మార్గన్
| మార్గన్ | |
|---|---|
| దర్శకత్వం | లియో జాన్ పాల్ |
| రచన | లియో జాన్ పాల్ |
| నిర్మాత |
|
| మాటలు & పాటలు | భాష్య శ్రీ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | ఎస్. యువ |
| కూర్పు | లియో జాన్ పాల్ |
| సంగీతం | విజయ్ ఆంటోని |
నిర్మాణ సంస్థ |
|
| పంపిణీదార్లు | ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్[1] |
విడుదల తేదీs | 2025 జూన్ 27 (థియేటర్) 2025 జులై 25 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
మార్గన్ 2025లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోని, అజయ్ ధిషన్, సముద్రఖని, బ్రిగిడా సాగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 28న విడుదల చేసి,[2] సినిమాను జూన్ 27న విడుదల చేశారు.
ఈ సినిమాను జూన్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
కథ
[మార్చు]హైదరాబాద్‌లో యువతి రమ్యను గుర్తుతెలియని వ్యక్తి ఇంజక్షన్ ద్వారా దారుణ హత్య చేసి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేయగా ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఈ విషయం ముంబయిలో అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ (విజయ్ ఆంటోని) దృష్టికి వెళ్లడంతో ఓ స్పెషల్ టీంతో హైదరాబాద్‌లో ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా అరవింద్ (అజయ్ ధీషన్) పై అనుమానం కలుగుతుంది. అరవింద్ ని పట్టుకుని అతడు ఇచ్చిన క్లూస్ ఆధారంగా వరుస మర్డర్స్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ దారుణమైన హత్యలకు కారణం ఎవరు? వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ఇలా ఇంజెక్షన్‌తో చంపుతున్నారు? కేసును సాల్వ్ చేసే క్రమంలో అరవింద్ పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు? ధ్రువకు ఎదురైన సవాళ్లేంటి ? చివరికి హంతకులను ధ్రువ పట్టుకున్నాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- ముంబై ఏడీజీపీ ధృవ కుమార్ ఐపీఎస్‌గా విజయ్ ఆంటోని
- అరవింద్ గా అజయ్ ధిషన్[5]
- సముద్రఖని
- శేషితా రాజు
- బ్రిగిడా సాగా
- దీప్శిఖ
- అర్చన
- మహానటి శంకర్
- వినోద్ సాగర్
- అభిషేక్ వినోద్
- కుమార్ నటరాజన్
- రామచంద్రన్ దురైరాజ్
- అజిత్ కోషి
- సూపర్‌గుడ్ సుబ్రమణి
- మరియా విన్సెంట్
- స్మేహ మణిమేగలై
- మైథిలి సత్యజిత్
- గురుఫరన్
- ఆదిత్య కతిర్, ఇంటి బ్రోకర్‌గా
మూలాలు
[మార్చు]- ↑ "ఏషియన్ సురేశ్ ద్వారా మార్గన్". Chitrajyothy. 14 June 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా మార్గన్.. వణికించే ట్విస్టులతో విజయ్ ఆంటోని ట్రైలర్". V6 Velugu. 29 May 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "ఓటీటీలో 'మార్గన్'.. సడెన్‌గా తెలుగు స్ట్రీమింగ్". Sakshi. 25 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "రివ్యూ: మార్గన్.. విజయ్ ఆంటోనీ సరికొత్త ప్రయోగం ఫలించిందా?". Eenadu. 27 June 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "మేనల్లుడే విలన్‌గా మార్గన్". Chitrajyothy. 14 May 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.