మార్కియో టాడో
స్వరూపం
| మార్కియో టాడో | |||
| పదవీ కాలం 2009 – 2019 | |||
| ముందు | టకం సోరాంగ్ | ||
|---|---|---|---|
| తరువాత | జిక్కే టాకో | ||
| నియోజకవర్గం | తాలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| ఇతర రాజకీయ పార్టీలు | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మార్కియో టాడో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు తాలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]మార్కియో టాడో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో పీపీఏ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి టకం సోరాంగ్ పై 2,713 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి థాజీ గిచక్ కియోగిపై 813 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో ఆహారం & పౌర సరఫరా శాఖ మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Former MLA Markio Tado resigns from INC". The Arunachal Times. 12 March 2019. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs parliamentary secretaries after leaving Cong | Arunachal CM appoints 26 MLAs parliamentary secretaries after leaving Cong" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 18 September 2016. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "Portfolios reshuffled in Arunachal Pradesh" (in ఇంగ్లీష్). Financialexpress. 21 September 2016. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.