మాలా రామ్ గంగ్వాల్
| మాలా రామ్ గంగ్వాల్ | |||
| పదవీ కాలం 1998 – 2013 | |||
| ముందు | స్వరూప్ చంద్ రాజన్ | ||
|---|---|---|---|
| తరువాత | గిరీష్ సోని | ||
| నియోజకవర్గం | మోతీ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1949 ఆగస్టు 14 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | రాణి | ||
| నివాసం | మాదిపూర్, ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మాలా రామ్ గంగ్వాల్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మాలా రామ్ గంగ్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మాదిపూర్ డివిజన్ 1983 నుండి 1991 వరకు కార్పొరేటర్‌గా పని చేసి 1993 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాదిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వరూప్ చంద్ రాజన్ చేతిలో 4,875 ఓట్ల ఓడిపోయాడు. ఆయన 1998 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ అటల్‌పై 8,096 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మాలా రామ్ గంగ్వాల్ 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాదిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కైలాష్ పై 6,339 ఓట్ల మెజారిటీతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కైలాష్ సంక్లాపై 8,532 ఓట్ల మెజారిటీతో ఓడించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] మాలా రామ్ గంగ్వాల్ 2013 ఎన్నికలలో మాదిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 25,545 ఓట్లతో మూడోస్థానంలో, 2015 ఎన్నికలలో 10,350 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Madipur Assembly Seat Election Final Result 2025: मादीपुर में AAP की पूर्व मंत्री की हार, बीजेपी के कैलाश गंगवाल ने बंपर वोटों से हराया". TV9 Bharatvarsh. 8 February 2025. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.
- ↑ "Mala Ram Gangwal (59), Cong, Madipur". Hindustan Times. 15 November 2008. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.
- ↑ "Madipur Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. the original నుండి 19 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2025.