మాణిక్య రాజవంశం
| మాణిక్య | |
|---|---|
| Parent house | చంద్ర వంశం (పురాణాల ప్రకారం) |
| Country | |
| Founded | c. 1400 |
| Founder | మహా మాణిక్య |
| Current head | కిరీట్ ప్రద్యోత్ మాణిక్య (నామమాత్రంగా) |
| Final ruler | కిరీట్ బిక్రమ్ కిషోర్ మాణిక్య |
| Titles | |
| Deposition | 1949 |

మాణిక్య రాజవంశం ట్విప్రా రాజ్యాన్ని, తరువాత ఏర్పడిన త్రిపుర రాజ్యాన్ని పాలించిన పాలక సంస్థ. ఇప్పుడు ఈ భూభాగం భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంగా ఉంది. 15వ శతాబ్దం ప్రారంభం నుంచి పాలన సాగించిన ఈ రాజవంశం, తన ఉచ్ఛదశలో భారత ఉపఖండంలోని ఈశాన్య ప్రాంతంలో ఒక పెద్ద భాగాన్ని నియంత్రించింది. బ్రిటీష్ వారి ప్రభావంలోకి వచ్చిన తరువాత, వారు 1809లో భూస్వామ్య చక్రవర్తుల స్థాయి నుంచి ఒక రాచరిక రాష్ట్ర పాలకుల స్థాయికి మారారు. అయినప్పటికీ 1949లో త్రిపుర భారతదేశంలో విలీనమయ్యేంత వరకు మాణిక్యాలు ఈ ప్రాంతంపై నియంత్రణను కొనసాగించారు.
చరిత్ర
[మార్చు]త్రిపుర రాజుల వృత్తాంతమైన రాజమాలలో పురాణ పురుషుడు, చంద్ర వంశ చక్రవర్తి అయిన యయాతి కుమారుడు దృహ్యుడి నుంచి మాణిక్యుల సంతతి ఉద్భవించినట్లుగా గుర్తించబడింది.[1][2] ఆ తరువాత రత్న ఫా అనే ఒక వ్యక్తి సింహాసనాన్ని అధిష్టించే వరకు 144 మంది (బహుశా పౌరాణిక కావచ్చు) త్రిపుర చక్రవర్తుల నిరంతర వంశావళి జాబితా చేయబడింది. రత్న ఫా బెంగాల్ సుల్తాన్ నుంచి కాగ్నోమెన్‌ను పొందిన తరువాత మొదటి మాణిక్యగా మారాడని పేర్కొనబడింది.[3] అయితే, తొలి మాణిక్య పాలకుల వంశావళి, కాలక్రమంలో రాజమాల పొరపాటు పడిందని ఇప్పుడు భావిస్తున్నారు.[4] నాణేల (Numismatic) ఆధారాల ప్రకారం మొదటి చారిత్రక మాణిక్య వాస్తవానికి మహా మాణిక్య.[5] ఇతను ఒక త్రిపురి నాయకుడు. ఇతను 1400ల ప్రారంభంలో పొరుగున ఉన్న తెగలపై ఆధిపత్యాన్ని స్థాపించిన తరువాత రాజ్యాన్ని స్థాపించాడు.[6] ఆ తరువాత ఈ చక్రవర్తి బెంగాల్‌పై సాధించిన చారిత్రాత్మక విజయానికి గౌరవంగా "మాణిక్య" అనే బిరుదును తీసుకున్నాడు, ఈ పేరును అతని వారసులు వారసత్వంగా పొందారు.[7]
మహా మాణిక్య ప్రారంభ వారసులు బెంగాల్, అస్సాం (అహోం రాజ్యం), బర్మాలో భూభాగాన్ని జయించి గణనీయమైన సైనిక విజయాన్ని సాధించారు. త్రిపుర 16వ శతాబ్దంలో ధన్య మాణిక్య, రెండవ విజయ మాణిక్య వంటి ప్రముఖ రాజుల పాలనలో తన ఉచ్ఛస్థాయికి చేరుకుంది.[8] దీని భూభాగాలు ఉత్తరాన గారో కొండల నుంచి దక్షిణాన బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. హిందూ రాజ్య చక్రవర్తులుగా, మాణిక్యులు వరుసగా వచ్చిన బెంగాల్ ముస్లిం పాలకులతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. 17వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ సామ్రాజ్యం ఆధిపత్యం కిందకు తీసుకురాబడటానికి ముందు సుల్తానులు, గవర్నర్లు, నవాబులతో ఘర్షణ పడ్డారు. మొఘల్ అధికారం క్షీణించడంతో, బెంగాల్‌తో శత్రుత్వం మళ్లీ తలెత్తింది, ఇది మాణిక్యులను మొదట సహాయం కోసం బ్రిటీష్ వారిని ఆశ్రయించేలా చేసింది. 1761లో, త్రిపుర బ్రిటీష్ ప్రభావానికి లోబడి, ఒక రాచరిక సంరక్షిత ప్రాంతంగా మారింది, అయితే ఈ ప్రాంతంపై నియంత్రణ మాణిక్య రాజవంశం కిందే కొనసాగింది.[9]
1870లో బీర్ చంద్ర మాణిక్య సింహాసనాన్ని అధిష్టించాడు, బ్రిటీష్ వ్యవస్థ తరహాలో తన ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతూ తన రాజ్యానికి అనేక రాజకీయ సంస్కరణలను ప్రారంభించాడు. బెంగాలీ సంస్కృతిని అమితంగా ఇష్టపడే ఆయన పాలనలో బెంగాలీ భాషను న్యాయస్థానంలో ఆమోదించారు. అలాగే ఆయన కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌తో స్నేహాన్ని పెంచుకున్నాడు. 20వ శతాబ్దం ప్రారంభంలో త్రిపురను తూర్పు బెంగాల్, అస్సాం ప్రావిన్స్‌లో కొద్దికాలం పాటు చేర్చిన తరువాత, చివరి మాణిక్య చక్రవర్తి అయిన మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ 1947లో ప్రధానంగా హిందువులు ఉన్న డొమినియన్ ఆఫ్ ఇండియా అధికార పరిధిలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. త్రిపురను ఆధునిక భారతదేశంలో అంతిమంగా విలీనం చేసే ఒప్పందంపై ఆయన విధవరాలైన కంచన్ ప్రభా దేవి, మైనర్ అయిన కిరీట్ బిక్రమ్ కిషోర్ తరపున సంతకం చేశారు. దీనితో ఐదు శతాబ్దాల మాణిక్య పాలనకు ముగింపు పలికారు.[9]
పాలకుల జాబితా
[మార్చు]

| మాణిక్య రాజవంశ పాలికులు (సుమారు 1400 – 1949)[10] | |||||||||
| పేరు | పాలన ప్రారంభం | పాలన ముగింపు | హక్కు | గమనికలు | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| మహా మాణిక్య | సుమారు 1400 | 1431 | |||||||
| మొదటి ధర్మ మాణిక్య | 1431 | 1462 | మహా మాణిక్య కుమారుడు | ||||||
| మొదటి రత్న మాణిక్య | 1462 | సుమారు 1487 | మొదటి ధర్మ మాణిక్య కుమారుడు | ||||||
| ప్రతాప్ మాణిక్య | సుమారు 1487 | సుమారు 1487 | మొదటి రత్న మాణిక్య కుమారుడు | ||||||
| మొదటి విజయ మాణిక్య | 1488 | 1488 | బహుశా ప్రతాప్ మాణిక్య కుమారుడు | ||||||
| ముకుత్ మాణిక్య | 1489 | 1489 | మొదటి రత్న మాణిక్య కుమారుడు | ||||||
| ధన్య మాణిక్య | 1490 | 1515 | మొదటి రత్న మాణిక్య కుమారుడు | ||||||
| ధ్వజ మాణిక్య | 1515 | 1520 | ధన్య మాణిక్య కుమారుడు | ||||||
| దేవ మాణిక్య | 1520 | 1530 | ధన్య మాణిక్య కుమారుడు | ||||||
| మొదటి ఇంద్ర మాణిక్య | 1530 | 1532 | దేవ మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ విజయ మాణిక్య | 1532 | 1563 | దేవ మాణిక్య కుమారుడు | ||||||
| అనంత మాణిక్య | 1563 | 1567 | రెండవ విజయ మాణిక్య కుమారుడు | ||||||
| మొదటి ఉదయ్ మాణిక్య | 1567 | 1573 | అనంత మాణిక్య మామగారు | తన పూర్వీకుడి మరణం తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు, అప్పటి వరకు పాలిస్తున్న రాజవంశాన్ని తన సొంత వంశంతో స్వల్పకాలం పాటు భర్తీ చేశాడు.[11] | |||||
| మొదటి జాయ్ మాణిక్య | 1573 | 1577 | మొదటి ఉదయ్ మాణిక్య కుమారుడు | ||||||
| అమర్ మాణిక్య | 1577 | 1586 | దేవ మాణిక్య కుమారుడు | తన ముందున్న రాజును చంపిన తర్వాత మాణిక్య రాజవంశాన్ని పునరుద్ధరించాడు.[12] | |||||
| మొదటి రాజధర్ మాణిక్య | 1586 | 1600 | అమర్ మాణిక్య కుమారుడు | ||||||
| ఈశ్వర్ మాణిక్య | 1600 | 1600 | బహుశా అమర్ మాణిక్య లేదా మొదటి రాజధర్ మాణిక్య కుమారుడు | ||||||
| యశోధర్ మాణిక్య | 1600 | 1618 | మొదటి రాజధర్ మాణిక్య కుమారుడు | రాజరికం తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యంచే పడగొట్టబడింది.[13] | |||||
| కళ్యాణ్ మాణిక్య | 1626 | 1660 | మహా మాణిక్య వారసుడు | రాజవంశంలోని ఒక అనుబంధ శాఖ (క్యాడెట్ బ్రాంచ్) నుంచి వచ్చినవాడు.[14] మొఘలుల మధ్యంతర కాలం తర్వాత రాజుగా ఎన్నుకోబడ్డాడు.[15] | |||||
| గోవింద మాణిక్య | 1660 | 1661 | కళ్యాణ్ మాణిక్య కుమారుడు | మొదటి పాలన | |||||
| ఛత్ర మాణిక్య | 1661 | 1667 | కళ్యాణ్ మాణిక్య కుమారుడు | ||||||
| గోవింద మాణిక్య | 1667 | 1676 | కళ్యాణ్ మాణిక్య కుమారుడు | రెండవ పాలన | |||||
| రామ మాణిక్య | 1676 | 1685 | గోవింద మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ రత్న మాణిక్య | 1685[16] | 1693[16] | రామ మాణిక్య కుమారుడు | మొదటి పాలన | |||||
| నరేంద్ర మాణిక్య | 1693[16] | 1695[16] | గోవింద మాణిక్య మనవడు | ||||||
| రెండవ రత్న మాణిక్య | 1695[16] | 1712[16] | రామ మాణిక్య కుమారుడు | రెండవ పాలన | |||||
| మహేంద్ర మాణిక్య | 1712[17] | 1714[17] | రామ మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ ధర్మ మాణిక్య | 1714[17] | 1725[17] | రామ మాణిక్య కుమారుడు | మొదటి పాలన | |||||
| జగత్ మాణిక్య | 1725[18] | 1729[18] | ఛత్ర మాణిక్య మునిమనవడు | ||||||
| రెండవ ధర్మ మాణిక్య | 1729[18] | 1729[18] | రామ మాణిక్య కుమారుడు | రెండవ పాలన | |||||
| ముకుంద మాణిక్య | 1729 | 1739 | రామ మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ జాయ్ మాణిక్య | 1739 | 1744 | కళ్యాణ్ మాణిక్య మునిమనవడు | మొదటి పాలన | |||||
| రెండవ ఇంద్ర మాణిక్య | 1744 | 1746 | ముకుంద మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ ఉదయ్ మాణిక్య | సుమారు 1744 | సుమారు 1744 | రెండవ ధర్మ మాణిక్య కుమారుడు | తన బంధువుల మధ్య జరిగిన అధికార పోరాటం సమయంలో సింహాసనాన్ని కొంతకాలం పాటు ఆక్రమించాడు.[19] | |||||
| రెండవ జాయ్ మాణిక్య | 1746 | 1746 | కళ్యాణ్ మాణిక్య మునిమనవడు | రెండవ పాలన | |||||
| మూడవ విజయ మాణిక్య | 1746 | 1748 | రెండవ జాయ్ మాణిక్య సోదరుడు, కళ్యాణ్ మాణిక్య మునిమనవడు | ||||||
| లక్ష్మణ్ మాణిక్య | ? | ? | రెండవ ధర్మ మాణిక్య మనవడు | షంషేర్ గాజీ సింహాసనాన్ని తన కోసం తీసుకునే ముందు మూడు సంవత్సరాల పాటు అతని కింద కీలుబొమ్మ రాజుగా పాలించాడు.[20] | |||||
| కృష్ణ మాణిక్య | 1760 | 1783 | ముకుంద మాణిక్య కుమారుడు | ||||||
| రెండవ రాజధర్ మాణిక్య | 1785 | 1806 | ముకుంద మాణిక్య మనవడు | ||||||
| రామ గంగా మాణిక్య | 1806 | 1809 | రెండవ రాజధర్ మాణిక్య కుమారుడు | మొదటి పాలన | |||||
| దుర్గా మాణిక్య | 1809 | 1813 | లక్ష్మణ్ మాణిక్య కుమారుడు | ||||||
| రామ గంగా మాణిక్య | 1813 | 1826 | రెండవ రాజధర్ మాణిక్య కుమారుడు | రెండవ పాలన | |||||
| కాశీ చంద్ర మాణిక్య | 1826 | 1829 | రెండవ రాజధర్ మాణిక్య కుమారుడు | ||||||
| కృష్ణ కిషోర్ మాణిక్య | 1829 | 1849 | రామ గంగా మాణిక్య కుమారుడు | ||||||
| ఇషాన్ చంద్ర మాణిక్య | 1849 | 1862 | కృష్ణ కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
| బీర్ చంద్ర మాణిక్య | 1862 | 1896 | కృష్ణ కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
| రాధా కిషోర్ మాణిక్య | 1896 | 1909 | బీర్ చంద్ర మాణిక్య కుమారుడు | ||||||
| బీరేంద్ర కిషోర్ మాణిక్య | 1909 | 1923 | రాధా కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
| బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య | 1923 | 1947 | బీరేంద్ర కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
| కిరీట్ బిక్రమ్ కిషోర్ మాణిక్య | 1947 | 1949 | బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
| నామమాత్రపు రాజులు (1949 – 1971) | |||||||||
| కిరీట్ బిక్రమ్ కిషోర్ మాణిక్య | 1949 | 1971 (బిరుదు రద్దు చేయబడింది) | బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య కుమారుడు | ||||||
వంశవృక్షం
[మార్చు]| వంశవృక్షం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలాలు
[మార్చు]- ↑ Chaudhuri (1999), p. 68.
- ↑ Singh Rana (1998), p. 210.
- ↑ Bhattacharyya (1977), p. 13.
- ↑ Saha (1986), p. 168.
- ↑ Sarma (1987), p. 39.
- ↑ Momin, Mawlong & Qadri (2006), p. 81.
- ↑ Lahiri (1999), p. 53.
- ↑ Nayar (2005), p. 70.
- 1 2 Boland-Crewe & Lea (2005), p. 238.
- ↑ Sarma (1987), pp. 233–34.
- ↑ Sarma (1987), pp. 75–76.
- ↑ Sarma (1987), p. 77.
- ↑ Chib (1988), p. 11.
- ↑ Gan-Chaudhuri (1980), p. 25.
- ↑ Sarma (1987), p. 96.
- 1 2 3 4 5 6 Friedberg & Friedberg (2009), p. 498.
- 1 2 3 4 DebBarma (2006), p. 24.
- 1 2 3 4 DebBarma (2006), p. 25.
- ↑ Sarma (1987), p. 130.
- ↑ Sur (1986), p. 14.
గ్రంథ పట్టిక
[మార్చు]- Bhattacharyya, A. K. (1977). District Census Handbook: North Tripura. Director of Census Operations.
- Boland-Crewe, Tara; Lea, David (2005) [2002]. The Territories and States of India. London: Routledge. ISBN 978-1-135-35625-5.
- Chib, Sukhdev Singh (1988). This beautiful India: Tripura. Ess Ess Publications. ISBN 978-81-7000-039-6.
- Chaudhuri, Dipak Kumar (1999). The Political Agents and the Native Raj: Conflict, Conciliation, and Progress, Tripura Between 1871 to 1890. New Delhi: Mittal Publications. ISBN 978-81-7099-666-8.
- DebBarma, Chandramani (2006). Glory of Tripura civilization: history of Tripura with Kok Borok names of the kings. Parul Prakashani.
- Friedberg, Arthur L.; Friedberg, Ira S. (2009). Gold Coins of the World: From Ancient Times to the Present : an Illustrated Standard Catalogue with Valuations (8 ed.). New Jersey: Coin & Currency Institute. ISBN 978-0-87184-308-1.
- Gan-Chaudhuri, Jagadis (1980). Tripura, the land and its people. Leeladevi Publications. ISBN 9788121004480.
- Lahiri, Bela (1999). "Numismatic Evidence on the Chronolgy and Succession of the rulers of Tripura". The Journal of the Numismatic Society of India. Numismatic Society of India.
- Momin, Mignonette; Mawlong, Cecile A.; Qadri, Fuz̤ail Aḥmad (2006). Society and economy in North-East India. New Delhi: Regency Publications. ISBN 978-81-87498-83-4.
- Nayar, V. K. (2005). Crossing the Frontiers of Conflict in the North East and Jammu and Kashmir: From Real Politik to Ideal Politik. New Delhi: Shipra Publications. ISBN 978-81-7541-218-7.
- Saha, Sudhanshu Bikash (1986). Tribes of Tripura: A Historical Survey. Rupali Book House.
- Singh Rana, J. P. (1998). Marriage and Customs of Tribes of India. New Delhi: M.D. Publications Pvt. Ltd. ISBN 978-81-7533-087-0.
- Sur, Hirendra Kumar (1986). British Relations with the State of Tripura, 1760–1947. Saraswati Book Depot.