మానా పటేల్
2021లో బెంగళూరులో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మానా పటేల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| Personal information | |||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| Born | 2000 మార్చి 18 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Occupation | ఈతగాళి | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| Country | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | ఈత | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Event | బ్యాక్‌స్ట్రోక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Coached by | నిహార్ అమీన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Achievements and titles | |||||||||||||||||||||||||||||||||||||||||||||
| Olympic finals | 2020 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించింది | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| Personal bests |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
మానా పటేల్ (జననం: 18 మార్చి 2000)[1] భారతదేశానికి చెందిన బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్ క్రీడాకారిణి. ఆమె అహ్మదాబాద్, గుజరాత్ కు చెందినది.
ఈత కెరీర్
[మార్చు]మానా పటేల్ ఏడు సంవత్సరాల వయస్సులో ఈత ప్రారంభించింది.[2] టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళా ఈత క్రీడాకారిణిగా మానా పటేల్ నిలిచింది. ఆమె మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో పోటీ పడింది.[3] 21 ఏళ్ల ఈ ఈత క్రీడాకారిణిగా 2019లో కాలి మడమ గాయం పొందింది, 2021 ప్రారంభంలోనే తిరిగి రాణించింది.[3]
ఆమె 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో జరిగిన 40వ జూనియర్ నేషనల్ అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 2:23.41 సెకన్ల సమయం నమోదు చేసి, 2009 ఆగస్టులో టోక్యోలో జరిగిన ఆసియన్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌లో శిఖా టాండన్ నెలకొల్పిన 2:26.41 సెకన్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.[2] మానా నేషనల్ గేమ్స్‌లో 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అదేవిధంగా, 60వ జాతీయ పాఠశాల క్రీడలు (2015)లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో జాతీయ రికార్డును అధిగమిస్తూ స్వర్ణ పతకాన్ని సాధించింది.[4] ఆమెను 2015లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కార్యక్రమానికి ఎంపిక చేశారు.[2][5]
ఆమె 12వ దక్షిణాసియా క్రీడలు (2016)లో 50 మీటర్ల, 100 మీటర్ల, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లలో రజత పతకాలు, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం, 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో, 4×100 మీటర్ల మెడ్లీ రిలేలో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.[1] మానా 72వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్-2018లో 3 స్వర్ణ పతకాలు గెలుచుకుంది.[6] మానా 2019లో బెంగళూరులో నిర్వహించిన 10వ ఆసియన్ ఏజ్-గ్రూప్ ఛాంపియన్‌షిప్స్‌లో మొత్తం ఆరు పతకాలు (1 స్వర్ణం, 4 రజతాలు, 1 కాంస్యం) గెలుచుకుంది.[7][8] 2021 అక్టోబర్ నాటికి, ఆమె 32 అంతర్జాతీయ పతకాలు, 99 జాతీయ పతకాలు గెలుచుకుని, 31 జాతీయ రికార్డులను నెలకొల్పింది.[9]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె అహ్మదాబాద్లోని ఉద్గమ్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ లో వాణిజ్య విద్యను అభ్యసించింది.[2] ఆమెకు గుజరాత్ విద్యాపీఠ్ స్విమ్మింగ్ సెంటర్‌లో కమ్లేష్ నానావతి శిక్షణ ఇచ్చారు.[10]
మూలాలు
[మార్చు]- 1 2 "Maana Patel – Swimming Federation of India". swimming.org.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-05-14. Retrieved 2018-05-13.
- 1 2 3 4 "Maana Patel, the 15-year-old girl who is making waves". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-07-21. Retrieved 2018-05-12.
- 1 2 "Maana Patel becomes first Indian female swimmer to qualify for Tokyo 2020 Olympics". India Today (in ఇంగ్లీష్). 2 July 2021. Retrieved 2021-07-26.
- ↑ "Swimmer Manna Patel clinches gold setting new record at 60th National School Games". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-02-17. Retrieved 2018-05-13.
- ↑ "Teenage Indian swimmer Maana Patel aims for Rio Olympics berth". mid-day. 2015-07-21. Retrieved 2018-05-13.[permanent dead link]
- ↑ "Maana's comeback from injury". epaper.timesgroup.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-10. Retrieved 2018-08-10.
- ↑ "After six medals Maana feels she is back". mumbaimirror.indiatimes.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-30. Retrieved 2019-09-30.
- ↑ "Maana makes comeback". sportstar.thehindu.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-26. Retrieved 2019-09-26.
- ↑ "A new generation of Gujarati athletes - Maana Patel". SBS Your Language (in ఇంగ్లీష్). Retrieved 2018-05-13.
- ↑ "Maana Patel, 15-year-old national swimming champion targets 2016 Rio Olympics". Zee News (in ఇంగ్లీష్). 2015-07-22. Retrieved 2018-05-13.
బాహ్య లింకులు
[మార్చు]- మానా పటేల్ Archived 2021-07-25 at the Wayback Machine — 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారిణి ప్రొఫైల్
- Pages using infobox sportsperson with conflicting parameters
- Articles with dead external links from మే 2026
- 2000 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ మహిళా బ్యాక్‌స్ట్రోక్ ఈతగాళ్లు
- గుజరాత్‌కు చెందిన క్రీడాకారిణులు
- అహ్మదాబాద్‌కు చెందిన క్రీడాకారులు
- 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఈతగాళ్లు
- భారతదేశానికి ఒలింపిక్ ఈతగాళ్లు
- 2022 ఆసియా క్రీడల్లో ఈతగాళ్లు
- ఆసియా క్రీడల్లో భారత ఈతగాళ్లు
- దక్షిణాసియా క్రీడల్లో భారత స్వర్ణ పతక విజేతలు
- దక్షిణాసియా క్రీడల్లో భారత రజత పతక విజేతలు
- దక్షిణాసియా క్రీడల్లో భారత కాంస్య పతక విజేతలు
- దక్షిణాసియా క్రీడల ఈత పతక విజేతలు
- గుజరాతీ క్రీడాకారులు
- 21వ శతాబ్దపు భారతీయ మహిళా క్రీడాకారిణులు
- స్విమ్మింగ్ క్రీడాకారులు
- ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన భారత క్రీడాకారిణులు