మామిడికాయ పులిహోర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని రుచికరమైన వంటకం మామిడికాయ పులిహోర. దీనిని తయారు చేసే విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు[మార్చు]

  • బియ్యం ; ఒక కేజీ
  • మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
  • పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు ; 4 టీ స్పూన్స్
  • సెనగపప్పు ; 4 టేబుల్ స్పూన్స్
  • అల్లం ; 2అంగుళాల ముక్క
  • కరివేపాకు ; 2 కట్టలు
  • ఎండుమిరపకాయలు ; 15
  • పచ్చిమిరపకాయలు; 20
  • ఆవాలు ; 2 టీ స్పూన్స్
  • మామిడికాయలు ; 3
  • పసుపు ; 2 టీ స్పూన్స్
  • ఇంగువ ; 1 టేబుల్ స్పూన్
  • నూనె ; 3 గరిటెలు

తయారు చేసే విధానం:[మార్చు]

  • ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.
  • తరువాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ఎండుమిరప ముక్కలు , 4మెంతి గింజలు పసుపు వేసి దోరగా వేయించాలి .
  • అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .
  • మామిడి కాయలకు పీలర్తో పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  • దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరువాత గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి 5 నిమిషాలు ఉంచి బేసిన్లోని అన్నంలో బాగా కలపాలి.
  • అంతే ఘుమగుమ లాడే వేడి వేడి మామిడి కయ పులిహోర రెడీ.

వివిధ రకాల పులిహోరలు[మార్చు]

  1. నిమ్మకాయ పులిహోర
  2. దానిమ్మకాయ పులిహోర
  3. మామిడికాయ పులిహోర
  4. దబ్బకాయ పులిహోర
  5. పంపర పనసకాయ పులిహోర
  6. రాతి ఉసిరికాయ పులిహోర
  7. రవ్వ పులిహోర
  8. టమాటో పులిహోర
  9. అటుకుల పులిహోర
  10. పొంగలి పులిహోర
  11. చింతకాయ పులిహోర
  12. చింతపండు పులిహోర
  13. నిమ్మ ఉప్పు పులిహోర


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]