Jump to content

మారియా కొరినా మచాడో

వికీపీడియా నుండి
మారియా కొరినా మచాడో
2023లో మచాడో
మిరాండా రాష్ట్రం, వెనిజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు
In office
2011 జనవరి 5 – 2014 మార్చి 21
వ్యక్తిగత వివరాలు
జననం
మారియా కొరినా మచాడో పారిస్కా

(1967-10-07) 1967 October 7 (age 58)
కారకాస్, రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా
రాజకీయ పార్టీవెంటే వెనిజులా (2012 నుండి)
ఇతర రాజకీయ
పదవులు
యూనిటరీ ప్లాట్‌ఫామ్
డెమోక్రటిక్ యూనిటీ రౌండ్‌టేబుల్
సుమాటే (2001–2010)
జస్టిస్ ఫస్ట్ (2010–2012)
సంతానం3
చదువుఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్శిటీ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)
ఇన్‌స్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియర్స్ డి అడ్మినిస్ట్రేషియోన్ (మాస్టర్ ఆఫ్ సైన్స్)
పురస్కారాలు
  • వాక్లావ్ హావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ (2024)
  • సఖారోవ్ ప్రైజ్ (2024)
  • నోబెల్ శాంతి బహుమతి (2025)
సంతకం

మారియా కొరినా మచాడో పారిస్కా (ఆంగ్లం: María Corina Machado; జననం 1967 అక్టోబరు 7) వెనిజులా రాజకీయవేత్త, పారిశ్రామిక ఇంజనీర్. ఆమె వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, 2011 నుండి 2014 వరకు వెనిజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేసింది. ఆమెకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె 2002లో రాజకీయాల్లో పనిచేయడం ప్రారంభించింది.

బ్రెజిల్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2011లో మాట్లాడుతున్న మారియా కొరినా మచాడో

ఓట్లను పరిశీలించే సుమాటే (Súmate) అనే గ్రూపుకు నాయకురాలు, ఫౌండర్ గా అలెజాంద్రో ప్లాజ్ తో కలసి పనిచేసింది.[1][2][3] వెంటే వెనెజులా అనే రాజకీయ పార్టీలో జాతీయ కోఆర్డినేటర్ గా పనిచేసింది. 2018లో బీబీసీ 100 మహిళల జాబితాలోనూ,[4][5] 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలోనూ స్థానం సంపాదించింది.[6] వెనెజులా ప్రతిపక్ష నాయకుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మచాడో నిలుస్తోంది. వెనెజులాలో అధికారంలో ఉన్న నికోలాస్ మడురో (Nicolás Maduro) ప్రభుత్వం ఆమెను వెనెజులా విడిచి వెళ్ళకుండా నిషేధించింది.[7]

మచాడో 2012 వెనిజులా అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడింది. ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రాధమిక ఎన్నికల్లో హెన్రిక్ కాప్రిల్స్ చేతిలో ఓటమి చెందింది. 2014 వెనిజులా నిరసనల సమయంలో నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను నిర్వహించిన ముఖ్యవ్యక్తుల్లో మచాడో ఉన్నది.[8] 2019లో జరిగిన వెనిజులా అధ్యక్ష పదవీ సంక్షోభం మధ్యలో, వివాదాస్పదుడైన తాత్కాలిక అధ్యక్షుడు జువాన్ గైడో ఎన్నికలు నిర్వహిస్తే తాను పోటీగా మరో అధ్యక్ష ఎన్నికలను ప్రారంభిస్తానని ఆమె ప్రకటించింది. చివరకు గైడో తన ప్రయత్నాలు విరమించుకున్నాడు[9]

2023లో ప్రతిపక్షాల కూటమి అయిన యూనిటరీ ప్లాట్ఫాం తాలూకు ప్రాధమిక ఎన్నికలలో ఆమె ముందంజలో ఉన్నది, ఆ ప్రక అయినప్పటికీ 2023 జూన్ 30న వెనిజులా కంప్ట్రోలర్ జనరల్ ఆమెను 15 సంవత్సరాల పాటు అనర్హురాలిగా ప్రకటించాడు.[10] ఆమె అనర్హతను జనవరి 2024లో వెనిజులా సుప్రీంకోర్టు ధృవీకరించింది.[11] ఇదిలా ఉండగా మరోవైపు ఆమె అప్పటికే ప్రాధమిక ఎన్నికలలో విజయం సాధించింది. దాని ఫలితంగా మచాడోను 2024 అధ్యక్ష ఎన్నికలకు ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అనర్హత కారణంగా ఆమె స్థానంలో 22 మార్చి 2024న కొరినా యోరిస్ ను నియమించారు.[12] అయితే, అభ్యర్థిగా నమోదు చేసుకోకుండా యోరిస్ను నిరోధించారు, తాత్కాలికంగా ఎడ్మండో గొంజాలెజ్ ఉరుటియాను అభ్యర్థిగా నియమించాల్సి వచ్చింది.

2024 ఆగస్టు 1న, ది వాల్ స్ట్రీట్ జర్నల్ మచాడో రాసిన ఒక లేఖను ప్రచురించింది. నికోలస్ మదురో ఆ లేఖలో "నియంతృత్వం నుండి నా జీవితానికి, నా స్వేచ్ఛకి, నా తోటి దేశస్థుల ప్రాణాలకు ఉన్న ముప్పుకు భయపడి" దాక్కున్నట్లు పేర్కొంది.[13]

మరియా కొరినా మచాడో వెనెజులా దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను 2025లో నోబెల్ అవార్డుకు ఎంపికైంది.[14]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మచాడో భర్త నుండి విడాకులు తీసుకుంది. అయితే, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. బెదిరింపుల కారణంగా ఆమె పిల్లలు ఇంట్లో కాకుండా విదేశాలలో నివసిస్తున్నారు.[15][16] మచాడో ఒక కాథలిక్.[17]

మూలాలు

[మార్చు]
  1. "Comunicado de Súmate sobre renuncia de María Corina Machado" [Statement from Súmate regarding the resignation of María Corina Machado]. El Universal (in స్పానిష్). 12 February 2010. Archived from the original on 29 September 2012. Retrieved 25 October 2023..
  2. Boustany, Nora (9 July 2004). "Signing On To Challenge Hugo Chavez". The Washington Post. p. A.15. ProQuest 409713725.
  3. de la Rosa, Alicia (11 July 2011). "Diputada Machado anunciará su precandidatura el próximo domingo" [Deputy Machado will announce her pre-candidacy next Sunday]. El Universal (in స్పానిష్). Archived from the original on 12 July 2011. Retrieved 25 October 2023.
  4. "BBC 100 Women 2018: Who is on the list?" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC News. 19 November 2018. Retrieved 23 July 2019.
  5. Turkewitz, Julie; Herrera, Isayen; Fernandez, Adriana Loureiro (24 July 2024). "The 'Iron Lady' of Venezuela Threatens to Unseat Its Autocrat". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331.
  6. "María Corina Machado: The 100 Most Influential People of 2025". TIME (in ఇంగ్లీష్). 2025-04-16. Archived from the original on 2025-10-12. Retrieved 2025-04-17.
  7. Turkewitz, Julie; Herrera, Isayen; Fernandez, Adriana Loureiro (24 July 2024). "The 'Iron Lady' of Venezuela Threatens to Unseat Its Autocrat". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331.
  8. Kurmanaev, Anatoly (23 December 2014). "Venezuela Protests Drive Poor to Maduro as Death Toll Mounts". Business Week. Archived from the original on 13 March 2014. Retrieved 23 December 2014.
  9. Regan, Trish (2 February 2019). "Venezuela could see its first female president". Fox Business. Retrieved 17 February 2019.
  10. Armas, Mayela; Sequera, Vivian (30 June 2023). "Venezuela opposition candidate Machado barred from holding office-gov't". Reuters (in ఇంగ్లీష్). Retrieved 30 June 2023.
  11. "Venezuela's Supreme Court disqualifies opposition leader from running for president". Le Monde.fr (in ఇంగ్లీష్). AFP. 27 January 2024. Retrieved 8 March 2024.
  12. Garcia Cano, Regina (26 October 2023). "María Corina Machado is winner of Venezuela opposition primary that the government has denounced". Associated Press. Retrieved 27 October 2023.
  13. Machado, Maria Corina (1 August 2024). "I Can Prove Maduro Got Trounced". The Wall Street Journal. Retrieved 1 August 2024.
  14. "అణచివేతకు భయపడని 'అజ్ఞాత'వాసి.. ఎవరీ మరియా కొరీనా..?". Eenadu. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  15. "María Corina" (in స్పానిష్). Vente Venezuela. 14 September 2016. Retrieved 3 May 2017.
  16. {{cite AV media}}: Empty citation (help)
  17. Henríquez, Andrés. "Venezuela's Catholic voters face crucial decision for president". Catholic News Agency (in ఇంగ్లీష్). Retrieved 10 October 2025.