అలీ ఇబ్న్ అబీ తాలిబ్

వికీపీడియా నుండి
(మాతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అలీ ఇబ్న్ అబీ తాలిబ్
అమీర్ అల్-మూమినీన్ (విశ్వాసుల నాయకుడు)
caption
అల్ నజఫ్ ఇరాక్ లోని మస్జిద్. ఇక్కడ అలీ సమాధి గలదని విశ్వాసం.
పరిపాలన656661[1]
పూర్తి పేరుఅలీ ఇబ్న్ అబీ తాలిబ్
మకుటాలుహసన్ గారి తండ్రి
Father of Dust/Soil (Arabic: అబూ తురాబ్)
Murtada (“One Who Is Chosen and Contented”)
Lion of God (Arabic: అసద్-ఉల్లాహ్)
Lion (Arabic: Heydar)[1]
First Ali (Turkish: Birinci Ali)
జననం(599-03-17)599 మార్చి 17 [2] or (600-03-17)600 మార్చి 17 [1]
జన్మస్థలంకాబా, మక్కా[1][2]
మరణం661 ఫిబ్రవరి 28(661-02-28) (వయసు 61)
మరణస్థలంకూఫా[1][2]
సమాధిఇమామ్ అలీ మస్జిద్, నజఫ్, ఇరాక్
ఇంతకు ముందున్నవారుఉస్మాన్
తరువాతి వారుముఆవియా I
భార్యలుఫాతిమా[1]
ఫాతిమా బిన్తె హిజామ్ (ఉమ్ముల్ బనీన్)
సంతానముహసన్
హుసైన్
(See:అలీ వారసులు )
రాజకుటుంబముఅహ్లె బైత్
బనూ హాషిమ్
తండ్రిఅబూ తాలిబ్
తల్లిఫాతిమా బిన్తె అసద్

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (అరబ్బీ علي بن أﺑﻲ طالب ) జననం రజబ్ నెల 13వ తేదీన, 24 హిజ్రీ పూర్వం, మార్చి 17 599. మరణం రంజాన్ నెల 21వ తేదీ హిజ్రీ శకం 40, ఫిబ్రవరి 28 661[2] మహమ్మదు ప్రవక్త(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) యొక్క దాయాది, అల్లుడు కూడాను. సున్నీ ముస్లింల ప్రకారం ఇతను నాలుగవ, అంతిమ రాషిదూన్ ఖలీఫా. ఇతని ఖలీఫా కాలం 656 - 661.

అలీ మక్కా లోని కాబా గృహంలో జన్మించారు. ఇతని తండ్రి అబూ తాలిబ్, తల్లి ఫాతిమా బిన్తె అసద్[1] కానీ ఇతని పెంపకం అంతా మహమ్మదు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) వారి ఇంటిలోనే జరిగింది. ఇతను 10 సంవత్సరాల వయస్సులో ఇస్లాంను స్వీకరించాడు. ఇస్లాంను స్వీకరించిన బాలురలలో ప్రథముడు.[3][4] మక్కాలో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నపుడు అలీ ముస్లింలకు అండగా నిలిచారు.[5] ఇతని భార్య ఫాతిమా, కుమారులు హసన్, హుసేన్.

మాతం[మార్చు]

షియా తెగ పాతబస్తీలో హజ్రత్‌ అలీ మాతం ఊరేగింపు చార్మినార్‌ నుంచి ఒంటెలు, గుర్రాలపై భక్తి ప్రపత్తులతో కొనసాగుతుంది. ఇరాక్‌లోని కోఫియా మసీదులో అమరుడైన హజ్రత్‌ అలీ సంస్మరణార్థం ఏటా పాతబస్తీలో మాతం ఊరేగింపును ఆల్‌ ఇండియా షియా కాన్ఫరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. షియా తెగ నల్లని వస్త్రాలు ధరించి విషాద గీతాలు ఆలపిస్తూ చురకత్తులు, బ్లేడ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ భక్తి ప్రపత్తులతో 'మాతం' చేస్తారు. చార్మినార్‌ నుంచి ప్రారంభమమైన ఊరేగింపు మదీనా సర్కిల్‌, చెత్తబజార్‌, పురానీహవేలీ, ఆజాఖానా జోహరా మీదుగా కలీకబర్‌ మూసీనది సమీప మసీదు-ఎ-ఇమామీయా చేరుకొంటుంది..ఊరేగింపులో కలీబర్‌ మసీదు చేరుకొని భక్తి ప్రపత్తులతో సంప్రదాయ ప్రార్థనలు చేస్తారు. అమరుడైన హజ్రత్‌ అలీని స్మరిస్తూ విషాదగీతాలు ఆలపిస్తారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Ali". Encyclopedia Britannica Online.
  2. 2.0 2.1 2.2 2.3 "Shaheed Foundation". Archived from the original on 2007-07-05. Retrieved 2008-03-18. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Shaheed" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Tabatabae191 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Ashraf, (2005) p.14
  5. Ashraf, (2005) p.16