మాతంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతిమశాస్త్రం , వచన వివరణలు[మార్చు]

బ్ర్హట్ తంత్రసార అనే ధ్యాన మంత్రం (ఒక భక్తుడు తన దైవ రూపాన్ని గురించి ప్రార్ధిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ) అత్యంత ప్రజాదరణ కలిగిన దేవత యొక్క రూపాలలో ఒకటి అయిన ఉచ్చ్చిష్ట -మాతంగిని గురించి వివరిస్తుంది. మాతంగి రూపం శవం మీద కూర్చుని ఎర్రటి వస్త్రాలు, ఎర్ర ఆభరణాలు, గురివింద విత్తనాల దండను ధరిస్తుంది .అభివృద్ధి చెందిన వక్షోజాలతో దేవత రూపం పూర్తిగా యువ, పదహారేళ్ళ కన్యగా వర్ణించబడింది. ఆమె తన రెండు చేతుల్లో పుర్రె, కత్తిని తీసుకువెళుతుంది, మిగిలిపోయిన వాటిని ఆమెకు అందిస్తారు. [1]

పురశ్చర్యర్ణవ, తంత్రసార ధ్యాన మంత్రాలు మాతంగి రూపం నీలి రంగులో ఉంటుంది అని వివరిస్తాయి . నెలవంక ఆకారంలో చంద్రుడు ఆమె నుదిటిని అలంకరిస్తుంది. మూడు కళ్ళతో, నవ్వు మొహం తో ఆమె రూపం ఉంటుంది . ఆమె రకరకాల నగలు ధరించి, ఆభరణాలతో తయారు చేయబడిన సింహాసనంపై కూర్చుంది. ఆమె నాలుగు చేతుల్లో, ఆమె ఒక ఉచ్చు , కత్తి, ఒక మేక, ఒక కర్ర ను కలిగి ఉంది. ఆమె నడుము సన్నగా ఉంది, ఆమె వక్షోజాలు బాగా అభివృద్ధి చెందాయి. [1]

పురశ్చర్యర్ణవ నుండి గ్రహించిన ధ్యాన మంత్రం నుండి మాతంగి ఆకుపచ్చ రంగులోని దేహంతో నుదుటి పైన చంద్రవంకతో ఉంటుంది అని వివరణ లభిస్తుంది . ఆమె పొడవాటి జుట్టుతో , పెదవులపైనా నవ్వుతో, మత్తు కళ్ళు కలిగి ఉండి కదంబ పువ్వులతో తయారు చేసిన పూలమాలతో , వివిధ ఆభరణాల దండలను ధరిస్తుంది. ఆమె ముఖం చుట్టూ కొద్దిగా పట్టిన చెమటలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది . ఆమె నాభి క్రింద ఉన్న చర్మం పైన యొక్క మూడు క్షితిజ సమాంతర మడతలు ఉన్నాయి. ఒక బలిపీఠం మీద కూర్చుని, రెండు చిలుకలతో చుట్టుముట్టబడిన ఆమె చతుష్షష్టి కళలు . లను చూపిస్తుంది. [1] శారదతిలక ప్రకారం రాజా-మాతంగి వీణ వాయిస్తుంది , శంఖాలను , గవ్వలను చెవిపోగులుగా , పూల దండలు ధరిస్తుంది, అలంకరించే పూల చిత్రాలను ఆమె నుదిటిపై కలిగి ఉందని వివరిస్తుంది. [2] ఆమె తెల్లటి తామర దండను ధరించి చిత్రీకరించబడింది (ఇక్కడ ఆ ధవళ కమలం రంగురంగుల ప్రపంచ సృష్టిని సూచిస్తుంది). ఇది దేవత సరస్వతి ప్రతిమ శాస్త్రం వలె ఉంటుంది. [3]

కాళిదాసు యొక్క శ్యామలదండకం ప్రకారం, మాతంగి ఒక రాళ్ళూ పొదిగిన వీణ వాయిస్తుంది , చాల తియ్యగా మాట్లాడుతుంది. ధ్యాన మంత్రం ఆమెను చిక్కటి పచ్చ రంగు, ఎర్ర కుంకుమ పొడి తో అభిషేకం చేసిన పూర్తి రొమ్ములు, నుదిటిపై నెలవంక చంద్రునితో , నాలుగు చేతులు సాయుధమని వివరిస్తుంది. ఆమె ఒక ఉచ్చు , ఒక మేక, చెరకు విల్లు, పూల బాణాలను కలిగి ఉంటుంది, వీటిని త్రిపుర సుందరి దేవత తరచుగా పట్టుకునేలా వివరిస్తారు. [4] ఆమె చిలుకను ప్రేమిస్తుందని కూడా వర్ణించబడింది, పాటల యొక్క అమృతాన్ని ఎంతగానో ఇష్టపడుతుందనీ కూడా వివరించబడింది. [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Kinsley (1997) p. 209
  2. Kinsley (1997) NOTES TO PAGES 209–216
  3. Pravrajika Vedantaprana, Saptahik Bartaman, Volume 28, Issue 23, Bartaman Private Ltd., 6, JBS Haldane Avenue, 700 105 (ed. 10 October, 2015) p.20
  4. Frawley p. 142
  5. Frawley p. 138

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాతంగి&oldid=3041119" నుండి వెలికితీశారు