మాథ్యూ కుహ్నెమాన్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | మాథ్యూ పాల్ కుహ్నెమాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1996 సెప్టెంబరు 20 బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్, ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 466) | 2023 ఫిబ్రవరి 17 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 ఫిబ్రవరి 6 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 237) | 2022 జూన్ 16 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 అక్టోబరు 19 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 50 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 113) | 2025 జూలై 22 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 నవంబరు 2 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 50 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2017/18 | క్రికెట్ ఆస్ట్రేలియా XI (స్క్వాడ్ నం. 18) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018/19–2023/24 | క్వీన్స్‌లాండ్ (స్క్వాడ్ నం. 30) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018/19–present | బ్రిస్‌బేన్ హీట్ (స్క్వాడ్ నం. 18) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2023 | డర్‌హాం (స్క్వాడ్ నం. 50) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024/25–present | టాస్మానియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2025 | గ్లామోర్గాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2026 జనవరి 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మాథ్యూ పాల్ కుహ్నెమాన్ (జననం 1996 సెప్టెంబరు 20) ఆస్ట్రేలియన్ క్రికెటర్ . [1] అతను 2016–17, 2017–18 సీజన్లలో క్వీన్స్‌ల్యాండ్ తరపున రూకీ కాంట్రాక్టులో కుదిరాడు. 2017–18 JLT వన్డే కప్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా XI తరపున లిస్ట్ A ల్లో ప్రవేశించాడు.[2] [3] 2022 జూన్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు.
కెరీర్
[మార్చు]కుహ్నెమాన్ బ్రిస్బేన్‌లో జన్మించాడు. బాల్యంలో గోల్డ్ కోస్ట్ వెళ్లాడు. అక్కడ ది సౌత్‌పోర్ట్ స్కూల్‌లో చదివాడు.[4] 10 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[5] 17 సంవత్సరాల వయస్సులో గోల్డ్ కోస్ట్ డాల్ఫిన్స్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రవేశించాడు.[6] 2014లో, TSS కోసం ఫస్ట్ XI GPS ప్రీమియర్‌షిప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయాన్ని అతను ఇప్పటికీ తన జూనియర్ కెరీర్‌లో ఇష్టమైన జ్ఞాపకంగా భావిస్తాడు.[7]
2017–18 JLT వన్డే కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా XI జట్టులో కుహ్నెమాన్ చోటు దక్కించుకున్నాడు. న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన టోర్నమెంట్‌లోని 11వ మ్యాచ్‌లో అతను లిస్ట్ A క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి, కుర్టిస్ ప్యాటర్సన్ స్టంప్ అవుట్ చేసి, తన మొదటి లిస్ట్ A వికెట్ తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా తరపున 11వ స్థానంలో బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు.[2]
అతను 2019 ఫిబ్రవరి 1 న 2018–19 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున తొలి ట్వంటీ20 ఆడాడు.[8] 2021 ఫిబ్రవరి 17 న 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌ల్యాండ్ తరపున తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[9]
2022 జూన్లో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం కుహ్నెమాన్‌ను ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చారు.[10] 2022 జూన్ 16 న పల్లెకెలెలో ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో రంగప్రవేశం చేసి, రెండు వికెట్లు తీసుకున్నాడు.[11]
2023 ఫిబ్రవరిలో భారతదేశంలో భారత్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో కుహ్నెమాన్ తన టెస్ట్ రంగప్రవేశం చేశాడు. మొదట అతను జట్టులో లేడు. ఆష్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్‌లను అతని కంటే ముందుగా ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల స్వెప్సన్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళడంతో, కుహ్నెమాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.[12][13] రెండవ టెస్ట్ కోసం కుహ్నెమాన్‌ను అగర్ కంటే ముందుగా ఎంపిక చేశారు.[14] మూడవ, నాల్గవ టెస్ట్‌లకు తన స్థానాన్ని నిలుపుకున్నాడు. 2023 మార్చి 1 న ఇండోర్‌లో జరిగిన మూడవ టెస్ట్‌లో కుహ్నెమాన్, తన తొలి అంతర్జాతీయ ఐదు వికెట్ల పంట సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌ను 5/16 గణాంకాలతో ముగించాడు. భారతదేశంపై ఆస్ట్రేలియా విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.[15]
2025లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు కుహ్నెమాన్ ఎంపికయ్యాడు.[16] అయితే, బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో కుహ్నెమాన్ కుడి బొటనవేలికి గాయం కావడంతో శస్త్రచికిత్స అవసరం అయింది. దీనితో కుహ్నెమాన్ పర్యటనకు వెళ్లడం సందేహంగా మారింది. అయితే, చివరికి అతను మొదటి టెస్ట్ ఆడటానికి అనుమతి పొందాడు.[17] గాలెలో జరిగిన మొదటి టెస్ట్‌లో కుహ్నెమాన్, 5/63 తో టెస్ట్‌లలో తన రెండవ ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. మూడవ ఇన్నింగ్స్‌లో కుహ్నెమాన్ మరో నాలుగు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను నమ్మకమైన విజయానికి నడిపించాడు. [18] అతను రెండవ టెస్ట్‌లో 7 వికెట్లు పడగొట్టాడు, సిరీస్‌ను 17.18 సగటుతో 16 వికెట్లతో అగ్రగామి బౌలరుగా ముగించాడు.[19] రెండవ టెస్ట్ ముగింపులో మ్యాచ్ అధికారులు అతనిపై అనుమానిత అక్రమ బౌలింగ్ యాక్షన్‌కు ఫిర్యాదు చేశారు. తరువాత పరీక్ష పూర్తయ్యే వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేశారు.[20][21] ఫిబ్రవరి 26న, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో పరీక్ష చేయించుకున్న తర్వాత అతని బౌలింగు యాక్షను సరైనదేనని తేల్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో బౌలింగ్ కొనసాగించడానికి అతనికి అనుమతి లభించింది.[22][23]
మూలాలు
[మార్చు]- ↑ "Matthew Kuhnemann". ESPN Cricinfo. Retrieved 8 October 2017.
- ↑ 2.0 2.1 "11th match, JLT One-Day Cup at Sydney, Oct 8 2017". ESPN Cricinfo. Retrieved 8 October 2017.
- ↑ "New Additions to Bulls and Fire Squads". Queensland Cricket. Archived from the original on 2022-11-29. Retrieved 8 October 2017.
- ↑ "Matt Kuhnemann called up as Australia face selection headaches". ESPN Cricinfo. 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Australia call for reinforcements with spinner added to Test squad for India". International Cricket Council. Retrieved 12 February 2023.
- ↑ Malcolm, Alex (17 February 2023). "Head recalled for bowling ability, Matt Kuhnemann leapfrogs struggling Ashton Agar". ESPN Cricinfo. Retrieved 18 February 2023.
- ↑ "IND vs AUS Cricket Scorecard, 3rd Test at Indore, March 01 - 03, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
- ↑ "48th Match (N), Big Bash League at Brisbane, Feb 1 2019". ESPN Cricinfo. Retrieved 1 February 2019.
- ↑ "12th Match, Hobart, Feb 17 – Feb 20 2021, Sheffield Shield". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
- ↑ "Matt Kuhnemann called up as Australia face selection headaches". ESPN Cricinfo. 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Australia call for reinforcements with spinner added to Test squad for India". International Cricket Council. Retrieved 12 February 2023.
- ↑ "Matt Kuhnemann called up as Australia face selection headaches". ESPN Cricinfo. 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Australia call for reinforcements with spinner added to Test squad for India". International Cricket Council. Retrieved 12 February 2023.
- ↑ Malcolm, Alex (17 February 2023). "Head recalled for bowling ability, Matt Kuhnemann leapfrogs struggling Ashton Agar". ESPN Cricinfo. Retrieved 18 February 2023.
- ↑ "IND vs AUS Cricket Scorecard, 3rd Test at Indore, March 01 - 03, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
- ↑ "Matt Kuhnemann called up as Australia face selection headaches". ESPN Cricinfo. 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Australia call for reinforcements with spinner added to Test squad for India". International Cricket Council. Retrieved 12 February 2023.
- ↑ Malcolm, Alex (17 February 2023). "Head recalled for bowling ability, Matt Kuhnemann leapfrogs struggling Ashton Agar". ESPN Cricinfo. Retrieved 18 February 2023.
- ↑ "IND vs AUS Cricket Scorecard, 3rd Test at Indore, March 01 - 03, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
- ↑ Doyle, Michael (12 February 2025). "Kuhnemann reported for suspected illegal bowling action". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 13 February 2025.
- ↑ Dillon, Robert (13 February 2025). "Why umpires chose to cite Matthew Kuhnemann for a suspect action". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 13 February 2025.
- ↑ Wu, Andrew (26 February 2025). "Spinner Matt Kuhnemann cleared of suspect bowling action". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 26 February 2025.
- ↑ "Kuhnemann cleared of suspect bowling action by ICC". ESPNcricinfo (in ఇంగ్లీష్). 26 February 2025.