మార్పు బాలకృష్ణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్పు బాలకృష్ణమ్మ
BALAKRISHNAMMA marpu.JPG
మార్పు బాలకృష్ణమ్మ
జననంమార్పు బాలకృష్ణమ్మ
జూన్ 13, 1930
శ్రీకాకుళం జిల్లా మందస మండలం భిన్నల మదనాపురం
మరణంజనవరి 6, 2013
హైదరాబాద్
ఇతర పేర్లుమార్పు బాలకృష్ణమ్మ
ప్రసిద్ధిఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషేన్ మాజీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
తండ్రిమార్పు పద్మనాభం

మార్పు బాలకృష్ణమ్మ (జూన్ 13, 1930 - జనవరి 6, 2013) ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషేన్ మాజీ అధ్యక్షుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు.

బాల్యం[మార్చు]

1930 జూన్ 13 వ తేదీన శ్రీకాకుళం జిల్లా మందస మండలం భిన్నల మదనాపురంలో జన్మించిన బాలకృష్ణమ్మ తండ్రి మార్పు పద్మనాభం నుండి కమ్యూనిస్టు రాజకీయాలను వంటపట్టించు3కున్నారు. మరణించిన నాటి వరకూ అదే రాజకీయ ఒరవడిలో రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో ఇతర ప్రజా సంఘాలతో కలిసి పనిచేశారు. మార్పు బాలకృష్ణమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ప్రగతి భావాలు[మార్చు]

మార్పు బాలకృష్ణమ్మ విద్యార్థిదశ నుండే ప్రగతి భావాలను కలిగి ఉండేవారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా చేరి ఉపాధ్యాయ ఉద్యమంలో చేరారు. తర్వాత ఆయన ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడిగా అవతరించారు. ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ను 1960లో ప్రారంభించి మిలిటెంట్ పోరాటాలను నడిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ధర్నా వంటి కొత్త పోరాట రూపాలను ప్రవేశపెట్టి విజయం సాధించారు. మార్పు బాలకృష్ణమ్మ 1969 జూన్‌లో గుడివాడలో జరిగిన ఎపిటిఎఫ్ సభల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1970లో పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయ్యారు. రెండున్నర సంవత్సరాల పాటు సోంపేట, విశాఖపట్నం, రాజమండ్రి తదితర జైళ్లలో ఉండి తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. 1974 నుండి 1985 వరకూ ఉత్తర సర్కార్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా కొనసాగారు. శాసనమండలి ప్రోగ్రెసివ్ డెముక్రటిక్ ఫ్రంట్‌కు నాయకుడిగా ఉండి శాసనమండలిని ఉపాధ్యాయ ఉద్యమ వేదికగా మార్చగలిగారు. 1987లో ఎపిటిఎఫ్‌ను పునర్వ్యవస్థీకరించిన తర్వాత 2008 వరకూ ప్రధానకార్యదర్శిగానూ కొనసాగారు. ఉపాధ్యాయ ఉద్యమకర్తగా అనేక విజయాలను సాధించారు.

ఏ.పి.టి.యఫ్ ఉద్యమ ఘట్టాలు[1][మార్చు]

  • 1969 : జూన్ 3, 4, 5 తేదిలలో గుడివాడలో ఫేడరేషన్ రాష్ట్ర మహా సభలలో చెన్నుపాటి స్థానంలో ఉత్తరాంధ్ర ఉద్యమ నిర్మాత మార్పు బాలకృష్ణమ ఫేడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక
  • 1980 : యం యల్ సిగా మార్పు తిరిగి ఎన్నిక
  • 1981 : మార్చిలో - ఫెడరేషన్ అధ్యక్షులు, శ్యాసన మండలిలో పి డి యఫ్ నాయకులు మార్పు బాలకృష్ణమ్మ ప్రపంచ తెలుగు మహా సభలు కోలాలంపూర్ లో పోల్గోనుట.
  • 1983 : ఏ.పి.టి.యఫ్ అధ్యక్షులు మార్పు బాలకృష్ణమ్మ ప్యాప్తో సెక్రటరీ జనరల్గా ఎన్నిక
  • 1985 : ఆగష్టు 19 న సెక్రటేరియట్ ముందు జరిగిన పికీటింగ్ లో ప్యాప్తో సెక్రటరీ జెనరల్ మార్పు బాలకృష్ణమ్మతో బాటు వందలాది మంది కార్యకర్తల ఫై లాటీఛార్జ్, 3 వేల మంది నిర్బంధం
  • 1987 : ఆగష్టు -విశాఖపట్నంలో ఎ.పి.టి.యఫ్ 14 వ విద్య మహాసబాలు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఎ.పి.టి.యఫ్ మరియు ఉపాధ్యాయ ఉద్యమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సింగరాజు రామకృష్ణయ్య ముతా నాయకత్వాన్ని తొలగిచి ఎ.పి.టి.యఫ్. పునర్వ వ్యవస్దీకరణ, అధ్యక్షులుగా పిళ్లా సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా మార్పు బాలకృష్ణమ్మ ఎన్నిక, ఎ.పి.టి యఫ్ అధికారిక పత్రిక ఉపాధ్యాయ ప్రగతి ప్రారంబం.
  • 1996 : అక్టోబరులో - 61 సమస్యల పరిష్కారం కొరకు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మార్పు బాలకృష్ణమ్మ 18 వ తేదీ నుండి, సబ్ కమిటీ సభ్యులు 19 వ తేదీ నుండి ఆమరణ నిరాహారదీక్షకు నోటిసు.
  • 1998 : నవంబరు 9 - అఖిల భారత విద్య సంఘాలు సమక్య (ఇ ఫి యా ) ఎన్నికలు ఢిల్లీలో :ధక్షణ మండల విభాగానికి ఇఫియ ఉపద్యక్షులుగా మార్పు బాలకృష్ణమ్మ, కార్యదర్శిగా సి .హెచ్.కొండేస్వరరావు, కార్యవర్గ సభ్యులుగా జి. సత్యనారాయణ ఎన్నిక.
  • 2008 : ఫిబ్రవరి 10 న రాష్ట్ర కౌన్సిల్ లో మార్పు బాలకృష్ణమ్మ ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి ఇచ్చిక విరమణ .
  • 2008 : ఫిబ్రవరి 10 న ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సన్నశెట్టి రాజశేఖర్, ఎమ్.బాలన్నల ఏకగ్రీవ ఎన్నిక. ఏ.పి.టి.ఎఫ్ సలహాదారులుగా మార్పు బాలకృష్ణమ్మ నియామకం.

మరణం[మార్చు]

ఈయన జనవరి 6, 2013హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు.

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]