మాణిక్ సర్కార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాణిక్ సర్కార్
మాణిక్ సర్కార్


9వ త్రిపుర ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 March 1998
గవర్నరు దేవానంద్ కొన్వర్
ముందు దశరద్ దేబ్
తరువాత ప్రస్తుత
నియోజకవర్గం ధనపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-01-22) 1949 జనవరి 22 (వయసు 75)
రాధకిశోరేపూర్, త్రిపుర
రాజకీయ పార్టీ సి.పి.ఎం
జీవిత భాగస్వామి పంచాలి బట్టాచార్య
నివాసం అగర్తలా, త్రిపుర
మతం నాస్తికులు
మూలం http://tripura.nic.in/portal/cm/CMBiodata.aspx Govt. of Tripura

మాణిక్ సర్కార్ (జననం 1949 జనవరి 22) భారత రాజకీయ నాయకుడు, 1998 సంవత్సరం నుంచి త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మార్చి 2008 లో, అతను వామపక్ష, త్రిపుర సంకీర్ణ ప్రభుత్వానికి నాయకుడిగా ప్రమాణస్వీకారం చేశారు.[1] 2013 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అతను వరుసగా నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. మాణిక్ సర్కార్ తన CM జీతం, అలవెన్సులను తన పార్టీకి విరాళంగా ఇస్తారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభృతిగా 5,000 (US$63) లను పొందుతున్నారు. [2] 2013 లో త్రిపుర శాసనసభ ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత తక్కువ ఆస్తి కలిగినవ్యక్తి. ఆయన సీపీఎం తరపున దేశంలో అత్యధిక కలం పని చేసిన ముఖ్యమంత్రిగా రెండోస్థానంలో నిలిచాడు. [3] [4]

ప్రారంభ జీవితం

[మార్చు]

మాణిక్ సర్కార్, జనవరి 22, 1949న రాధకిశోరేపూర్ (ఉదయపూర్, త్రిపుర) లో సమీపంలోఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. [5] తండ్రి అమూల్య సర్కార్ ఒక దర్జీ, తల్లి అంజలి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగి.[6] సర్కార్ తన విద్యార్థి రోజుల నుండి విద్యార్థి ఉద్యమాలు చురుకుగా పాల్గొన్నారు. 19 సంవత్సరాల వయస్సులో, 1968 లో, అతను భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) లో సభ్యత్వం తీసుకున్నారు. అతను MBB కాలేజ్ లో B.Com చదివారు, MBB కళాశాలలో చదువుకునే రోజులలో Students' Federation of India లో సభ్యులుగా ఉన్నారు.[7] 1967లో త్రిపుర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారా 1968 లో సి.పి.ఎం సభ్యత్వం తీసుకున్నారు.[8] MBB కాలేజీలో చదువుకునే సమయంలో Students' Federation of India కి ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 23 ఏళ్ల వయసులో 1972 లో సి.పి.ఎం రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నిక అయ్యారు.[7]

రాజకీయ జీవితం

[మార్చు]

సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీలో ఎంపికైనా ఆరు సంవత్సరాల తర్వాత, సర్కార్ 1978 లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ గా పనిచేశారు. ఇదే సంవస్తరం త్రిపురలో మొదటి వామపక్ష ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది . 1980 లో, 31 సంవత్సరాల వయస్సులో, అతను అగర్తల నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మాణిక్ సర్కార్ నాయకత్వం యొక్క రాజకీయ జీవితం ఆరంభం అయ్యింది.[9]అదే సమయంలో, అతను సిపిఐ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. తిరిగి 1983 లో కృష్ణ నగర్, అగర్తల నుండి శాసనసభ సభ్యుడిగా శాసనసభకి ఎన్నికయ్యారు.[5]వామపక్ష ప్రభుత్వం 1993 లో తిరిగి అధికారం చేజిక్కించుకున్నారు, సర్కార్ స్టేట్ కార్యదర్శి సి.పి.ఎం నియమించబడ్డారు. 49 సంవత్సరాల వయసులో 1998 లో మాణిక్ సర్కార్, కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యునిగా నియమించబడ్డారు.[9][10] అదే సంవస్తరం 1998 లో త్రిపుర ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. 1998 నుంచి వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం ఇండియాలో అత్యదిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.[9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మాణిక్ సర్కార్ పంచాలి భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు,[11] పంచాలి భట్టాచార్య 2011 లో కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి నుండి రిటైర్ అయ్యారు. సర్కార్, అతని భార్యది చాలా సాధారణ జీవితం. తన పేరు మీద ఏ ఇల్లు కాని కారు కాని లేని ఏకైక ముఖ్యమంత్రి. తన భార్య ఎలాంటి భద్రతా లేకుండా రిక్షాలో ప్రయాణిస్తారు.[12] 2017 తన ఎన్నికల నామినేషన్ తోపాటు ఆస్తుల వివరాల ప్రకారం . ఆయన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.2,410  చేతిలో రూ.1520 ఉన్నట్లు ప్రస్తావించారు.

మాణిక్ సర్కార్ భార్య పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. ఆమె బ్యాంక్ ఖాతాలో ప్రస్తుతం రూ.20,140 నగదు ఉంది. కనీసం ఆయనకు సెల్ ఫోన్‌ లేదు. మాణిక్ సర్కార్ తన పూర్తి CM జీతం, అలవెన్సులను తన పార్టీకి విరాళంగా ఇస్తారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభృతి పొందుతున్నారు. సర్కార్ "నిజాయితి, నిరుపేద ముఖ్యమంత్రి"గా ప్రసిద్ధి. సర్కార్ నిజాయితీని రాజకీయ ప్రత్యర్థులు కూడా గౌరవిస్తారు. [13] 2009 లో అతని తల్లి అంజలి సర్కార్ మరణానంతరం సర్కార్ కు అగర్తలలో ఒక చిన్న ఇల్లు వారసత్వంగా సంభవించింది. అదికూడా సర్కార్ తన బంధువుకు దానంచేసారు.ఇప్పటికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన దేశంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరిలోకి అత్యంత పేదవారిగా మిగిలారు. మాణిక్‌ సర్కార్‌ భార్య పాంచాలి భట్టాచార్జి పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. మాణిక్‌ సర్కార్‌ ఆమెతో కలిసి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.[14] [15]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "6th Left Front Govt Assumes Office". Archived from the original on 2011-09-28. Retrieved 2014-01-05.
 2. "?Manik Sarkar, the frugal CM". The Hindu. 25 January 2013. Archived from the original on 2013-01-28. Retrieved 2013-01-25.
 3. "Manik Sarkar 'cleanest and poorest' CM". Deccan Herald. 26 January 2013. Retrieved 27 January 2013.
 4. "Manik Sarkar: Poorest CM in the country". Times of India. 26 January 2013. Archived from the original on 27 జనవరి 2013. Retrieved 27 January 2013.
 5. 5.0 5.1 "Manik Sarkar: Chief Minister (CM) of Tripura". NationsRoot. Archived from the original on 9 ఆగస్టు 2013. Retrieved 11 August 2013.
 6. Shridhar Prasad, K. "Poorest Chief Minister Manik Sarkar". Bubble News. Archived from the original on 8 నవంబరు 2014. Retrieved 11 August 2013.
 7. 7.0 7.1 "Biography of Manik Sarkar". WinEnterance.com. Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 11 August 2013.
 8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-11. Retrieved 2014-01-05.
 9. 9.0 9.1 9.2 "A Profile of Shri Manik Sarkar, Chief Minister, Tripura". Tripura Info. Archived from the original on 11 సెప్టెంబరు 2013. Retrieved 12 August 2013.
 10. "Politburo". Merriam Webster. Retrieved 12 August 2013.
 11. https://economictimes.indiatimes.com/news/politics-and-nation/from-manik-sarkar-to-modis-sarkar-end-of-the-road-for-indias-only-communist-cm/articleshow/63144911.cms
 12. "Chief Minister Sarkar: India's Icon of Honesty". Silicon India. Archived from the original on 3 నవంబర్ 2013. Retrieved 12 August 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 13. "Manik Sarkar: Biography". The News Person. Retrieved 12 ఏప్రిల్ 2013.
 14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-31. Retrieved 2018-03-03.
 15. http://timesofindia.indiatimes.com/topic/Tripura-chief-minister-Manik-Sarkar