మానిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మానిని[మార్చు]

క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ గూర్చిన కెంజడకొప్పునకున్
వన్నె యొనర్చిన వాహిని యీతని వామపదంబున వ్రాలె ననన్
జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విలసిల్లు రసత్రయ చిత్ర యతుల్
పన్నుగ నొందఁ బ్రభాసుర విశ్రమ భంగిగ మానిని భవ్యమగున్.

గణ విభజన[మార్చు]

మానిని వృత్త పాదములో గణవిభజన
UII UII UII UII UII UII UII U
క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ గూర్చిన కెంజడ కొప్పున కున్


7 భగణములు, 1 గురువు

లక్షణములు[మార్చు]

మానిని వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
22
ప్రతిపాదంలోని గణాలు: భ, భ, భ, భ, భ, భ, భ, గా (7 భగణములు, 1 గురువు)
యతి : ప్రతిపాదంలోనూ 7వ, 13వ, 19వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1:[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన మానిని వృత్త పద్యాల సంఖ్య: 1

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/పూతన వ్రేపల్లెకొచ్చుట|(భా-10.1-214-మాని.) ||

కాంచనకుండల కాంతులు గండ యుగంబునఁ గ్రేళ్ళుఱుక న్జడపై
మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలువారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభా`నన యేగెఁ గుమారుని యింటికి నై.

"https://te.wikipedia.org/w/index.php?title=మానిని&oldid=3915673" నుండి వెలికితీశారు