Jump to content

మార్కాపురం జిల్లా

Coordinates: 15°44′06″N 79°16′12″E / 15.735°N 79.27°E / 15.735; 79.27
వికీపీడియా నుండి
మార్కాపురం జిల్లా
పై ఎడమ నుండి సవ్యదిశలో: చెన్నకేశవ ఆలయం మార్కాపురం,భైరవకోన గుహ దేవాలయాలు, కంభం సరస్సు
పటం
Coordinates: 15°44′06″N 79°16′12″E / 15.735°N 79.27°E / 15.735; 79.27
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా ఆంధ్ర
ఏర్పడింది31 December 2025
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయంమార్కాపురం
అతిపెద్ద నగరంమార్కాపురం
పరిపాలనా విభాగాలు
జనాభా
 (2011)
 • Total
11,42,313
భాష
 • అధికారిక భాషతెలుగు
అక్షరాస్యత
కాల మండలంUTC+05:30 (IST)
పోస్టల్ ఇండెక్స్ నంబర్
523XXX, 516XXX, 517XXX

మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ప్రాంతంలో 2025 లో కొత్తగా ఏర్పడిన ఒక జిల్లా.[1]జిల్లా ముఖ్యపట్టణం మార్కాపురం.

ఈ జిల్లా ఏర్పాటుకు 30 రోజులలోగా ప్రజలనుండి అభ్యంతరాలు, సూచనలు తెలియుజేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జి.ఓ.ఆర్.టి. సంఖ్య 1497, తేదీ:2025 నవంబరు 27న ప్రాథమిక ప్రకటన జారీచేసింది.[2] ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలపై మంత్రివర్గం 2025 డిసెంబరు 30న సమీక్షించిన తరువాత, జిల్లా కార్యకలాపాలు 2025 డిసెంబరు 31 నుండి అమలులోకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జి.ఓ.ఎమ్.యస్.సంఖ్య: 524 రెవెన్యూ (ల్యాండ్స్ -IV) శాఖ 2025 డిసెంబరు 30న ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రకాశం జిల్లా నుండి 21 మండలాలను విభజించగా ఈ జిల్లా ఏర్పడింది

భౌగోళికం

[మార్చు]

మార్కాపురం జిల్లాకు ఉత్తరాన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, పశ్చిమాన నంద్యాల జిల్లా, తూర్పున పల్నాడు, ప్రకాశం జిల్లాలతో సరిహద్దులుగా ఉంది.

జిల్లాలో నల్లమల, వెలిగొండలు కొండలు ప్రధాన శ్రేణులుగా ఉన్నాయి. నల్లమల సముద్ర మట్టానికి సగటున 620 మీటర్ల ఎత్తులో, నిరంతర నిటారుగా ఉన్న కొండల శ్రేణితో ఉంది. నల్లమలలో నంది కనుమ, మంబాల కనుమ అనే రెండు మార్గాలు ఉన్నాయి. నంది కనుమ బళ్లారి (కర్ణాటకలోని) నుండి కర్నూలు, దోర్నాల, యెర్రగొండపాలెం మీదుగా మార్కాపూర్‌కు వెళుతుంది.

వెలిగొండల భాగాలు ఉత్తర-దక్షిణ దిశలో నడుస్తున్న నిటారుగా ఉన్న కొండల రెండు నిరంతర సమాంతర శ్రేణులుగా ప్రముఖంగా నిలుస్తాయి, మధ్యలో విశాలమైన లోయ ఉంది. తూర్పు కొండల శ్రేణి నుండి వచ్చే నీరు ఉత్తర దిశలో గుండ్లకమ్మ నదికి ప్రవహిస్తుంది.[3]ఈ జిల్లాలో గుండ్లకుమ్మ నది ప్రవహిస్తుంది. తిప్పయపాలెం రిజర్వాయరు, దువ్వలేరు ప్రాజెక్టు, కుంబం చెరువు, భవనాసి చెరువులు ఈ నదిపై నిర్మించబడ్డాయి.

జిల్లాలోని పరిపాలనా విభాగాలు

[మార్చు]

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రెవెన్యూ డివిజను నుండి 13 మండలాలు, కనిగిరి రెవెన్యూ డివిజను నుండి 8 మండలాలు విభజించి మొత్తం 21 మండలాలు ఈ జిల్లాలో చేర్చారు.

అయితే గతంలో మార్కాపురం రెవెన్యూ డివిజనులో ఉన్న (ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు) 13 మండలాలకు అదనంగా లోగడ కనిగిరి రెవెన్యూ డివిజనులో (ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు) ఉన్న 8 మండలాల నుండి పొదిలి , కొనకణమిట్ల మండలాలను అదనంగా మార్కాపురం రెవెన్యూ డవిజనులో చేర్చారు. దానితో మార్కాపురం రెవెన్యూ డివిజనులో 15 మండలాలకు పెరగగా, కనిగిరి రెవెన్యూ డివిజనులో 6 మండలాలకు తగ్గింది.

జిల్లాలోని మండలాలు

[మార్చు]
వ.సంఖ్య రెవెన్యూ డివిజను మండలం గ్రామాల

సంఖ్య

పురుషులు స్త్రీలు మండల జనాభా

మొత్తం (2011)

1 మార్కాపురం గిద్దలూరు 17 13,662 13,315 26,977
2 బెస్తవారిపేట 19 25,071 23,544 48,615
3 రాచర్ల 11 17,441 16,894 34,335
4 కొమరోలు 20 20,892 19,439 40,331
5 కంభం 13 23,963 24,735 48,698
6 అర్థవీడు 12 18,651 17,518 36,169
7 మార్కాపురం 21 62,117 60,867 1,22,984
8 తుర్లపాడు 25 16,744 15,642 32,386
9 యర్రగొండపాలెం 22 33,160 30,903 64,063
10 పుల్లలచెరువు 16 27,258 26,021 53,279
11 త్రిపురాంతకం 15 28,268 26,793 55,061
12 దోర్నాల 19 22,504 21,683 44,187
13 పెద్దారవీడు 16 21,630 20,632 42,262
14 కొనకనమిట్ల 33 25,417 23,842 49,259
15 పొదిలి 29 29,311 28,113 57,424
మొత్తం (ఎ) 288 3,86,089 3,69,941 7,56,030
1 కనిగిరి హనుమంతునిపాడు 25 15,865 15,099 30,964
2 వెలిగండ్ల 26 18,686 17,265 35,951
3 కనిగిరి 39 47,355 45,111 92,466
4 పెదచర్లోపల్లి 19 18,842 18,143 36,985
5 చంద్రశేఖరపురం 36 23,142 21,811 44,953
6 పామూరు 28 28,187 27,770 55,957
మొత్తం (బి) 173 1,52,077 1,45,199 2,97,276
ఎ & బి మొత్తం 461 5,38,166 5,15,140 10,53,306

గమనికలు

  • మండలంలోని నిర్జన గ్రామాలను పరిగణనలోకి తీసుకోలేదు
  • జనాభా వివరాలు 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఉదహరించబడినవి

మూలాలు

[మార్చు]
  1. G.O.MS.No. 524, REVENUE (LANDS-IV)DEPARTMENT, Dated: 30-12-2025
  2. https://x.com/AP_CRDANews/status/1994233808753705190/photo/3
  3. CPO 2022, p. 1.