మార్క్ రాండోల్ఫ్
| మార్క్ రాండోల్ఫ్ | |
|---|---|
2017లో మార్క్ రాండోల్ఫ్ | |
| జననం | మార్క్ బెర్నేస్ రాండోల్ఫ్ April 29, 1958 (age 67) చప్పాక్వా, న్యూయార్క్, అమెరికా |
| వృత్తి | నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ |
| భార్య / భర్త |
లోరైన్ కియెర్నాన్ (m. 1987) |
| పిల్లలు | 3 |
మార్క్ బెర్నేస్ రాండోల్ఫ్ (ఆంగ్లం: Marc Randolph; జననం 1958 ఏప్రిల్ 29) ఒక అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు, సలహాదారు, స్పీకర్.[1] ఆయన నెట్‌ఫ్లిక్స్ (Netflix) సహ వ్యవస్థాపకుడు, మొదటి కార్యనిర్శహణ అధికారి (సీఈఓ).[2]
మాక్వర్ల్డ్ (Macworld) పత్రిక అమెరికా సంచిక, కంప్యూటర్ మెయిల్-ఆర్డర్ వ్యాపారాలు మాక్వేర్హౌస్ (MacWarehouse) సీరియల్ వ్యవస్థాపకుడు. ఆయన లుకర్ డేటా సైన్సెస్, చబ్బీస్ షార్ట్స్ బోర్డులలో పనిచేస్తున్నాడు.[3] దీనికి ముందు, ఆయన గెటబల్, రాఫ్టర్, రెడీఫోర్స్ బోర్డులలో పనిచేసాడు.
ఆయన లాండర్ లోని నేషనల్ అవుట్డోర్ లీడర్షిప్ స్కూల్ (NOLS) ధర్మకర్తల మండలికి ఛైర్మన్.[4][5][6]
ప్రారంభ జీవితం
[మార్చు]మార్క్ రాండోల్ఫ్ న్యూయార్క్ లోని చప్పాక్వా (Chappaqua)లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి స్టీఫెన్ బెర్నేస్ రాండోల్ఫ్, ఆస్ట్రియాకు చెందిన అణు ఇంజనీర్, ఆర్థిక సలహాదారు. కాగా, తల్లి మురియల్ లిప్చిక్, తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతుంది.[7][8][9] ఆయన తండ్రి తరపు పినతండ్రులలో ఒకరు మానసిక విశ్లేషణ మార్గదర్శకుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మరొ బంధువు ఎడ్వర్డ్ బెర్నేస్, ప్రజా సంబంధాలు, ప్రచార రంగంలో ఆస్ట్రియన్-అమెరికన్ మార్గదర్శకుడు.[10] ఆయన న్యూయార్క్ లోని హామిల్టన్ కళాశాల నుండి భూగర్భ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మార్క్ రాండోల్ఫ్ 1987 నుండి లోరైన్ కీర్నాన్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు.[12] వారు కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ లో నివసిస్తున్నారు.[13]
ఆయన అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన 2019 పుస్తకం దట్ విల్ నెవర్ వర్క్ః ది బర్త్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్ అండ్ ది అమేజింగ్ లైఫ్ ఆఫ్ యాన్ ఐడియా (That Will Never Work: The Birth of Netflix and the Amazing Life of an Idea ) రచయిత, అదే పేరుతో ఒక పోడ్కాస్ట్ ను నిర్వహిస్తున్నాడు.[14] ఆయన హై పాయింట్ విశ్వవిద్యాలయం, దాని బెల్క్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ వ్యవస్థాపకుడు.[15]
మూలాలు
[మార్చు]- ↑ "Marc Randolph, Founder at Looker Data Sciences, Inc. - Relationship Science". Relationship Science (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-13. Retrieved 2017-09-19.
- ↑ "First Online DVD Rental Store Opens: Netflix Site Offers Unprecedented Title Selection, Availability and Convenience". Business Wire. April 14, 1998. Archived from the original on February 25, 2017. Retrieved February 24, 2017.
- ↑ Keating 2012, p. 19.
- ↑ Randolph, Marc. "Netflix Co-Founder Marc Randolph on Leadership and How to Learn It" (in ఇంగ్లీష్). Retrieved 2017-09-19.
- ↑ "NOLS | Our Team". www.nols.edu (in ఇంగ్లీష్). Retrieved 2017-09-19.
- ↑ "Board of Directors - 1% For The Planet". www.onepercentfortheplanet.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2017-09-27. Retrieved 2017-09-19.
- ↑ Sperling, Nicole (2019-09-15). "Long Before 'Netflix and Chill,' He Was the Netflix C.E.O." The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2023-12-24.
- ↑ "Paid Notice: Deaths RANDOLPH, STEPHEN B." New York Times. March 16, 2000.
- ↑ Rose, Derek (March 16, 2004). "W'chester Granny Dies on Viet Trip". New York Daily News.
- ↑ Keating 2012, p. 17.
- ↑ Keating, Gina (2012). Netflixed: The Epic Battle for America's Eyeballs. New York: Portfolio/Penguin. p. 18. ISBN 9781591846598.
- ↑ "About". Marc Randolph. Retrieved July 4, 2025.
- ↑ Ashburn, Nancy. "Netflix Co-Founder Inspires Future Entrepreneurs". University of Missouri System. Retrieved July 4, 2025.
- ↑ "About". Marc Randolph. Retrieved July 4, 2025.
- ↑ "HPU Invites Community to a Conversation with Netflix Co-Founder Marc Randolph". High Point University. March 5, 2025. Retrieved July 4, 2025.