అక్షాంశ రేఖాంశాలు: 34°08′38″N 75°06′36″E / 34.144°N 75.110°E / 34.144; 75.110

మార్సర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్సర్ సరస్సు
మార్సర్ సరస్సు is located in Jammu and Kashmir
మార్సర్ సరస్సు
మార్సర్ సరస్సు
అక్షాంశ,రేఖాంశాలు34°08′38″N 75°06′36″E / 34.144°N 75.110°E / 34.144; 75.110
సరస్సులోకి ప్రవాహంమంచు కరగడం
ఘనీభవనండిసెంబర్ నుంచి మార్చ్

మార్సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయ ప్రాంతంలో గల అనంతనాగ్ జిల్లాలోని అరు ప్రాంతంలో ఉంది. అరు ప్రాంతంలో ఉన్న అనేక ప్రసిద్ధ సరస్సులలో ఈ సరస్సు ఒకటి.[1]

ప్రత్యేకత

[మార్చు]

తార్సర్ సరస్సు అని పిలువబడే అదే స్వభావం కలిగిన మరొక సరస్సు నుండి 4,000 మీటర్ల(13,000 అడుగులు) ఎత్తులో ఉన్న పర్వతంతో ఈ సరస్సు వేరు చేయబడి ఉంటుంది. ఈ రెండు సరస్సుల సామీప్యత, సారూప్య భౌతిక లక్షణాల కారణంగా, రెండు సరస్సులను జంట సోదరీమణులు అని పిలుస్తారు. ఈ రెండు సరస్సులు అనేక సంవత్సరాలుగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరు పొందాయి. ఇది తార్సర్-మార్సర్ ట్రెక్ అనే పేరుతో కాశ్మీర్ లోయలో అత్యంత ప్రసిద్ధమైన ట్రెక్‌లలో ఒకటిగా ప్రసిద్ది చెందింది.[2]

అనుసంధానం

[మార్చు]

ఈ సరస్సు నుండి ఒక ప్రవాహం మొదలై డాచిగామ్ లోయ గుండా ప్రయాణిస్తూ, హర్వాన్ గార్డెన్ సమీపంలో శ్రీనగర్‌లోకి ప్రవేశిస్తుంది, సర్బంద్ రిజర్వాయర్‌ని నింపి, దగ్వాన్ నల్లా ద్వారా తెల్బల్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాదేవ్ పర్వతం నుండి ప్రవహించే మరొక ప్రవాహంతో కలుస్తుంది. ఈ ప్రవాహాన్ని దాల్ సరస్సు ప్రాథమిక వనరుగా తెల్బల్ నల్లా అని పిలుస్తారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Marsar Lake Pahalgam". Tour my India. Retrieved 2016-09-29.
  2. S. L. Sadhu (2004). Eng Hali (15). Sahitya Akademi. p. 28. ISBN 9788126019540.
  3. "Tarsar Marsar Trek". Trek The Himalayas: A World of Trekking And Exploring. Archived from the original on 2016-09-30. Retrieved 2016-09-30.