మాయాబజార్ (1995 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మాయాబజార్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సుమన్,
దాసరి నారాయణరావు,
ఆమని,
చంద్రమోహన్,
సుత్తివేలు,
రాళ్లపల్లి,
ఎ.వి.ఎస్.,
ప్రభ,
తోటపల్లి మధు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
బాబుమోహన్,
సౌందర్య,
చలపతిరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ కామాక్షి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మాయ బజార్ ( English: Market of Illusion ) 1995 లో వచ్చిన కామెడీ చిత్రం,[1] పిఎస్ఎన్ మూర్తి, ఎమ్కె మావుల్లయ్య కామాక్షి ఫిల్మ్స్ పతాకంపై నిర్మించగా, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సుమన్, ఆమని, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలలో నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు. ఈ చిత్రం సతత హరిత పౌరాణిక క్లాసిక్ తెలుగు చిత్రం మాయ బజార్ (1957) కు సాంఘిక రూపం.

కథ[మార్చు]

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, ఇక్కడ బలరామయ్య (గుమ్మడి) గౌరవ మర్యాదలున్న వ్యక్తి. కృష్ణ ప్రసాద్ (అక్కినేని నాగేశ్వరరావు) అతని తమ్ముడు. తెలివిగల వాడూ, వివేకవంతుడు. ఇంద్రజాలికుడు కూడా. వీరికి ఒక సోదరి సుభద్ర (జయంతి), కోటీశ్వరుడు అర్జున రావు (మురళి మోహన్) ను వివాహం చేసుకుంది. వారి కుమారుడు రాజేష్ (సుమన్) కు బలరామయ్య కుమార్తె శశిరేఖ (ఆమని) అంటే ప్రేమ. ఒకసారి అర్జునరావు అన్నయ్య అయిన ధర్మారావు (రామకృష్ణ) ను వారి సవతి సోదరుడు సుయోధన రావు (గోకిన రామారావు) ఆహ్వానిస్తాడు. వీరి కుటుంబాల మధ్య విద్వేషాలు ఉన్నాయి. పరిస్థితిని వాడుకుని సుయోధన రావు, తన మామ కుళ్ళాయప్ప (తోటపల్లి మధు) తో కలిసి, వారి సంపద మొత్తాన్ని జూదంలో లాక్కొని, వాళ్ళను నేరంలో ఇరికించి, శిక్ష వేయిస్తాడు. అది తెలుసుకున్న బలరామయ్య తన రాజకీయ అనుచరుడైన సుయోధన రావు వద్దకు కోపంగా వెళతాడు. ఇది తెలిసి జిత్తులమారి సుయోధన రావు కుళ్ళాయప్పలు బలరామయ్యను పొగడ్తలతో ముంచెత్తుతారు. సుయోధన రావు కుమారుడు బేబీ (బాబు మోహన్) తో శశిరేఖకు పెళ్ళి చెయ్యడానికి అతడి అనుమతి తీసుకుంటారు. ఇంతలో, రాజేష్ సుభద్ర గ్రామానికి చేరుకుంటారు. వారు ఆర్థికంగా నాశనమయ్యారు కాబట్టి, బలరామయ్య భార్య రేవతి (అనురాధ) వారిని చులకనగా చూస్తుంది.

ప్రస్తుతం, కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి, కృష్ణ ప్రసాద్ తెలివిగా వారిని అడవిలో ఉండే రాజేష్ బంధువు ఘట్టయ్య దొర (దాసరి నారాయణరావు) కుగ్రామానికి మళ్లిస్తాడు. ఘట్టయ్య దొర ఒక గిరిజన నాయకుడు, అతీంద్రియ శక్తులను కలిగినవాడు. వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతాడు. ఆ తరువాత, అతను జరిగిన కల్లోలం గురించి తెలుసుకుంటాడు, కృష్ణ ప్రసాద్ మార్గదర్శకత్వంలో అతను శశిని తీసుకువెళ్ళి, ఆ స్థానంలో తనను తాను వధువుగా కనికట్టు చేస్తాడు. ప్రస్తుతం, వివాహ వేదికలో ఘట్టయ్య దొర, అతని సహాయకుల మంత్ర తంత్రాలు పెళ్ళికుమారుల ప్రజలను బాధపెడతాయి. సమాంతరంగా, రాజేష్ తన తండ్రి, మామల అమాయకత్వాన్ని రుజువు చేసి వారిని నిర్దోషిగా విడిపిస్తాడు. చివరికి కృష్ణ ప్రసాద్, దుష్టుల నిజమైన ఉద్దేశాలను వెలికి తెస్తాడు. చివరగా, రాజేష్ & ససిరేఖా పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."అవే కళ్ళు అవే చూపు"భువనచంద్రSP Balu, Chitra4:55
2."తొలి వలపుల"సిరివెన్నెల సీతారామశాస్త్రిMano, S. Janaki3:26
3."నీవేనా"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుSP Balu, S. Janaki3:54
4."దండంతో"నందిగామగనిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం5:04
5."ఏలో ఎల్లెల్లో"సాహితిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం,ఎస్. జానకి3:51
6."ఓ చందమామా"సాహితిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:21
7."ఓ సుందరి నువ్వే"సాహితిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం,స్వర్ణలత5:07
8."రంగ రంగా"భువన చంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం4:10
9."జై శక్తి"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం3:06
Total length:38:54

మూలాలు[మార్చు]

  1. "Maya Bazaar (Review)". Know Your Films.