మాకిర్వట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాకిర్వట్
పట్టణం
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లానైరుతీ ఖాసీ హిల్స్
Population
 (2011)
 • Total1,666
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
793114
టెలిఫోన్ కోడ్91 0364
Vehicle registrationఎంఎల్ - 09

మాకిర్వట్, మేఘాలయ రాష్ట్రంలోని నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా[మార్చు]

మాకిర్వట్ పట్టణంలో మొత్తం 261 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 1,666 జనాభా ఉంది. వీరిలో 804 మంది పురుషులు, 862 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 254 (15.25%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 94.62% కాగా, రాష్ట్ర సగటు అక్షరాస్యత 74.43% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 94.81% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.44% గా ఉంది.[1]

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

మాకిర్వట్ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.[2]

  1. జాక్రెం హాట్ స్ప్రింగ్: మాకిర్వట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  2. సింపర్ కొండ: షిల్లాంగ్-మాకిర్వట్ రహదారికి పశ్చిమాన షిల్లాంగ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  3. ఉమ్ంగి నది: మాకిర్వట్ నుండి 18 కి.మీ. దూరంలో నది.
  4. రిలాంగ్ వ్యూ పాయింట్: మాకిర్వట్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  5. టిన్రోంగ్ సిన్రాంగ్ మురిన్: మాకిర్వట్ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  6. బాంబెల్ కొండ: మాకిర్వట్ నుండి 3 కి.మీ.ల దూరంలో ఉంది.
  7. సిన్రాంగ్బా గుహ: మాకిర్వట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  8. డాంగ్నోబ్ జలపాతం: మాకిర్వట్ నుండి 8 కి.మీ.ల దూరంలో ఉంది.
  9. సిన్రాంగ్ స్ంగి కొండ: మాకిర్వట్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  10. టైన్‌రోంగ్ మన్‌బాసా: మాకిర్వట్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర రాయి.
  11. టిన్నై వ్యూ పాయింట్: మాకిర్వట్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  12. కైలాయ్ లింగ్స్‌గున్ కొండ: మాకిర్వట్ నుండి 35 కిలోమీటర్లు తాటి చెట్లు, ఆకులతో నిండిన కొండ.

మూలాలు[మార్చు]

  1. "Mawkyrwat Village Population - Mawkyrwat - West Khasi Hills, Meghalaya". www.census2011.co.in. Retrieved 2021-01-02.
  2. "Places of Interest | South West Khasi Hills District | India". www.southwestkhasihills.gov.in. Retrieved 2021-01-02.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు[మార్చు]