మామిడి తాండ్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తాండ్ర అనే పదార్దంలో మామిడి తాండ్ర ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని మామిడి పండు రసం నుండి తయారుచేస్తారు. పొరలు పొరలుగా ఉండి పులుపు, తీపి సమ్మేళనంతో అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర.

తయారీ విధానం[మార్చు]

మామిడి రసమును సేకరించి దానిని వెడల్పాటి అల్యూమినియం పళ్ళాలలో గాని, పెద్దవైన తాటాలు బుట్టలలో గాని పొరమాదిరిగా పోస్తారు. అలా పొసి దానిని ఎండలో పెట్టి గట్టి పడిన తరువాత మళ్ళీ మామిడి రసం పోస్తారు. అలా కావలసిన మందం వచ్చే వరకూ పోస్తూ ఎండబెడుతూ పోతారు. తదనంతరం దానిని నలు చదరంగా ముక్కలు ముక్కలుగా కోసి అమ్మకమునకు తీసుకెళతారు.

కుటీర పరిశ్రమగా[మార్చు]

మామిడి తాండ్ర కేవలం ఎవరికి వారుగానే తయారు చేయం కాక కుటీర పరిశ్రమగా విస్తరించినది. మామిడి ఉత్పతి అదికంగా జరిగే తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్టణం జిల్లా, విజయనగరం జిల్లా లలో దీనిని బారీ ఎత్తున పెద్ద కళ్ళాలు(సిమెంటు చేయబడిన కాళీ స్థలం) లో తయారు చేస్తారు. ఈ విదంగా తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు.