Jump to content

మార్క్స్ బ్రదర్స్

వికీపీడియా నుండి

 

ద మార్క్స్ బ్రదర్స్
1931లో నలుగురు మార్క్స్ బ్రదర్స్ (మొత్తం ఐదుగురు) (పైనుంచి కిందకు: చికో మార్క్స్, హెర్పో మార్క్స్, గ్రూచో మార్క్స్, జెపో మార్క్స్)
మాధ్యమంసినిమా, బ్రాడ్వే, వోడవెల్
జాతీయతఅమెరికన్
క్రియాశీలక సంవత్సరాలు1905–1949
కళలుమాటలతో చమత్కారం, శ్లాప్‌స్టిక్, మ్యూజికల్ కామెడీ, డెడ్‌పాన్
విశేష కృషి, పాత్రలుడక్ సూప్
ఎ నైట్ ఎట్ ద ఓపెరా
పూర్వపు సభ్యులు

మార్క్స్ బ్రదర్స్ అన్నది ఒక అమెరికన్ ఫ్యామిలీ కామెడీ యాక్ట్. 1905 నుంచి 1949 వరకూ మొదట్లో రంగస్థలం మీద (వోడవెల్, బ్రాడ్వే), తర్వాత సినిమాల్లోనూ ఇది బాగా ప్రాచుర్యం చెంది విజయవంతం అయింది.[1][2] మార్క్స్ బ్రదర్స్ యాక్ట్‌తో తీసిన 14 సినిమాల్లో ఐదు అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎఫ్‌ఐ) ఎంపిక చేసిన టాప్ 100 కామెడీ ఫిల్మ్స్ జాబితాలో ఉంది. వాటిలో రెండు - డక్ సూప్ (1933), ఎ నైట్ ఎట్ ద ఓపెరా (1935) టాప్ 15లో ఉన్నాయి. మార్క్స్ బ్రదర్స్‌ని విమర్శకులు, సినీ పండితులు, అభిమానులు కూడా 20వ శతాబ్దిలో అత్యంత ప్రభావవంతమైన హాస్యనటులుగా పేర్కొంటూ ఉంటారు. ఏఎఫ్‌ఐ వారి 100 ఇయర్స్... 100 స్టార్స్‌లో 25 క్లాసికల్ హాలీవుడ్ సినిమాలో అతిగొప్ప మేల్ స్టార్స్ జాబితాలో మార్క్స్ బ్రదర్స్‌ని చేర్చారు. ఈ జాబితాలో ఇండివిడ్యువల్‌గా కాక సముదాయంగా చేరిన నటులు వీళ్ళు మాత్రమే.

బ్రదర్స్‌ని అందరూ సామాన్యంగా వారి స్టేజ్ నేమ్స్‌తోనే పిలుస్తారు. అవి: చికో, హార్పో, గ్రూచో, గమ్మో, జెపో. మార్క్స్ బ్రదర్స్‌కి ఆరవ సోదరుడు ఉన్నాడు. అతను వీరందరికన్నా పెద్ద. పేరు - మాన్‌ఫ్రెడ్ (మేనీ), అతను బాల్యంలోనే మరణించాడు; అతని జ్ఞాపకార్థం జెపోకి మాన్‌ఫ్రెడ్ అన్న మిడిల్ నేమ్ ఉంటుంది కథలో.

మొత్తం మార్క్స్ కుటుంబం అందరూ ఉన్న ఒకే ఒక్క ఫోటో. 1915 నాటిది. ఎడమ నుంచి కుడికి: గ్రూచో, గమ్మో, మిన్నీ (తల్లి), జెపో, శామ్ (తండ్రి), చికో, హార్పో

ఈ యాక్ట్ (ప్రదర్శన) మౌలికంగా పెద్దవాళ్ళైన ముగ్గురు సోదరులతో ముడిపడి ఉంటుంది, వారు చికో, హార్పో, గ్రూచో. ఈ మూడు పాత్రలకు బాగా విభిన్నమైన విలక్షణమైన వ్యక్తిత్వాలను అభివృద్ధి చేశారు. 1950 తర్వాత ఈ గ్రూప్ విడిపోయారు. ఆ తర్వాత గ్రూచో టెలివిజన్ రంగంలో కెరీర్ పున:ప్రారంభించి మంచి విజయాన్ని సాధించాడు. అయితే, హార్పో, చికో అరుదుగానే వినోద రంగంలో కనిపించారు. చిన్నవారైన గమ్మో, జెపో పెద్దవారి స్థాయిలో తమ స్టేజీ వ్యక్తిత్వాలని అభివృద్ధి చేయలేదు. వీరిద్దరూ వ్యాపారంపై ఆసక్తితో నటన విడిచిపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో పెద్ద థియేట్రికల్ ఏజెన్సీని నడిపి దాని ద్వారా తమ అన్నలకు, ఇతర నటులకు కూడా సేవలందించారు. గమ్మో అసలు ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. జెపో మొదటి ఐదు సినిమాల్లోనూ మిగిలిన సోదరుల పాత్రలతో పోలిస్తే అంతగా హాస్యం ఉండని, సాధారణ పాత్రల్లో నటించాడు. బ్రదర్స్‌ కెరీర్ మొదటి దశలో వాళ్ళ అమ్మ మిన్నీ మార్క్స్ సహాయం ఎంతగానో ఉపకరించింది. ఆమె 1929 మరణించేవరకూ బ్రదర్స్‌కు మేనేజర్‌గా వ్యవహరించింది.

మూలాలు

[మార్చు]
  1. "The Three Nightingales (1907) – The Marx Brothers". www.marx-brothers.org. Retrieved 2019-03-05.
  2. Marx, Groucho (December 28, 2022). Groucho & Cavett. PBS.