మాదాసు నాగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగయ్య
జననం
దేచవరం గ్రామం, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా
మరణం2021 మార్చి 27
దేచవరం
వృత్తినటుడు

వేదం నాగయ్యగా ప్రేక్షకులకు సుపరిచితుడైన మాదాసు నాగయ్య తెలుగు సినిమా నటుడు. అనేక ఆర్ధిక ఇబ్బందులతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగయ్య ఆనతి కాలంలోనే పలు చిత్రాల్లో వివిధ పాత్రలలో నటించాడు.[1] 2021 మార్చి 27న అనారోగ్యంతో మరణించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

మాదాసు నాగయ్య గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందినవాడు. మొదట్లో అతను గొడుగులు అమ్ముకుని జీవించేవాడు. అతను ‘వేదం’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమకు పరిచమయ్యారు. తరువాత 30 చిత్రాలలోనటించాడు. వేదం సినిమాలో అతని నటన మంచు గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అతను చెప్పిన సంభాషణ "పద్మ మన పైసలు దొరికాయే..  నీ బిడ్డ సదువుకుంటాడే" ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో చిన్నపాటి రోల్ లో కనిపించినా తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోగుర్తింపు పొందిన తరువాత అతను "వేదం" నాగయ్యగా సుపరిచితుడయ్యాడు. అతను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం దేచవరంలో 2021 మార్చి 27న తన 75 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

వేదం సినిమాలో పల్లెటూరిలో వృద్ధుడిగా ఆయన చేసిన ఆ పాత్రకు నంది అవార్డును అందుకున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Veteran actor Vedam Nagaiah passes away at 77 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-28.
  2. "'వేదం' నాగయ్య కన్నుమూత". www.eenadu.net. Retrieved 2021-03-28.

బాహ్య లంకెలు[మార్చు]