మామిడోజు చైతన్య
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మామిడోజు చైతన్య ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని.
భాల్యం
[మార్చు]ఆమె ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ గ్రామంలో 1991 లో జన్మించారు. తండ్రిపేరు మామిడోజు శ్రీనివాస్, తల్లి వాణిశ్రీ.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె విద్యార్థి దశనుండి అందరిలా కాకుండా ఏదో ప్రత్యేకంగా సాధించాలనే తపనతో ఉండేవారు. ఈ నేపథ్యంలో ఖగోళ రంగం మీద ఏకాగ్రత పెట్టారు. ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు (2007) హైదరాబాద్ లో జరిగిన, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరైన ఇంటర్నేషనల్ ఏస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగానే తరగతి సబ్జక్టుల మీదనే కాకుండా అంతరిక్ష సబ్జెక్ట్స్ దిశగా దృష్టి కేంద్రీకరించారు. వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను సేకరించి అధ్యయనం సాగించారు. అమెరికా వెళ్ళి అంతరిక్ష యానం గురించి విపుల రీతిలో అవగాహన చేసుకోవాలనే ఆకాంక్షను పెంపొందించుకున్నారు.
ఎట్టకేలకు తన కలలను సాకారం చేసుకునే నిమిత్తం 2008, జూలై నెలలో అమెరికా వెళ్ళి "నాసా"ను సందర్శించారు. నాసా కంటే ముందు అదే నెలలో "గ్లోబల్ యంగ్" లీడర్ కాన్ఫరెన్స్, మోక్ సెషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ ఆమెకు మరింత స్ఫూర్తిని కలిగించడమే కాక అంతరిక్షం, విశ్వశాస్త్రం గురించి మరికొన్ని వివరాలు తెలిసేలా చేశాయి.
2009 జనవరిలో వాషింగ్టన్ లో జరిగిన "ప్రెసిడెంట్ యూత్ ఇనార్గల్ కాన్ఫరెన్స్"కూ హాజరయ్యారు. ఇదికేవలం గ్లోబల్ యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ కు హారనైన వారిలో ఎంపిక చేసిన వారినే ఈ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించారు. కల్పనా చావ్లా, నునీతా విలియమ్స్ ఇరువురూ తనకు స్ఫూర్తి దాతలని సగర్వంగా చెప్పిన ఆమె శాటిలైట్ టెక్నాలజీని అధ్యయనం చేయడం, రోదసీ యాత్రికురాలు కావడాం భవిష్యత్ లో సాధించబోయే లక్ష్యాలుగా ఏర్పరచుకున్నారు.
ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో రాకెట్ ప్రొఫెల్లర్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు, రాకెట్లలో వాడే ఇంధనం మీద రూపొందింది. 2007 లో హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ లో పాల్గొనే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా లభించింది. ఈ సదస్సుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు, "నాసా" అధ్యక్షుడు జమ్మర్సన్, భారత సంతతికి చెందిన అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్ కూడా పాల్గొన్నారు. తదనంతరం సంబంధిత నిపుణులతో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా సంబంధాలను నెలకొల్పుకొంటూ ఉండటంతో చైతన్యకు 2008, జూలై 6 న అమెరికాలో జరిగిన గ్లోబల్ యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం లభించింది. తాను తయారుచేసిన రాకెట్ ప్రొపెల్లర్ ప్రాజెక్టు ప్రతులను నాసా అధ్యక్షునికి కూడా అందించడంతో ఈ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనే అవకాశం అందడం సులువైంది.
ఆమె స్వంత ఖర్చులతో అమెరికా వెళ్ళి అక్కడ ఐక్యరాజ్యసమితిలో స్పేస్ టెక్నాలజీ అంశం పై చైతన్య ప్రసంగించారు. జన్యుపరంగా మార్పులు చేసి తయారుచేసే అంశం మీద కూడా ప్రసంగించారు. స్పేస్ టెక్నాలజీ సహకారంతో ఇది సుసాధ్యమని తేల్చి చెప్పారు. ఈ సదస్సులో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు చైతన్యకు 2009, జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వికార కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందడం విశేషం [1]