మానవ వంశావళి
స్వరూపం
| మానవ వంశావళి | |
| కృతికర్త: | కంచి శేషగిరిరావు |
|---|---|
| దేశం: | భారతదేశం |
| భాష: | తెలుగు |
| విషయం: | జీవ పరిణామం |
| ప్రచురణ: | ఆంధ్ర విశ్వకళా పరిషత్తు |
| విడుదల: | 1964 |
| పేజీలు: | 160 |
మానవ వంశావళి ఒక పరిశోధనాత్మక తెలుగు పుస్తకం. దీనిని కంచి శేషగిరిరావు రచించగా 1964 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరు వారు తొలిసారిగా ముద్రించారు. ఈ పుస్తకంలో మానవుడు ఏకకణజీవుల నుండి ఎలా పరిణామం చెందినదీ విపులంగా వివరించారు. ఇది ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు 1958 సంవత్సరంలో నిర్వహించిన పోటీలో బహుమతి పొందినది.
విషయ సూచిక
[మార్చు]- దివినుండి భువి
- నగములు, నదులు, నదములు
- భువిపై జీవభవము
- ప్రాథమిక జీవులు
- ఏకకణాంగ జీవులు
- ఉన్నత అకశేరుకాలు
- మత్స్యములు - ఉభయచరములు
- సరిసృపములు
- పక్షులు, ప్రాథమిక క్షీరదములు
- ఉన్నత క్షీరదములు
- జీవపరిణామ సిద్ధాంతమునకు చెందిన కొన్ని నిదర్శనములు
- మానవుడు