకృతులలో చేసిన వస్తువులు 1, 10, 100 మొదలైన సంఖ్యల దశాంశ రూపును సూచిస్తాయి. ఈ ప్రాథమిక గణిత వస్తువులతో పాటు, భిన్నం, క్షేత్ర గణిత సంబంధములు మరియు బీజగణితం యొక్క మూల సిద్దాంతములను చూపించటానికి ద్విపాద మరియు త్రిపాద సిద్దాంతముల వంటివి ఉన్నాయి.[43]

భాష[మార్చు]

వికాసపు మొదటి స్థాయిలో (0–6), మాంటిస్సోరి భాషా వస్తువులు రాత పరికరాన్ని ఉపయోగించుకోవటం మరియు రాసిన భాషను చదవగలిగే నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాయి. లిఖిత నైపుణ్య అభివృద్ధి కొరకు, లోహ ముక్కలు ఒక పెన్సిలు లేదా పెన్ను ఉపయోగిస్తున్నప్పుడు వివిధ ఆకారముల సరిహద్దు గీతలను దిద్దుతున్నప్పుడు ఆ పిల్లవాని చేతికి ఊతం ఇవ్వటానికి అవసరమైన వ్యాయామములను అందిస్తాయి. చదవటానికి, సాధారణముగా గరుకు కాగితపు అక్షరములుగా పిలవబడే, అక్షరముల సమూహము, ప్రతి అక్షరాన్నీ దానికి సంబంధించిన అక్షర శబ్దముతో కలపటానికి ఉపయోగపడుతుంది.[44] "సెగ్విన్ మూడు-పీరియడ్ ల పాఠము" (క్రింద చూడుము) గా ప్రసిద్ధమైన ఒక పాఠము, పలు అక్షరములను ప్రదర్శిస్తూ అక్షరముల ధ్వనులను నేర్చుకోవటంలో పిల్లలకు మార్గదర్శకత్వం చేస్తున్నాయి, చివరకు ఈ అక్షరములన్నీ కలిసి “up” మరియు “cat” వంటి కొన్ని సరళమైన శబ్ద పదములను తయారుచేస్తాయి. ఈ పరిభాషా పాఠముల యొక్క లక్ష్యం అక్షరములు శబ్దాన్ని కలుగజేస్తాయని, ఇవన్నీ కలిసి పదాలను ఇస్తాయని పిల్లలకు చూపటం. ఆరు సంవత్సరముల కన్నా పెద్ద వయస్సు పిల్లలకు, మాంటిస్సోరి భాషా వస్తువులు నామవాచకము, క్రియా పదములు, విశేషణములు, ఉపపదములు, విభక్తి ప్రత్యయములు, క్రియా విశేషణములు, సముచ్ఛయములు, సర్వనామములు మరియు ఆశ్చర్యార్ధకములు వంటి భాషా విభాగములతో సహా వ్యాకరణము నేర్చుకోవటానికి పిల్లలకు సహాయం చేయటానికి అభివృద్ధి చేయబడ్డాయి.[45]

సాంస్కృతిక పాఠ్యాంశములు[మార్చు]

మాంటిస్సోరి తరగతి గదిలో భూగోళశాస్త్రము (భౌగోళిక పటముల పజిల్స్, గోళములు, ప్రత్యేకముగా ఒక దేశానికి సంబంధించిన వస్తువులను కలిగి ఉన్న సాంస్కృతిక సూటుకేసులు) మరియు మొక్కలు మరియు జంతువుల పేర్లు పెట్టటంలో జీవశాస్త్రము వంటి సామాన్యశాస్త్రము వంటి సాంస్కృతిక పాఠ్యాంశములు నేర్చుకోవటానికి, ఇతర వస్తువులు మరియు వనరులు ఉంటాయి. సంగీతం మరియు కళలలో కూడా సాధారణంగా వివిధ మార్గములలో పిల్లలు పాలుపంచుకుంటారు. సుమారు ఆరు సంవత్సరముల తర్వాత, విస్తృతమైన ఆధునిక పాఠ్యాంశములను నేర్చుకోవటానికి అభ్యాస వనరులలో పుస్తక పఠనము మారియు వియుక్త వస్తువులు ఉన్నాయి.[46]

ప్రాథమిక (6–12) పాఠ్యప్రణాళిక[మార్చు]

వికాసం యొక్క రెండవ దశలో (6–12), ఈ పాఠ్యప్రణాళిక సాంప్రదాయబద్ధమైన పుస్తకములు మరియు లిఖిత కార్యక్రమముల రూపు సంతరించుకుంటుంది, ఎందుకనగా ఇప్పుడు పిల్లలు ఇంతకూ ముందు లాగా భౌతిక పర్యావరణమునకు అంతగా స్పందించకుండా వియుక్త వాదన ద్వారా ఈకువ పనిచేస్తున్నారు.[47] మరింత ఆధునికమైన ఈ పాఠ్యప్రణాళిక కొరకు సందర్భానుసారమైన రూపు విశ్వ విద్యగా వర్ణించబడింది. ఈ భావన 1935లో ఇంగ్లాండులో మొదట వివరించబడింది.[48] విశ్వ విద్య సంపూర్ణ విశ్వం యొక్క అన్యోన్య సంబంధము యొక్క పూర్తి కర్తవ్యము, ఇది ప్రాథమిక పాఠశాల పిల్లలు భిన్న అంశములకు సంబంధించిన రంగముల నుండి జ్ఞానమును సముపార్జించుకోవటానికి వీలు కల్పిస్తుంది.[49]

పాఠములు[మార్చు]

మాంటిస్సోరి విధానములో, పిల్లల వాస్తవ సాధారణ వికాసమునకు సహకరించటానికి పాఠము అనేది పిల్లలతో ఒక ప్రయోగాత్మక సంకర్షణ.[50] వస్తువులతో, పిల్లలకు వారి వ్యక్తిగత ఆసక్తులకు తగినట్లుగా వారికి ఉపయోగపడటం ఈ పాఠముల ప్రధాన లక్ష్యం. అందువలన ఈ పాఠములు ఉపాధ్యాయుల వ్యక్తిగత ప్రమేయాన్ని సాధ్యమైనంత తగ్గించేటట్లు, తద్వారా పిల్లలు వస్తువుల ద్వారా స్వయంగా తమంతట తాము నేర్చుకునేటప్పుడు కలుగజేసుకోకుండా ఉండే విధంగా ఉంటాయి.[51]

పలు వివరణల కొరకు, మొట్టమొదట సెగ్విన్ వివరించిన, ఒక మూడు-మెట్ల విధానము, వస్తువులకు మరియు పేర్లకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపించటానికి మాంటిస్సోరి విధానములో ఉపయోగించబడుతుంది. ఇది "మూడు-పీరియడ్ ల పాఠము" అని పిలవబడుతుంది.[52] ఈ పరిభాషా పాఠముతో, పిల్లలు ఉపయోగిస్తున్న వాటి నుండి రెండు లేదా మూడు వస్తువులు ఎంచుకోబడతాయి.

 • మొదటి పీరియడ్ లో పిల్లలకు ఆ వస్తువు పేరు చెప్పబడుతుంది. అక్షర ధ్వనుల విషయములో, ఆ ఉపాధ్యాయిని పిల్లల చేత ఆ అక్షరాన్ని దిద్దించి, ఈవిధంగా చెప్పించావలసి ఉంటుంది, "ఇది /u/. ఇది /p/." దీనితో పిల్లలు వారు నేర్చుకుంటున్న దాని పేరును తెలుసుకుంటారు.
 • రెండవ పీరియడ్ పిల్లలు వేర్వేరు వస్తువులను గుర్తించటానికి సహాయం చేస్తుంది. మూడు-పీరియడ్ ల పాఠములో ఎక్కువ సమయం రెండవ పీరియడ్ లోనే ఉంటుంది. ఉపాధ్యాయిని అడిగే కొన్ని విషయములు ఏవనగా, "నాకు /u/ ని చూపించు. నాకు /p/ ని చూపించు” లేదా "/u/ ఎక్కడుందో చెప్పు. /p/ ఎక్కడుందో చెప్పు.” రెండవ పీరియడ్ లో కొంత సమయం గడిపిన తరువాత, పిల్లవాడు మూడవ పీరియడ్ కు వెళ్ళవచ్చు.
 • మూడవ పీరియడ్ లో పిల్లవాడు కేవలం ఆ వస్తవు పేరును గుర్తించటమే కాకుండా, అది ఏమిటో కూడా చెప్పగలుగుతున్నాడా అని పరీక్షిస్తారు. ఉపాధ్యాయిని "u" ఆకారంలో ఉన్న గరుకు కాగితపు అక్షరాన్ని చూపించి విద్యార్థిని, "ఇది ఏమిటి?" అని ప్రశ్నిస్తారు. అ పిల్లవాడు అది, "uuuuuuuuuuuuuuuu", అని సమాధానం చెపితే ఆ పిల్లవాడు దానిని బాగా అర్ధం చేసుకున్నట్లు. అక్షరములను కూర్చి “అప్”, వంటి సులువైన పదములను తయారుచేయటం ద్వారా చివరకు ఆ పాఠము ముగుస్తుంది.[53]

గృహశిక్షణ[మార్చు]

మాంటిస్సోరి విధానము ఇంటి వద్ద ఉన్న పిల్లలతో సులువుగా పనిచేస్తుంది. చిన్న పిల్లలతో, భోజనాల బల్లను సిద్ధం చేయటం, ఆహారాన్ని తయారుచేయటం, ఉతికిన బట్టలు మడవటం వంటి రోజువారీ గృహ కృత్యముల ద్వారా క్రియాశీలక జీవన పదార్ధములు మరియు వ్యాయామములు అందజేయబడతాయి. ఈ పనులను ఎలా చేయాలో నెమ్మదిగా, సులువైన కదలికలలో చూపించటం ద్వారా, అదేవిధంగా పిల్లలు వారి సొంత పనులను వీలైనంత స్వతంత్రత మరియు స్వీయ-నిర్దేశంతో చేసుకోవటంలో వారికి రివాజులను ఏర్పరచటం ద్వారా తల్లిదండ్రులు ఈ విధానమును అనుసరిస్తారు.[54]

మాంటిస్సోరి పర్యావరణములో సంగీతం[మార్చు]

పిల్లలు వికాస సంవత్సరములలో సంగీత విద్య వారికి గొప్ప ప్రయోజనం చేకూరుస్తుందని మరియా మాంటిస్సోరి కనుగొన్నారు.[ఉల్లేఖన అవసరం] శాన్ డీగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయములో ఆచార్యులుగా పనిచేస్తున్న డయానా డ్యూష్ WNYC రేడియోకు ఇచ్చిన ఒక ముఖాముఖీలో ఆ విషయాన్ని బలపరుస్తూ ఈవిధంగా చెప్పారు,[55] పసిపిల్లల బుర్రలు వేరే రకముల ధ్వనుల కన్నా సంగీత ధ్వనులను ఎక్కువ ఇష్టపడుతూ, వాటికి బాగా స్పందిస్తాయి. ఒక పిల్లవాని యొక్క సంగీత గ్రహణ శక్తి ప్రత్యేకించి పూర్వప్రాథమిక పాఠశాలకు వెళ్ళే వయస్సు నుండి సుమారు ఆరు సంవత్సరముల వయస్సు వరకు బలంగా ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] అందువలనే తల్లిదండ్రులు వారి పసివారితో ఒక పెద్ద గొంతుకతో, "పాట పాడుతున్నట్లు" ఉన్న గొంతుకతో మాట్లాడతారు.[dubious ] సంగీత శిక్షణ పిల్లల వికాసమును గణనీయంగా మెరుగు పరుస్తుందని అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.[ఉల్లేఖన అవసరం] ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవారికి సంగీతంతో పరిచయం (శ్రవణము, అధ్యయనము మరియు సాధన) ప్రయోజనాన్ని అందిస్తుందని పలు అధ్యయనములు[which?] సూచిస్తున్నాయి. చురుకైన సంగీత శిక్షణ వారి సమస్యా-పూరణ నైపుణ్యములను, భౌతిక సంయమనం, సరితూనిక, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, వీక్షణ, శ్రవణ మరియు భాషా నైపుణ్యములు, స్వీయ క్రమశిక్షణ మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది.[ఉల్లేఖన అవసరం] ఇది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు అధ్యయన సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తుంది.[56] మాంటిస్సోరి పర్యావరణము కొన్ని గంటలు, స్వరాన్ని ఇచ్చే దిమ్మలు, కదిలే స్వర దిమ్మలతో ప్రయోగాత్మక అధ్యయనాన్ని అందిస్తాయి.

మాంటిస్సోరి గురించి విమర్శ[మార్చు]

మాంటిస్సోరి విధానంలో ఉన్న లోపం డాక్టరు మాంటిస్సోరితో ఉన్న దగ్గరి సంబంధం అని కొందరు విమర్శకులు వాదించారు. మరియా మాంటిస్సోరి: అ బయోగ్రఫీ లో, రీటా క్రామర్[57] 1913లో మాంటిస్సోరిని ఇంటర్వ్యూ చేసిన ఒక న్యూయార్క్ టైమ్స్ రచయిత ఈవిధంగా పేర్కొన్నట్లు నివేదించారు:

...ఆ విధానము మాంటిస్సోరి మరియు మాంటిస్సోరియే ఆ విధానము మరియు మరియా మాంటిస్సోరి యొక్క వ్యక్తిత్వం తొలగించబడినప్పుడు అది 'స్వీయ-విద్య' అనే నినాదంతో ఎలా పనిచేస్తుంది అనే అనుమానములు ఎవరికైనా రావచ్చు.” (p. 188)

ఆ విధానమునకు మరియు డాక్టరు మాంటిస్సోరికి మధ్య ఉన్న దగ్గరి సంబంధం ఆ విధానములోకి పరిశోధనను విస్తరించటానికి పలు సంఘర్షణలకు మరియు సహకారం లోపించటానికి దారి తీసింది.[58] ఉదాహరణకు, ఆ విధానమును ఒక శాస్త్రీయ పద్ధతిలో అన్వయించటానికి సరిక్రొత్త దృక్పథం మరియు గొప్ప జ్ఞానము ఉన్నప్పటికీ, వ్యక్తిత్వము మరియు సంస్కృతి యొక్క శాస్త్రీయ భేదములు సాధారణ ప్రజలకు దానిని అందించటంలో అడ్డుగా నిలిచి కంగారుపెడుతున్నాయి.[59]

ప్రయోజనాలు[మార్చు]

ఎంజెలిన్ స్టోల్ లిల్లర్డ్ యొక్క పుస్కారం గెలుచుకున్న 2005 పుస్తకం మాంటిస్సోరి: ది సైన్స్ బిహైండ్ ది జీనియస్ (ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్) వాటి మూల సిద్ధాంతములకు సంబంధించిన పరిశోధన దృష్ట్యా సాంప్రదాయ విద్యతో మాంటిస్సోరిని పోల్చుతూ ఇటీవలే ఒక సమీక్షను అందించింది. మాంటిస్సోరి యొక్క ప్రాథమిక విధానములు, మానసికశాస్త్ర పరిశోధన మానవ వికాసం గురించి వెల్లడించినదానికి బాగా సరిపోతాయి అని సూచిస్తూ లిల్లర్డ్ పరిశోధన గురించి ప్రస్తావించింది మరియు మరింత పరిశోధన అవసరమని వాదించింది.

"సైన్సు" పత్రికలో ప్రచురితమైన ఒక 2006 అధ్యయనము మాంటిస్సోరి విద్యార్థులు (5 మరియు 12 సంవత్సరముల వయస్సులో) మాంటిస్సోరి విద్యాలయమునకు హాజరవటానికి కంప్యూటర్ ద్వారా లాటరీ విధానంలో చేసిన ఎంపికలో ఓడిపోయి బదులుగా వివిధ రకముల సాంప్రదాయ విద్యాలయములలలో చేరిన విద్యార్థుల కన్నా మెరుగైన ప్రదర్శన కనపరిచారు. ఈ మెరుగైన ప్రదర్శన వివిధ రకాల రంగములలో సాధించారు, వాటిలో భాష మరియు గణితము వంటి సాంప్రదాయ విద్యాసంబంధ రంగములే కాక, సాంఘిక నైపుణ్యములు కూడా ఉన్నాయి (అయినప్పటికీ 12 సంవత్సరముల వయస్సు నాటికి విద్యాసంబంధ ప్రయోజనములు ఎక్కువగా కనుమరుగైపోతాయి).[60]

పలు పరిమాణములలో, ఒక ప్రభుత్వ నగర అంతర మాంటిస్సోరి విద్యాలయములోని పిల్లలు, మాంటిస్సోరికి దరఖాస్తు చేసుకుని కూడా యాదృచికంగా ఎంపిక చేసిన లాటరీ విధానం మూలంగా, ఇతర విద్యాలయములకు హాజరయ్యే విద్యార్ధుల కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు. కిండర్ గార్డెన్ ముగింపు నాటికి, మాంటిస్సోరి పిల్లలు చదవటం మరియు గణితం యొక్క ప్రామాణిక పరీక్షల్లో మెరుగైన ప్రదర్శా కనపరిచారు మరియు క్రీడా మైదానములో తోటివారితో చక్కగా కలిసిపోయారు, మరియు మెరుగైన ఆధునిక సాంఘిక సంజ్ఞాత్మకత మరియు నిర్వహణ నియంత్రణ కనపరిచారు. ఇంకా వారు నిజాయితీ మరియు న్యాయము కొరకు మరింత దృష్టి కనపరిచారు. ప్రాథమిక పాఠశాల ముగిసే సమయంలో, మాంటిస్సోరి పిల్లలు మరింత క్లిష్టమైన వాక్య నిర్మాణముతో కూడిన మరింత సృజనాత్మక వ్యాసములు వ్రాసారు, సాంఘిక సందిగ్ధావస్థలకు మరింత అనుకూల ప్రతిస్పందనను ఎంచుకున్నారు, మరియు వారి పాఠశాలలో ఒక సమాజ భావనను అనుభవించినట్లు పేర్కొన్నారు.

ఆ రచయితలు ఈవిధంగా ముగించారు, "ఖండితంగా అమలుచేయబడినప్పుడు, మాంటిస్సోరి విద్య వేరేరకమైన పాఠశాలలు నేర్పించే సాంఘిక మరియు విద్యాసంబంధ నైపుణ్యాలకు సమానముగా లేదా వాటి కన్నా ఉన్నతంగా ఉంటుంది." K. డోర్మాన్ మరియు అతని సహోద్యోగులు [61] చేసిన పరిశోధన, అంతకు మునుపు ప్రభుత్వ మాంటిస్సోరికి హాజరైన పిల్లలు (ఉన్నత పాఠశాల సహవిద్యార్థులతో పోల్చితే, వారిలో సగానికి పైగా మంచి పేరున్న నగర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఉన్నారు) ఉన్నత పాఠశాలలో అద్భుతమైన గణిత మరియు సామాన్యశాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉన్నారని చూపించటం ద్వారా దీనిని సమర్ధించారు ; రాతుండే మరియు క్సిక్సజెన్ట్మిహల్యి చేసిన రెండు అధ్యయనములు [62][63] పాఠశాల పనిని చేస్తూనే అత్యధిక ఆసక్తి మరియు ప్రేరణను ప్రదర్శిస్తూ ఇతర విద్యాలయముల విద్యార్థులకు భిన్నంగా మాంటిస్సోరి మధ్య-పాఠశాలకు వెళ్ళే వారి మధ్య మరింత అనుకూల సాంఘిక సంబంధములు చూపించాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మాంటిస్సోరి ఇంద్రియ జ్ఞాన సంబంధిత వస్తువులు
 • మరియా మాంటిస్సోరి
 • డోరతీ కాన్ఫీల్డ్ ఫిషర్
 • అధ్యయన లోపాలు కలిగిన పిల్లలను కూడా కలిగి ఉన్న తరగతిగది
 • వరమైన విద్య
 • ఎడౌఆర్డ్ సెగ్విన్
 • ఫ్రీడ్రిక్ ఫ్రోబెల్
 • మాంటిస్సోరి-ఆధారిత డిమెన్షియా ప్రోగ్రామింగ్
 • యునైటెడ్ స్టేట్స్ లో మాంటిస్సోరి
 • శిక్షణకు అనువైన సమయం

సూచనలు[మార్చు]

 1. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 174, Publ. ప్లూమ్, 1998, http://www.penguinputnam.com
 2. ది మాంటిస్సోరి మెథడ్ , మరియా మాంటిస్సోరి, pp. 79–81, Publ. రాండం హౌస్, 1988, http://www.randomhouse.com
 3. డిస్కవరీ ఆఫ్ ది చైల్డ్ , మరియా మాంటిస్సోరి, p.46, Publ. బల్లాంటైన్ బుక్స్, 1972, http://www.randomhouse.com
 4. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 169, Publ. ప్లూమ్, 1998, http://www.penguinputnam.com
 5. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 305, Publ. ప్లూమ్, 1998, http://www.penguinputnam.com
 6. డిస్కవరీ ఆఫ్ ది చైల్డ్ , మరియా మాంటిస్సోరి, pp. 323–324, Publ. బల్లాంటైన్ బుక్స్, 1972, http://www.randomhouse.com
 7. International Bureau of Education/Unesco: మాంటిస్సోరి and the New Education Movement Retrieved 27/8/2008
 8. మరియా మాంటిస్సోరి అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్
 9. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 115, Publ. ప్లూమ్, 1997
 10. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E. M. స్టాండింగ్, 1962, p. 29
 11. డిస్కవరీ ఆఫ్ ది చైల్డ్' , మరియా మాంటిస్సోరి, p. 24, బల్లాంటైన్ బుక్స్, 1972 http://www.randomhouse.com
 12. 12.0 12.1 మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E. M. స్టాండింగ్, 1962, p. 37
 13. మరియా మాంటిస్సోరి: అ బయోగ్రఫీ , రీటా క్రామర్, 1976, p.110
 14. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 62, Publ. ప్లూమ్, 1997
 15. మరియా మాంటిస్సోరి: a బయోగ్రఫీ, రీటా క్రామర్, p.154, Pub. పర్స్యూస్ బుక్స్, 1976
 16. http://www.ibe.unesco.org/en/services/documentation/collections.html
 17. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, రచయిత యొక్క ముందుమాట, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984
 18. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, pp. 116–118, Publ. ప్లూమ్, 1997
 19. ఎడ్యుకేషన్ అండ్ పీస్ , మరియా మాంటిస్సోరి, p. 76, Pub. 1949, పునర్ముద్రణ, మాంటిస్సోరి–పియర్సన్ పబ్లిషింగ్ కో., 1972
 20. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 64, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 21. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 117, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 22. అమెరికన్ మాంటిస్సోరి సొసైటీ, ఇంక్. v. అసోసియేషన్ మాంటిస్సోరి ఇంటర్ నేషనేల్ , 155 U.S.P.Q. 591, 592 (1967)
 23. మరియా మాంటిస్సోరి: a బయోగ్రఫీ, రీటా క్రామర్, p. 368, Pub. పర్స్యూస్ బుక్స్, 1976
 24. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి, ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 117, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 25. U.S. Department of Education, Final Staff Report to the National Advisory Committee on Institutional Quality and Integrity , June 9, 2008, Washington, DC; concerning the Petition for Continued Recognition Submitted by మాంటిస్సోరి Accreditation Council for Teacher Education, Commission on Accreditation, p. 7
 26. Ann Travers, "Review of ‘Creating the New Education’" Danbury audio cd and study guide. మాంటిస్సోరి International , p. 30, Issue 84, July – September 2007; Publ. By మాంటిస్సోరి St. Nicholas Charity, www.మాంటిస్సోరిmagazine.com
 27. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 169, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 28. డిస్కవరీ ఆఫ్ ది చైల్డ్, మరియా మాంటిస్సోరి, p.46, Pub. బల్లాంటైన్ బుక్స్, 1972 http://www.randomhouse.com
 29. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, Chapter VII, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 30. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, Chapter VI, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 31. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, Chapter XVI, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 32. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 85, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 33. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 62, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 34. Iమరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 352, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 35. Absorbent Mind , మరియా మాంటిస్సోరి, p. 80, Pub. ABC-Clio, org. 1949, పునర్ముద్రణ 1988
 36. Education for a New World , మరియా మాంటిస్సోరి, p. 50, Pub. org. 1946, పునర్ముద్రణ, మాంటిస్సోరి-Pierson Publishing Co., 2007
 37. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 334, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 38. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 83, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 39. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, Chapter XIII, 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 40. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, pp. 160–62 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 41. డిస్కవరీ ఆఫ్ ది చైల్డ్ , మరియా మాంటిస్సోరి, p. 99 బల్లాంటైన్ బుక్స్, Pub. org. 1949, పునర్ముద్రణ, 1972 http://www.randomhouse.com
 42. Dr. మాంటిస్సోరి's Own Handbook , మరియా మాంటిస్సోరి, pp. 65–123, Pub. org. 1914, పునర్ముద్రణ Schocken Books, 1988, http://www.randomhouse.com
 43. Dr. మాంటిస్సోరి's Own Handbook , మరియా మాంటిస్సోరి, pp. 164–182, Pub. org. 1914, పునర్ముద్రణ Schocken Books, 1988, http://www.randomhouse.com
 44. Dr. మాంటిస్సోరి's Own Handbook , మరియా మాంటిస్సోరి, pp. 140–158, Pub. org. 1914, పునర్ముద్రణ Schocken Books, 1988, http://www.randomhouse.com
 45. Advanced మాంటిస్సోరి Method – II , మరియా మాంటిస్సోరి, part I, Grammar, Pub. org. 1918, పునర్ముద్రణ ABC-Clio, 2006
 46. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, pp. 273–76 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 47. From Childhood to Adolescence , మరియా మాంటిస్సోరి, p. 10, first published, 1948, పునర్ముద్రణ 2004, Publ. మాంటిస్సోరి–Pierson Estates, ABC-Clio Ltd. England
 48. To Educate the Human Potential , మరియా మాంటిస్సోరి, p. 7, first published, 1948, పునర్ముద్రణ, 1996, Publ. ABC-Clio, Oxford, England
 49. To Educate the Human Potential , మరియా మాంటిస్సోరి, p. 6, first published, 1948, పునర్ముద్రణ, 1996, Publ. ABC-Clio, Oxford, England
 50. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 87, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 51. The మాంటిస్సోరి Method , మరియా మాంటిస్సోరి, p. 108, Pub. org. 1912, పునర్ముద్రణ, Schocken Books, 1988, http://www.randomhouse.com
 52. మరియా మాంటిస్సోరి: హర్ లైఫ్ అండ్ వర్క్ , E.M. స్టాండింగ్, p. 307 1957, Pub. ప్లూమ్, పునర్ముద్రణ, 1984 http://www.penguinputnam.com
 53. Disocvery of the Child, మరియా మాంటిస్సోరి, pp. 210–215, Pub. org. 1949, పునర్ముద్రణ, బల్లాంటైన్ బుక్స్, 1972 http://www.randomhouse.com
 54. Teaching మాంటిస్సోరి in the Home Elizabeth G. Hainstock, pp. 43–44, first edition, 1967; ప్లూమ్, 1997
 55. Deutsch, D. (11 ఏప్రిల్ 2010 Musical Language. (J. Abumrad, & K. Robert, Interviewers)
 56. "Music In the మాంటిస్సోరి Environment" by Ken Sawatzky from http://www.మాంటిస్సోరిCommunity.com[permanent dead link]
 57. మరియా మాంటిస్సోరి: a బయోగ్రఫీ , రీటా క్రామర్, p. 188, Pub. పర్స్యూస్ బుక్స్, 1976
 58. మరియా మాంటిస్సోరి: a బయోగ్రఫీ y, రీటా క్రామర్, p.262, Pub. పర్స్యూస్ బుక్స్, 1976
 59. ది ఎసెన్షియల్ మాంటిస్సోరి , ఎలిజబెత్ హెయిన్స్టాక్, p. 118, Pub. (revised) ప్లూమ్, 1997 http://www.penguin.com
 60. Lillard A, Else-Quest N (2006). "The early years. Evaluating Montessori education". Science. 313 (5795): 1893–4. doi:10.1126/science.1132362. PMID 17008512. Unknown parameter |month= ignored (help)
 61. Dohrmann K R, Nishida T, Gartner A, Lipsky D, Grimm K (2007). "High school outcomes for students in a public Montessori program". Journal of Research in Childhood Education. 22: 205–17. doi:10.1080/02568540709594622.CS1 maint: multiple names: authors list (link)
 62. Rathunde K, Csikszentmihalyi M (2005). "Middle School Students' Motivation and Quality of Experience: A Comparison of Montessori and Traditional School Environments". American Journal of Education. 111 (3): 341–71. doi:10.1086/428885. Unknown parameter |month= ignored (help)
 63. Rathunde K, Csikszentmihalyi M (2005). "The Social Context of Middle School: Teachers, Friends, and Activities in Montessori and Traditional School Environments". The Elementary School Journal. 106 (1): 59–79. doi:10.1086/496907. Unknown parameter |month= ignored (help)
 • బీనెకే, J. (1998). అండ్ దేర్ వర్ జెయింట్స్ ఇన్ ది ల్యాండ్: ది లైఫ్ ఆఫ్ విలియం హెర్డ్ కిల్పాట్రిక్. న్యూయార్క్: పీటర్ లాంగ్ పబ్లిషింగ్ ఇంక్.
 • కిల్పాట్రిక్, W. H. (1914). ది మాంటిస్సోరి సిస్టం ఎగ్జామిండ్. బోస్టన్: హాటన్ మిఫ్ఫ్లిన్ కంపెనీ
 • రాండ్, Ayn. (1982). ఫిలాసఫీ: హూ నీడ్స్ ఇట్.

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]