మాధవరం కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవరం కృష్ణారావు
మాధవరం కృష్ణారావు


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014- 2018, 2018 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
నియోజకవర్గం కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1967-02-19) 1967 ఫిబ్రవరి 19 (వయసు 57)
కూకట్‌పల్లి, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నారాయణరావు, సక్కుబాయి
జీవిత భాగస్వామి లక్ష్మీబాయి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

మాధవరం కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2]

జననం

[మార్చు]

కృష్ణారావు 1967, ఫిబ్రవరి 19న నారాయణరావు, సక్కుబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని కూకట్ పల్లిలో జన్మించాడు. 9వ తరగతి వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృష్ణారావుకు లక్ష్మీబాయితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

కృష్ణారావు కూకట్ పల్లి జిహెచ్ఎంసి వైస్ చైర్మన్ గా పనిచేశాడు.[3] 46 సంవత్సరాల వయస్సులో 2014లో తెలుగుదేశం పార్టీ తరపున కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు పై గెలుపొందాడు.[4] అటుతర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న అభివృద్ధిని చూసి 2015, మే 30న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరాడు.[5][6][7] మాధవరం కృష్ణారావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[8][9] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[10][11]

కృష్ణారావు 2023 శాసనసభ ఎన్నికల్లో 70387 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. "TRS plenary: Delegates in for special Telangana treat". The New Indian Express. Retrieved 2021-10-03.
  2. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. NTV Telugu (14 July 2020). "బస్తీ మే సవాల్‌! టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు..?". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. "Telugu Desam MLA joins TRS". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2015-05-31. Retrieved 2021-10-03.
  6. hansindia (2015-01-28). "Kukkatpally TDP MLA Madhavaram Krishna Rao eyes TRS". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-03.
  7. ఆంధ్రజ్యోతి. "సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరా". Retrieved 3 March 2017.[permanent dead link]
  8. Andhrajyothy (13 May 2021). "జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా : టీఆర్ఎస్ ఎమ్మెల్యే". www.andhrajyothy.com. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  9. Namasthe Telangana (15 April 2021). "ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి". Namasthe Telangana. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  10. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  11. Sakshi (21 June 2022). "ఇక కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఫ్రీ.. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
  12. Eenadu (4 December 2023). "వారికి మస్త్‌ మెజారిటీ.. వీరికి బొటాబొటీ". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.