Jump to content

మానవ గ్రంథాలయం

వికీపీడియా నుండి
మానవ గ్రంథాలయం
హ్యూమన్ లైబ్రరీ
ట్రీఫోర్ట్ 2019 వద్ద మెరిడియన్ లైబ్రరీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అయిన హ్యూమన్ లైబ్రరీలో బోయిసియన్ లెటా న్యూస్టాడ్టర్
ముందువారులివింగ్ లైబ్రరీ
స్థాపనకోపెన్ హాగెన్, డెన్మార్క్
చట్టబద్ధతఅంతర్జాతీయం
కేంద్రీకరణసురక్షితమైన సంభాషణ స్థలాన్ని ఏర్పాటు చేయడం
రంగంsసామాజిక సమస్యలు, మనోభావాలు
సభ్యులుస్వచ్ఛంద సేవా సభ్యులు
ఖర్చులుఉచిత సేవ
ఉద్యోగులుమానవ పుస్తకాలు (స్వచ్ఛంద సేవా సభ్యులు), సహాయకులు , గ్రంథపాలకులు, సిబ్బంది
జాలగూడుhttps://humanlibrary.org/

సాధారణంగా గ్రంథాలయంలో చదువరుల ఉపయోగం కొరకు పుస్తకాలు, పత్రికలూ వంటి వనరులు ఉంటాయి. కానీ మానవ గ్రంథాలయం లేదా ఆంగ్లంలో హ్యూమన్ లైబ్రరీ అంటే ఇక్కడ పుస్తకాల స్థానంలో మానవులు అదే పని చేస్తారు — అంటే, పుస్తకం చదివే బదులుగా, నిజమైన వ్యక్తితో మాట్లాడడం జరుగుతుంది.

ఇక్కడ మనుషులే పుస్తకాలుగా మారి తమ అనుభవాలనే అక్షరాలుగా మార్చి పాఠాలు చెపుతారు. ఆనందాన్ని, విజ్ఞానాన్ని, జీవిత సారాన్ని పంచుకుంటారు.[1] ఈ సంస్థ పుస్తకాలకు బదులుగా ప్రజలకు మానవ సహాయం అందచేసే గ్రంథాలయంగా భావించవచ్చు.[2]

ఇది 2000లో డెన్మార్క్ దేశం, కోపెన్హాగన్ అనే నగరంలో మొదటగా ప్రారంభమైన ఓ ప్రత్యేకమైన సంస్థ, ఉద్యమం. ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తోంది. వారు సాధారణంగా కలుసుకోలేని వారితో మాట్లాడటానికి సహాయం చేయడం ద్వారా ప్రజల దురభిప్రాయాలను పరిష్కరించడం దీని లక్ష్యం. [3][4][5]

ఈ వ్యక్తులు సాధారణంగా కొంత కష్టం ఎదుఎదుర్కుంటున్న వారు అంటే - ఉదాహరణకు: ఇతరుల పక్షపాతానికి , సామాజికంగా బహిష్కరణకు గురైనవారు, సమాజంలో కళంకం ఆపాదించబడిన వారు కూడా ఉన్నారు. ఇలాంటివారి జీవితాలు, అనుభవాలు మనం నేరుగా విని అర్థం చేసుకోవడం ద్వారా దురభిప్రాయాలు (తప్పు అభిప్రాయాలు) పోవాలి అనే ఉద్దేశంతో ఇది సాగుతుంది.[6] ఒకరు, మరోకరి గురించి నేరుగా మాట్లాడటం ద్వారా మనసు మార్చుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఉద్యమం ఇప్పుడు 80కి పైగా దేశాల్లో జరుగుతోంది. కొన్నిచోట్ల శాశ్వత మానవ గ్రంథాలయాలు కూడా ఉన్నాయి, కానీ చాలా చోట్ల ఒక వేడుకలాగా లేదా సమావేశంలా జరుగుతాయి.[6][7][8]

నిర్వహణ

[మార్చు]

సురక్షితమైన సంభాషణ స్థలాన్ని ఏర్పాటు చేయడం మానవ గ్రంథాలయం లక్ష్యం, ఇక్కడ క్లిష్టమైన ప్రశ్నలు, మానవ పుస్తకం ద్వారా సమాధానాలు, ప్రశంసలు ఉండవచ్చు. ఆశాజనకమైన సంభాషణ ఉంటుంది. మానవ గ్రంథాలయం పద్ధతి ప్రకారం సామాజిక పక్షపాతం వంటి అంశాలు గురించిన సంభాషణల ద్వారా మానవ హక్కులు, గౌరవాన్ని ప్రోత్సహించడం లక్ష్యం. ఇది స్థిర భౌతిక గ్రంథాలయం కాదు, దీనికి ఎక్కువగా సమావేశాలు (ఈవెంట్) ఆధారం. మానవ గ్రంథాలయాన్ని నిర్వహించడానికి పరిగణించవలసిన నాలుగు ముఖ్యాంశాలు: వేదిక ఎంపిక, మానవ పుస్తకాలు, సిబ్బంది, పాఠకులు.

వేదిక ఎంపిక, అనుభవం, సంబంధిత జ్ఞానం, సంభావ్యత మానవ (హ్యూమన్బుక్స్) పుస్తకాలను పాఠకులను సంతృప్తిపరిచే వాటిని ఎంచుకోవాలి. అంటే ప్రజలతో గౌరవప్రదమైన సంభాషణ ద్వారా పక్షపాతాన్ని సవాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తి. మూడవ దశలో స్వచ్ఛంద సేవకులను ఆకర్షించడానికి, సరైన పుస్తకాన్ని సరైన పాఠకుడికి అందించే సహాయక సిబ్బందిగా ఈ కార్యక్రమాన్ని (ఈవెంట్‌)ను ప్రచారం చేయడం. నాల్గవ దశలో, పాఠకులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈవెంట్‌ను ప్రచారం చేయడం.

మొదట, నిర్వాహకులు వ్రాతపూర్వకంగా ఈ కార్యక్రమం పాఠకులకు ఎలా సహాయపడుతుందో వివరించాలి/వివరించాలి. మానవ గ్రంథాలయ సేవా విధానం ప్రకారం అందుబాటులోనున్న మానవ “పుస్తకాల” జాబితాను చూస్తారు. ఈ ప్రక్రియ గురించి గ్రంథాలయాధికారితో చర్చించవచ్చు లేక ఎవరినైనా మానవ పుస్తకం తీసుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. సిబ్బంది వారికి వారి ‘పుస్తకం’ పరిచయం చేసి, మార్గదర్శకాలను తెలుసుకోడానికి సహాయం చేస్తారు. తరువాత పాఠకుడు సంభాషణ మొదలు పెడతారు. ఈ సెషన్ తర్వాత, పాఠకులు మరొక ‘పుస్తకం’ ఎంచుకోవచ్చు. మానవ గ్రంథాలయంలో కూడా సాధారణ గ్రంథాలయాలవలె చాలా మంది కనపడినప్పటికిని, ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరైనా ఇతరులతో మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్న అంశాల ప్రకారం, సలహాదారుగా లేదా సహాయకుడిగా నమోదు చేసుకోవచ్చు, ఇంకా వారు మాట్లాడగలిగిన అంశం పై ఆసక్తి కలిగిన సందర్శకుడిగా నమోదు చేసుకోవచ్చు. [9]

ప్రయోజనాలు

[మార్చు]

కథనాలు ఒక శక్తివంతమైన ప్రసార సాధనం. సరిగ్గా ఉపయోగించినప్పుడు, ఇది అంతరాలను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞానం అందరితో పంచుకోవాలనే తరతరాల ఆలోచనే ఈ మానవ గ్రంథాలయాల ఏర్పాటుకు ఆధారం. ఇది ఒక పక్షపాతరహిత, వైవిధ్య భరిత సురక్షితమైన ప్రదేశం. [10]

  • ఎదుటివారి కష్ట సుఖాలు, అనుభవాలు తెలుసుకోవచ్చు. మన విశేషాలు పంచుకోవచ్చు.
  • అనేక కారణాల వల్ల ఏర్పడుతున్న మానసిక క్షోభ, వత్తిడి, ఒంటరితనము అక్కడకువచ్చే వారితో సంభాషించడం వలన దూరమవుతాయి.
  • కొత్త స్నేహాలు, బంధాలు, పరిచయాలు ఏర్పడుతాయి. సామాజిక వ్యవస్థలో భాగస్వామ్యం అనుభవిస్తారు.
  • అర్ధం చేసుకునే విధానం అలవడుతుంది. సంభాషించే సామర్ధ్యం పెరిగి, ఆత్మ విశ్వాసంతో ప్రవర్తిస్తారు.
  • వివిధ నేపధ్యాలున్న వ్యక్తులతో సంభాషించడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.
  • పంచుకున్న విషయాల విషయంలో గోప్యత ఉండే విధంగా జాగ్రత్త వహిస్తారు.[1]

చరిత్ర, వివరాలు

[మార్చు]
హ్యూమన్ లైబ్రరీ T-షర్టు

ఈ మానవ గ్రంథాలయం అనే ఉద్యమం 2000లో డెన్మార్క్ దేశంలోని కోపెన్హాగన్లో రోస్కిల్డే ఫెస్టివల్ మొదటి సమావేశం (ఈవెంట్) జరిగినప్పుడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రోని అబెర్గెల్, డానీ అబెర్గెల్, ఆస్మా మౌనా, క్రిస్టోఫర్ ఎరిచ్సెన్ అనే నలుగురు వ్యక్తులు కలసి ఏర్పాటు చేశారు. వీళ్లు అప్పట్లో "స్టాప్ వయోలెన్స్" అనే యువజన సంస్థలో పనిచేసేవారు. ఈ సంస్థ పేరు డానిష్‌లో "స్టాప్ వోల్డెన్", అంటే "హింసను ఆపండి" అని అర్థం.[8] మొదటి కార్యక్రమం నాలుగు రోజులు నడిచింది, ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు సంభాషణలు జరిగాయి, అంటే ప్రజలు "మానవ పుస్తకాలను" (అంటే నిజమైన మనుషులను) కలుసుకుని మాట్లాడారు. దీంట్లో 1000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

నార్డిక్ మినిస్టర్ కౌన్సిల్స్ యూత్ అసెంబ్లీ "ఉంగె ఐ నార్డెన్" కోసం, తదుపరి మానవ గ్రంథాలయాన్ని నార్వేలోని ఓస్లోలో రోనీ అబెర్గెల్, దీనిని టెరిస్ ముంగాయ్-ఫోయిన్ సహకారంతో నిర్వహించారు. ఇది 2003లో నార్వేజియన్ మానవ గ్రంథాలయం కార్యక్రమం స్థాపనకు ప్రేరణనిచ్చింది. మొట్టమొదటి శాశ్వత మానవ గ్రంథాలయాన్ని 2006లో ఆస్ట్రేలియాలోని లిస్మోర్ అనే పట్టణంలో స్థాపించారు. [11]

2010కి ముందు జరిగిన అన్ని మానవ గ్రంథాలయ కార్యకలాపాలు ‘లివింగ్ లైబ్రరీ’ పేరుతో ఉండేవి. 2010లో, ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో ఈ పేరును హ్యూమన్ లైబ్రరీగా మార్చారు, అయితే కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఖండాంతర ఐరోపాలో కార్యకలాపాలకు లివింగ్ లైబ్రరీ పేరును ఉపయోగించడం కొనసాగించింది. 2011లో, యూరోపియన్ యూత్ సెంటర్, బుడాపెస్ట్, లివింగ్ లైబ్రరీని హంగేరీ అంతటా పాఠశాలల్లోకి తీసుకువచ్చే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి 40 కంటే ఎక్కువ పాఠశాలలను వ్యాపించి 1000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరుకుంది.[9]

2019 నాటికి, ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోని 70 కి పైగా దేశాలలో విస్తరించింది.[11]

భారతదేశంలో మానవ గ్రంథాలయాలు

[మార్చు]

భారత దేశం వంటి వైవిధ్యం కలిగిన దేశాలలో వ్యక్తులు తమ మనోభావాలు బహిర్గతం చేయడం వంటి విధానాలద్వారా సామాజికంగా అనుసంధానమవుతారు. ఇండోర్ లో ఐఐఎం లో మొదటి సంస్థ నవంబర్ 2016లో ఏర్పడింది, బలంగా కొనసాగుతోంది. హైదరాబాదు లో తదుపరి కార్యక్రమం జరిగింది. ఇంకా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, చెన్నై వంటి అనేక ప్రదేశాలలో 9 చాఫ్టర్స్ ఉన్నాయి. హర్షద్ ఫాడ్ ఈ మానవ గ్రంథాలయాల ఆలోచన, కార్యక్రమం అంతర్జాల వ్యాప్తికి తోడ్పడ్డాడు. 2016 మార్చి నాటికి 10మంది మానవ పుస్తకాలు లభించాయి. గృహహింస ప్రధానంగా మొదలైన ఈ కార్యక్రమాలు ఇతర సామాజిక సమస్యలను స్పృశిస్తున్నాయి. క్రమంగా ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీ , గూర్గావ్, భువనేశ్వర్ (ఒరిస్సా), బెంగళూరు, కోల్ కతా మొదలైన నగరాలలో వ్యాపిస్తున్నాయి.[9]

ముంబై వంటి నగరాలలో ప్రతి మానవ పుస్తకానికి ప్రభావవంతంగా విధులు నిర్వర్తించడానికి తగిన శిక్షణ, సమయం తీసుకుంటారు. కోవిడ్ 19 సమయం వంటి అంటువ్యాధుల ప్రాబల్యం ఉన్నప్పుడు గూగుల్ మీట్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధమైన ఏర్పాట్లు మైసూర్ మానవ గ్రంథాలయం, బ్రిటిష్ కౌన్సిల్ వారి సహకారంతో నిర్వహిస్తున్నారు.[10]

బయటి లింకులు

[మార్చు]
  1. Human Library - https://humanlibrary.org/
  2. Human Library tagged with "India" - https://humanlibrary.org/tag/india/

మూలాలు

[మార్చు]
  1. 1 2 "మనుషులే పుస్తకాలు . . . అనుభవాలే పాఠాలు". ఈనాడు. 2025-07-10.
  2. "Inside The Event Where People Are Open Books". HuffPost UK. 9 May 2017. Retrieved 2018-07-09.
  3. "The Human Library Organisation replaces pages with people". The Economist. Retrieved 2018-07-09.
  4. Rice-Oxley, Mark (8 April 2012). "My day as Depression, a book at the Human Library". The Guardian. Retrieved 2018-07-09.
  5. "The best way to preserve the Welfare State is to reinvent it". The Big Issue. 9 July 2018. Retrieved 2018-07-09.
  6. 1 2 "Human Library". Wellcome Collection. 18 August 2016. Archived from the original on 2018-07-09. Retrieved 2018-07-09.
  7. "Shropshire Libraries to host Human Library events to challenge stigma". Shropshire Council Newsroom. 7 December 2017. Archived from the original on 2018-07-10. Retrieved 2018-07-09.
  8. 1 2 Jones, Meghan (2 October 2017). "The Human Library: Where the "Books" are People". Reader's Digest. Archived from the original on 2020-04-17. Retrieved 2025-07-15.
  9. 1 2 3 Anjali, Maisal (2018). "HUMAN LIBRARY: A WORLDWIDE MOVEMENT FOR SOCIAL CHANGE" (PDF). Heritage Journal. 5. Basel, Switzerland: MDPI journals: 78–82. ISSN 2571-9408. Archived from the original (PDF) on 2024-09-14. Retrieved 2025-08-04 via Bethune College.
  10. 1 2 "Explained: What Is A Human Library? How Does It Allow Readers To Directly Confront Prejudices". Indiatimes News. Retrieved 2025-08-03.
  11. 1 2 "Purdue holds annual Human Library". WLFI News (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-19. Retrieved 2019-04-19.