మారోజు చైతన్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారోజు చైతన్య
Maroju Chaitanya.jpg
జననంకోటమర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తిప్రజా గాయని

మారోజు చైతన్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ప్రజా గాయని. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

చైతన్య 1974, మే 4న యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి లో జన్మించింది. చిన్నతనం నుంచే పాటలు పాడడంలో అనుభవం ఉన్న చైతన్య 1996 నుంచి తెలంగాణ ఉద్యమం లో మరియు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక వేదికలమీదా తన గొంతు వినిపించింది. తెలంగాణ పోరాటంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మారొజు వీరన్న ను వివాహం చేసుకొని, ఆయనతో కలిసి అనేక వేదికల మీద పాటలు పాడింది. గోరటి వెంకన్న, మిత్ర, గద్దర్ లతో కలిసి పాటలు పాడుతూ... మలిదశ ఉద్యమ ధూంధాంలో గ్రామగ్రామాన తిరిగి, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 9 April 2017. Cite news requires |newspaper= (help)