మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం
దర్శకత్వంఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి
రచనఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి
నిర్మాతసుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంప్రసాద్‌ మూరెళ్ల
సంగీతంమహతి స్వరసాగర్‌
నిర్మాణ
సంస్థ
శ్రేష్ట్ మూవీస్
విడుదల తేదీ
2022 ఆగస్టు 12 (2022-08-12)(థియేటర్)
2022 డిసెంబరు 9 (2022-12-09)(జీ5 ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు
#WPWPTE

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం తెలుగులో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. నితిన్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన ఈ సినిమా 2022 ఆగష్టు 12న విడుదలై [1],[2] డిసెంబర్ 9న జీ5 ఓటీటీలో విడుదల కానుంది.[3]

కథ[మార్చు]

రాజప్ప(సముద్రఖని) తండ్రి చనిపోగానే అతనికి సీటు ఇవ్వడానికి అధిష్టానం వెనకడుగు వేస్తే అధిష్టానం సీట్ ఇచ్చి పోటీ చేయించిన వ్యక్తిని చంపి రాజప్ప మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత 30 ఏళ్లుగా ఎన్నికలు జరగనివ్వకుండా మాచర్ల ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంతాడు. ఈ సమయంలో సివిల్స్ రాసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ రెడ్డి (నితిన్) ప్రేమించిన అమ్మాయి స్వాతి (కృతి శెట్టి) కోసం మాచర్ల వెళతాడు. మాచర్లలో నిధి(కేథరిన్) చేసిన పనికి అదే జిల్లాకు కలెక్టర్ అవుతాడు. జిల్లా కలెక్టరుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత 30 ఏళ్ల నుంచి ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం అవుతుందనే విషయం తెలుసుకుని ఎన్నికలు జరిపేందుకు నిలబడతాడు. మాచర్లలో ఎన్నికలు నిర్వహించాలని అతను చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిణామాలను ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • అదిరిందే , సంజీత్ హెగ్డే , రచన: కృష్ణకాంత్
  • పోరీ సూపరో , రాహుల్ సింప్లీ గంజ్, గీతా మాధురి, రచన: కృష్ణ కాంత్
  • చిల్ మారో , నాకెష్ అజీజ్ , సంజన కొలమంజి , రచన: కృష్ణ చైతన్య.
  • రా రా రెడ్డి ఐయాం రెడీ , లిప్సికా , రచన: కాసర్ల శ్యామ్ , కులశేఖర్.

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: శ్రేష్ట్ మూవీస్
  • సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
  • నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి
  • సంగీతం: మహతి స్వరసాగర్‌
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల
  • ఆర్ట్‌: సాహి సురేష్‌
  • మాటలు: మామిడాల తిరుపతి
  • ఫైట్స్: అనల్ అరసు
  • కొరియోగ్రఫీ: జానీ మాస్టర్[9]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (12 November 2021). "మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రిలీజ్ డేట్ ఫిక్స్‌". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  2. V6 Velugu (12 August 2022). "నితిన్ ఖాతాలో మరో హిట్ పడిందా". Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (26 November 2022). "ఓటీటీలోకి 'మాచర్ల నియోజకవర్గం'.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  4. Eenadu (12 August 2022). "రివ్యూ: మాచర్ల నియోజకవర్గం". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  5. Eenadu (16 March 2022). "'మాచర్ల నియోజకవర్గం'.. బంపర్‌ మెజారిటీతో రానున్న నితిన్‌". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  6. TV9 Telugu (16 November 2021). "నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Sakshi (7 March 2022). "నితిన్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  8. PINKVILLA (15 July 2022). "'మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం'లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  9. Andhra Jyothy (13 March 2022). "'మాచర్ల: నియోజకవర్గం': లేటెస్ట్ అప్‌డేట్." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.