మాణిక్యపురం (లింగాల ఘన్‌‌పూర్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాణిక్యపురం, వరంగల్ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ మండలానికి చెందిన గ్రామం. మాణిక్యపురం గ్రామం లింగాలఘనపురం మండలానికి చెందినది. గ్రామ జనాభా సుమారుగా 1500 పై చిలుకు. ఇక్కడ ప్రజలు ప్రధానంగా వ్యవసాయం చేస్తారు మరియు కూలి పని కోసం జనగాం పట్టణానికి వెళ్తారు. జనగామ నుంచి 8 కి. మీ. దూరంలో ఉంటుంది. జాతీయ రహదారి 202 (పెంబర్తి గ్రామం) కి 3 కి. మీ.దూరంలో ఉంటుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాల (7వ తరగతి వరకు) ఉంది.

విశేషాలు[మార్చు]

ఈ గ్రామం ఒగ్గు కథకు ప్రఖ్యాతి గాంచింది. విశ్వవిఖ్యాత ఒగ్గు కళా సామ్రాట్ చుక్క సత్తయ్య గారు ఈ గ్రామానికి చెందినవారే. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలకు పైగా ఒగ్గు కళను ప్రదర్శితాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]